నిలిచిపోనున్న OnePlus 3T మోడల్..?

ఇండియన్ మార్కెట్లో వన్‌ప్లస్ ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది.

|

వన్‌ప్లస్ 3 స్మార్ట్‌ఫోన్‌కు అప్‌డేటెడ్ మోడల్‌గా ఐదు నెలల క్రితం మార్కెట్లో లాంచ్ అయిన OnePlus 3T స్మార్ట్‌ఫోన్ త్వరలో డిస్కంటిన్యూ కాబోతోంది. OnePlus 5 లాంచ్‌కు సమయం సమీపిస్తోన్న నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్ 3టీని కొనుగోలు చేసేందుకు ఇదే చివరి అవకాశం, స్టాక్ అయిపోవచ్చింది. వేర్‌హౌస్‌లో కొన్ని యూనిట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాబట్టి, వెంటనే త్వరపడండంటూ వన్‌ప్లస్ ఫోరమ్ స్టాఫ్ మెంబర్ స్టీవెన్ జి తెలిపారు.

వన్‌ప్లస్ ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది

వన్‌ప్లస్ ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది

ఇండియన్ మార్కెట్లో వన్‌ప్లస్ ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది. OnePlus 3T మాదిరిగానే వన్‌ప్లస్ 3 స్మార్ట్‌ఫోన్‌ను కూడా లాంచ్ అయిన 6 నెలల్లోనే వన్‌ప్లస్ కంపెనీ డిస్కంటిన్యూ చేసింది. వన్‌ప్లస్ 3 స్మార్ట్‌ఫోన్‌ జూన్ 2016లో భారత్‌లో విడుదలైంది. ఆశ్చర్యకంగా డిసెంబర్ 2016లో ఈ మోడల్ డిస్కంటిన్యూ అయ్యింది. అదే నెలలో వన్‌ప్లస్ 3టీ లాంచ్ అయ్యింది

OnePlus 3 ఫోన్‌తో పోలిస్తే..

OnePlus 3 ఫోన్‌తో పోలిస్తే..

OnePlus 3 ఫోన్‌తో పోలిస్తే కెమెరా, స్టోరేజ్, బ్యాటరీ ఇంకా ప్రాసెసర్ విభాగాల్లో వన్‌ప్లస్ 3టీ ఫోన్ అప్‌గ్రేడెడ్ ఫీచర్లను కలిగి ఉంది. వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 2.35GHz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్‌తో వస్తోంది.

రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో..
 

రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో..

OnePlus 3 ఫోన్ తరహాలోనే ఈ ఫోన్‌లో కూడా 6జీబి ర్యామ్‌ను ఏర్పాటు చేయటం జరిగింది.ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అందులో మొదటికి 64జీబి వర్షన్, రెండవది 128జీబి వర్షన్. వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 3400 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఈ బ్యాటరీ డాష్ ఛార్జ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది.

 రెండు 16 మెగా పిక్సల్ కెమెరాలు..

రెండు 16 మెగా పిక్సల్ కెమెరాలు..

వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్, రెండు 16 మెగా పిక్సల్ కెమెరాలను కలిగి ఉంది. వీటిని ఫ్రంట్ ఇంకా రేర్ భాగాల్లో అమర్చటం జరిగింది., సామ్‌సంగ్ 3P8SP సెన్సార్‌తో ఇంటిగ్రేట్ చేయబడిన ఈ కెమెరాల ద్వారా హైడెఫినిషన్ వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.

 వన్‌ప్లస్ 3టీ ఫోన్ ఇతర స్పెసిఫికేషన్స్..

వన్‌ప్లస్ 3టీ ఫోన్ ఇతర స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల 1080 పిక్సల్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారండా డిజైన్ చేసిన ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. త్వరలో నౌగట్ అప్‌డేట్ లభించే అవకాశముంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్బీ టైప్-సీ కనెక్టర్, ఫ్లాస్ట్ ఛార్జింగ్ కోసం డాష్ ఛార్జ్ టెక్నాలజీ, డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ (క్యాటగిరి 6), డ్యుయల్ బ్యాండ్ వై-ఫై, వై-ఫై డెరెక్ట్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ 2.0 విత్ టైప్-సీ పోర్ట్, గూగుల్ కాస్ట్, జీపీఎస్, గ్లోనాస్, బ్లుటూత్ 4.2, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్

OnePlus 5 స్మార్ట్ ఫోన్ జూన్ లో మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ గురించి ఒక్కో సమాచారం అఫీషియల్‌గా రివీల్ అవుతోంది. వన్‌ప్లస్ కంపెనీ సీఈఓ Pete Lau వెల్లడించిన వివరాల ప్రకారం వన్‌ప్లస్ 5 ఫోన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మొబైల్ ప్రాసెసర్‌గా భావిస్తోన్న స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ పై రన్ కాబోతోంది. ఇదే  విషయాన్ని Qualcomm కూడా ధృవీకరించింది.

8జీబి ర్యామ్ కెపాసిటీతో..?

8జీబి ర్యామ్ కెపాసిటీతో..?

ఈ ఫోన్‌ను ‌ 8జీబి అలానే 6జీబి ర్యామ్ కెపాసిటీలో అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. అప్‌గ్రేడెడ్ కెమెరా ఫీచర్లతో రాబోతోన్న ఈ ఫోన్‌‌లో 23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 16 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాను ఫిట్ చేసినట్లు రూమర్స్ మిల్స్ చెబుతున్నాయి.

256జీబి స్టోరేజ్ కెపాసిటీతో...

256జీబి స్టోరేజ్ కెపాసిటీతో...

వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్ 64జీబి, 128జీబి, 256జీబి స్టోరేజ్ కెపాసిటీలో అందుబాటులో ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Best Mobiles in India

English summary
OnePlus 3T will be discontinued soon as OnePlus 5 launch is nearing. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X