డిసెంబర్ 2న వన్‌ప్లస్ 3టీ
ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న OnePlus 3 ఫోన్‌తో పోలిస్తే కెమెరా, స్టోరేజ్, బ్యాటరీ ఇంకా ప్రాసెసర్ విభాగాల్లో వన్‌ప్లస్ 3టీ ఫోన్ అప్‌గ్రేడెడ్ ఫీచర్లను కలిగి ఉంది.
శక్తివంతమైన స్సెసిఫికేషన్‌లతో ప్రపంచ మార్కెట్లను ఊరిస్తోన్న OnePlus 3T స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 2న ఇండియన్ మార్కెట్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ లాంచ్ వివరాలను వన్‌ప్లస్ ఇండియా జనరల్ మేనేజర్ వికాస్ అగర్వాల్ వెల్లడించారు. ఈ ఫోన్ ధర రూ.30,000లోపు ఉండొచ్చని తెలుస్తోంది.

Read More : 4జీబి ర్యామ్‌తో హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రో, ధర రూ.26,490
ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న OnePlus 3 ఫోన్‌తో పోలిస్తే కెమెరా, స్టోరేజ్, బ్యాటరీ ఇంకా ప్రాసెసర్ విభాగాల్లో వన్‌ప్లస్ 3టీ ఫోన్ అప్‌గ్రేడెడ్ ఫీచర్లను కలిగి ఉంది. OnePlus 3T స్మార్ట్‌ఫోన్‌ను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దిన 10 స్పెషల్ ఫీచర్లను పరిశీలించినట్లయితే..

స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్
వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 2.35GHz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్‌తో వస్తోంది. OnePlus 3 ఫోన్ తరహాలోనే ఈ ఫోన్‌లో కూడా 6జీబి ర్యామ్‌ను ఏర్పాటు చేయటం జరిగింది.

రెండు స్టోరేజ్ వేరియంట్స్
వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది. అందులో మొదటికి 64జీబి వర్షన్, రెండవది 128జీబి వర్షన్. వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 3400 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఇదే సమయంలో OnePlus 3 ఫోన్ కేవలం 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని మాత్రమే కలిగి ఉంది.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

16 మెగా పిక్సల్ కెమెరా..
వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్, రెండు 16 మెగా పిక్సల్ కెమెరాలను కలిగి ఉంటుంది. వీటిని ఫ్రంట్ ఇంకా రేర్ భాగాల్లో అమర్చటం జరిగింది., సామ్‌సంగ్ 3P8SP సెన్సార్‌తో ఇంటిగ్రేట్ చేయబడిన ఈ కెమెరాల ద్వారా హైడెఫినిషన్ వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.

ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే
వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్.. 5.5 అంగుళాల 1.080 పిక్సల్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తోంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్ డిస్‌ప్లేకు రక్షణ కవచంలా నిలుస్తుంది.

మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం
వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్.. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారండా డిజైన్ చేసిన ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. త్వరలో నౌగట్ అప్‌డేట్ లభించే అవకాశముంది.

ఫోన్ ఇతర ప్రత్యేకతలు...
గన్ మెటల్, గ్రాఫైట్ ఇంకా సోఫ్ట్ గోల్డ్ కలర్ వేరియంట్‌లలో వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్బీ టైప్-సీ కనెక్టర్, ఫ్లాస్ట్ ఛార్జింగ్ కోసం డాష్ ఛార్జ్ టెక్నాలజీ, డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ (క్యాటగిరి 6), డ్యుయల్ బ్యాండ్ వై-ఫై, వై-ఫై డెరెక్ట్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ 2.0 విత్ టైప్-సీ పోర్ట్, గూగుల్ కాస్ట్, జీపీఎస్, గ్లోనాస్, బ్లుటూత్ 4.2, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications