6జీబి ర్యామ్‌తో ఫోన్, ఆ ధరే నిజమైతే..?

Written By:

చైనా ఫోన్‌ల కంపెనీ OnePlus తన లేటెస్ట్ వర్షన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్, 'వన్‌ప్లస్ 3'ని రేపటి నుంచి ఇండియన్ మార్కెట్లో విక్రయించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్‌లను ఆన్‌లైన్ వీఆర్ ఈవెంట్ ద్వారా నేడు విడుదల చేయనున్నారు. Amazon Indiaలో ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యంకానున్న వన్‌ప్లస్ 3 ఫోన్‌లను జూన్ 15 నుంచి ఎటువంటి ఇన్విటేషన్స్ లేకండా సొంతం చేసుకోవచ్చు. సేల్ మధ్యాహ్నం 12.30 నుంచి స్టార్ట్ అవుతుంది.

6జీబి ర్యామ్‌తో ఫోన్, ఆ ధరే నిజమైతే..?

తాజాగా తెలుస్తోన్న సమాచారం మేరకు రేపటి సేల్‌ను దృష్టిలో ఉంచుకుని వన్‌ప్లస్ ఈ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను భారీ మొత్తంలో హాంగ్‌కాంగ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలియవచ్చింది. రూ.22,858 ధర ట్యాగ్‌తో 24,480 వన్‌ప్లస్ 3 యూనిట్‌లు చెన్నైకు చేరుకున్నట్లు తెలుస్తోంది. భారీ అంచానలతో విడుదల కాబోతున్న ఈ డివైస్‌కు సంబంధించి ఫీచర్లను కంపెనీ ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించలేదు. 6జీబి, 4జీబి ర్యామ్‌లతో విడుదలయ్యే ఈ ఫోన్‌లకు సంబంధించి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న అనధికారిక స్పెక్స్‌ను ఓ సారి చూద్దాం...

Read More : రూటు మార్చిన బిచ్చగాళ్లు, వాట్సాప్‌లో కష్టసుఖాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

OnePlus 3 ఫోన్ అనధికారిక స్పెసిఫికేషన్స్..

వన్‌ప్లస్ 3 స్మార్ట్‌ఫోన్, పూర్తిస్థాయి హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లేతో లభ్యమయ్యే అవకాశం ఉంది. రిసల్యూషన్ 1920×1080పిక్సల్స్.

 

OnePlus 3 ఫోన్ అనధికారిక స్పెసిఫికేషన్స్..

వన్‌ప్లస్ 3 స్మార్ట్‌ఫోన్, 2.15గిగాహెర్ట్జ్ క్లాక్ వేగంతో కూడిన శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 820 సాక్ తో వచ్చే అవకాశం, అడ్రినో 530 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం,

OnePlus 3 ఫోన్ అనధికారిక స్పెసిఫికేషన్స్..

వన్‌ప్లస్ 3 స్మార్ట్‌ఫోన్, 4జీబి ఇంకా 6జీబి ర్యామ్ వేరియంట్‌లలో లభ్యమయ్యే అవకాశం ఉంది. 64జీబ ఇంటర్నల్ స్టోరేజ్ డివైస్‌కు ప్లస్ పాయింట్ కానుంది.

 

OnePlus 3 ఫోన్ అనధికారిక స్పెసిఫికేషన్స్..

వన్‌ప్లస్ 3 స్మార్ట్‌ఫోన్, శక్తివంతమైన 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో లభ్యమయ్యే అవకాశం, ఈ కెమెరా ద్వారా 4కే క్వాలిటీ వీడియోలను చిత్రీకరించుకోవచ్చు. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా ఉత్తమ క్వాలిటీ సెల్ఫీలను చిత్రీకరించుకోవచ్చు.

 

OnePlus 3 ఫోన్ అనధికారిక స్పెసిఫికేషన్స్..

వన్‌ప్లస్ 3 స్మార్ట్‌ఫోన్ తన సొంత ఆక్సిజన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో కూడిన ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ 6.0 మార్ష్‌‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.

 

OnePlus 3 ఫోన్ అనధికారిక స్పెసిఫికేషన్స్..

4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ టైప్-సీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్.

 

OnePlus 3 ఫోన్ అనధికారిక స్పెసిఫికేషన్స్..

రూమర్ మిల్స్ చెబుతోన్న దాని ప్రకారం వన్‌ప్లస్ 3 స్మార్ట్‌ఫోన్ 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఆన్ ద బోర్డ్‌తో వచ్చే అవకాశం.

 

OnePlus 3 ఫోన్ అనధికారిక స్పెసిఫికేషన్స్..

రూమర్ మిల్స్ చెబుతోన్న దాని ప్రకారం వన్‌ప్లస్ 3 స్మార్ట్‌ఫోన్ 4జీబి ర్యామ్ వర్షన్‌ను రూ.22,000కు, 6జీబి ర్యామ్ వర్షన్‌ను రూ.24,000కు విక్రయించే అవకాశం ఉంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
OnePlus 3 To be Available in India From June 15: All You Need to Know. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot