వన్‌ప్లస్ 3 vs షియోమీ ఎంఐ5 ( ఏది కొనాలి..?)

|

చైనా ఫోన్‌‌ల కంపెనీ OnePlus భారీ అంచనాల మధ్య తన వన్‌ప్లస్ 3 స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ 6జీబి ర్యామ్ ఫోన్ ధర రూ.27,999. Amazon Indiaలో ఎక్స్ క్లూజివ్‌గా లభ్యమవుతోంది. ఈ ఫోన్ కొనుగోలు పై స్పెషల్ లాంచ్ ఆఫర్లను వన్‌ప్లస్ ప్రకటించింది. వాటి వివరాల...

Read More : చైనాలో సంచలనం, ఒకరి తల మరొకరి శరీరానికి!

వన్‌ప్లస్ 3 vs షియోమీ ఎంఐ5 ( ఏది కొనాలి..?)

వన్‌ప్లస్ 3 స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకునే యూజర్లు 12 నెలల పాటు Saavn Pro యాప్ ద్వారా అన్‌లిమిటెడ్ యాడ్-ఫ్రీ మ్యూజిక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వన్‌ప్లస్ కేర్ అందించే 12 నెలల యాక్సిడెంటల్ డ్యామెజ్ ప్రొటెక్షన్ వర్తిస్తుంది. ఐడియా కస్టమర్లు 12 నెలల డబుల్ డేటాను ఆస్వాదించవచ్చు. కైండిల్ యాప్ ద్వారా రూ.500 విలువ చేసే ఇబుక్ ప్రమోషన్ క్రెడిట్స్‌ను పొందవచ్చు. OnePlus 3 స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన Xiaomi Mi 5తో విశ్లేషిస్తూ spec comparisonను మీ ముందు ఉంచుతున్నాం...

Read More : 20 లెటేస్ట్ ఫోన్‌లు.. అన్నీ సూపర్!

 OnePlus 3 vs Xiaomi Mi5, Spec comparison

OnePlus 3 vs Xiaomi Mi5, Spec comparison

వన్‌ప్లస్ 3 స్మార్ట్‌ఫోన్‌, అనోడైజిడ్ అల్యూమినియం యునిబాడీ డిజైన్‌తో వస్తోంది. డివైస్ మందం 7.35 మిల్లీ మీటర్లు. బరువు 158 గ్రాములు.

మరోవైపు షియోమీ ఎంఐ 5, ప్రీమియమ్ 3డీ గ్లాస్ బాడీతో వస్తోంది. మెటల్ ఫ్రేమ్ ఎడ్జెస్ ఆకట్టుకుంటాయి. ఫోన్ మందం 7.25 మిల్లీ మీటర్లు, బరువు 129 గ్రాములు.

 OnePlus 3 vs Xiaomi Mi5, Spec comparison

OnePlus 3 vs Xiaomi Mi5, Spec comparison

వన్‌ప్లస్ 3 స్మార్ట్‌ఫోన్‌, 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ఫ్లేతో వస్తోంది. రిసల్యూషన్ వచ్చేసరికి 1920× 1080 పిక్సల్స్. 2.5డీ కర్వుడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్. ఈ డిస్‌ఫ్లే సన్‌లైట్‌లోనూ గుడ్ రీడబులిటీని అందిస్తుంది.

మరోవైపు షియోమీ ఎంఐ 5, 5.15 అంగుళాల ఐపీఎస్ డిస్‌ఫ్లేతో వస్తోంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్. ఈ హ్యాండ్‌సెట్‌లో ఏర్పాటు చేసిన సన్‌లైట్ డిస్‌ప్లే పరిసరాలను బట్టి తన బ్రైట్నెస్‌ను అడ్జస్ట్ చేసుకుంటుంది.

OnePlus 3 vs Xiaomi Mi5, Spec comparison
 
OnePlus 3 vs Xiaomi Mi5, Spec comparison

ప్రాసెసింగ్ డిపార్ట్‌మెంట్‌కు వచ్చేసరికి ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఒకటే చిప్‌సెట్‌ను షేర్ చేసుకున్నాయి. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లలో 2.15గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేయటం జరిగింది. గ్రాఫిక్ డిపార్ట్‌మెంట్ బాధ్యతలను అడ్రినో 530 యూనిట్ చూసుకుంటుంది.

OnePlus 3 vs Xiaomi Mi5, Spec comparison

OnePlus 3 vs Xiaomi Mi5, Spec comparison

వన్‌ప్లస్ 3 స్మార్ట్‌ఫోన్‌, శక్తివంతమైన 6జీబి ఎల్‌పీడీడీఆర్4 ర్యామ్‌తో వస్తోంది. 64జీబి ఇంటర్నల్ మెమరీ. మైక్రోఎస్డీ ఆప్షన్ లేకపోవంటంతో ఈ స్టోరేజ్‌తోనే సరిపెట్టుకోవల్సి ఉంటుంది.

మరోవైపు షియోమీ ఎంఐ 5, 3జీబి ర్యామ్‌తో వస్తోంది. 32జీబి ఇంటర్నల్ మెమరీ. మైక్రోఎస్డీ ఆప్షన్ లేకపోవంటంతో ఈ స్టోరేజ్‌తోనే సరిపెట్టుకోవల్సి ఉంటుంది.

OnePlus 3 vs Xiaomi Mi5, Spec comparison

OnePlus 3 vs Xiaomi Mi5, Spec comparison

వన్‌ప్లస్ 3 స్మార్ట్‌ఫోన్‌, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, సోనీ ఐఎమ్ఎక్స్298 సెన్సార్, f/2.0 అపెర్చుర్, పీడీఏఎఫ్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్, 720 పిక్సల్ స్లో మోషన్ రికార్డింగ్), ఫోన్ ముందు వైపు ఏర్పాటు 8 మెగా పిక్సల్ కెమెరా ద్వారా నాణ్యమైన సెల్ఫీలతో పాటు 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్‌ను ఆస్వాదించవచ్చు.

OnePlus 3 vs Xiaomi Mi5, Spec comparison

OnePlus 3 vs Xiaomi Mi5, Spec comparison

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు, తమ తమ సొంత యూజర్ ఇంటర్‌ఫేస్‌లతో కూడిన ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి.

OnePlus 3 vs Xiaomi Mi5, Spec comparison

OnePlus 3 vs Xiaomi Mi5, Spec comparison

4జీ ఎల్టీఈ, VoLTE, వై-ఫై, బ్లుటూత్, ఎన్ఎఫ్‌‍సీ, యూఎస్బీ టైప్ - సీ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఆప్షన్స్ ఈ ఫోన్‌లలో ఉన్నాయి.

OnePlus 3 vs Xiaomi Mi5, Spec comparison

OnePlus 3 vs Xiaomi Mi5, Spec comparison

డ్యుయల్ సిమ్ స్లాట్, ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లు ఈ రెండు ఫోన్‌లలో కామన్‌గా చూడొచ్చు. వన్‌ప్లస్ 3 ఫోన్‌లో 3 స్టెప్ అలర్ట్ మోడ్ స్విచ్, స్వాపబుల్ బ్యాక్ కవర్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఎంఐ5 ఫోన్‌కు ఐఆర్ బ్లాస్టర్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.

OnePlus 3 vs Xiaomi Mi5, Spec comparison

OnePlus 3 vs Xiaomi Mi5, Spec comparison

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తున్నాయి. ఎంఐ ఫోన్ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0 టెక్నాలజీతో వస్తుండగా, వన్‌ప్లస్ 3 స్మార్ట్‌ఫోన్‌ డ్యాష్‌ఛార్జ్ క్విక్ ఛార్జ్ టెక్నాలజీతో వస్తోంది.

OnePlus 3 vs Xiaomi Mi5, Spec comparison

OnePlus 3 vs Xiaomi Mi5, Spec comparison

గ్రాఫైట్ వేరియంట్‌లో అందుబాటులో ఉన్న వన్‌ప్లస్ 3 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.27,999గా ఉండగా, షియోమీ ఎంఐ5 32జీబి వర్షన్ ధర రూ.24,999.

Best Mobiles in India

English summary
OnePlus 3 or Xiaomi Mi5! Can't Decide? 10 Differences to Simplify your Decision. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X