Home
Mobile

వన్‌ప్లస్‌ నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కానుందా.. ఇటీవల వచ్చిన లీక్స్‌ ఏం చెబుతున్నాయి..?

వన్‌ప్లస్‌ నుంచి భారత్‌ మార్కెట్‌లో గత నెలలో వన్‌ప్లస్‌ 15 స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. రెండు రోజుల క్రితం వన్‌ప్లస్‌ 15R స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. ఇదే సిరీస్‌ నుంచి మరో ఫోన్‌ త్వరలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. వన్‌ప్లస్‌ 15s పేరుతో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే వన్‌ప్లస్ 13s మోడల్‌ భారత్ లో అందుబాటులో ఉంది. కంపాక్ట్‌ మోడల్‌గా వచ్చినా.. శక్తివంతమైన చిప్‌సెట్‌, మెరుగైన బ్యాటరీ సహా కెమెరాలను కలిగి ఉంది.

వన్‌ప్లస్‌ 15s ‌స్మార్ట్‌ఫోన్‌ ఇటీవలే బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ వెబ్‌సైట్‌లో కనిపించింది. CPH2793 మోడల్‌ నంబర్‌తో కనిపించింది. టిప్‌స్టర్ గ్యాడ్జె్ట్స్‌డేటా వివరాల ఆధారంగా వన్‌ప్లస్ 15s స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 200MP లేదా 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్‌, అల్ట్రావైడ్‌ లెన్స్‌తో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది.

oneplus 15s smartphone

చిప్‌సెట్, OS! :
ఈ స్మార్ట్‌ఫోన్‌ (OnePlus 15s Smartphone) క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 8 ఇలైట్‌ జెన్‌ 5 చిప్‌సెట్‌తో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిప్ LPDDR5x ర్యామ్‌తో జతచేసి ఉంటుందని అంచనా వేస్తున్నారు. లేటెస్ట్‌ ఆండ్రాయిడ్ OS వెర్షన్‌తో అందుబాటులోకి రానుంది.

భారీ బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్‌ 165Hz రీఫ్రెష్ రేట్‌తో 6.32 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో విడుదల కానుందని భావిస్తున్నారు. మెటల్‌ ఫ్రేమ్‌, IP69 రేటింగ్‌ డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉండే అవకాశం ఉంది. టిప్‌స్టర్‌ గ్యాడ్జెట్స్‌డేటా ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి.

వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.54999 కు లాంచ్ అయింది. భారత్‌ మార్కెట్‌లో వన్‌ప్లస్ 15s హ్యాండ్‌సెట్‌ 12GB ర్యామ్ వేరియంట్ ధర రూ.60999 కు లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు.

అయితే వన్‌ప్లస్‌ నుంచి అధికారికంగా ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. ఈ లీక్స్‌ పైనా ఎటువంటి స్పందన తెలియజేయలేదు. ఈ ఫోన్ విడుదల తేదీ సహా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లపై త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

వన్‌ప్లస్‌ 15R స్మార్ట్‌ఫోన్‌ :
రెండు రోజుల క్రితం భారత్ మార్కెట్‌లో విడుదల అయిన వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్‌ 165Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.83 అంగుళాల 1.5K అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్‌ 5 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 16 ఆధారిత OxygenOs 16 పైన పనిచేస్తుంది.

కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX906 ప్రైమరీ కెమెరా (OIS), 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7400mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. IP66 + IP68 + IP69 + IP69K రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
oneplus 15s smartphone may launch in india in 2026 here are the leaks
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X