30 నిమిషాల్లో 24 గంటల ఛార్జింగ్

భారీ అంచనాల మధ్య OnePlus 3T స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్లో లాంచ్ అయ్యింది. తొలత ఈ ఫోన్ 8జీబి ర్యామ్‌తో విడదులయ్యే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావించాయి. చివరకు 6జీబి ర్యామ్‌తోనే ఈ ఫోన్‌ను లాంచ్ చేసారు.

30 నిమిషాల్లో 24 గంటల ఛార్జింగ్

Read More : 4జీబి ర్యామ్, 20 ఎంపీ కెమెరా.. ధర మాత్రం అంతే!

ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న OnePlus 3 ఫోన్‌తో పోలిస్తే కెమెరా, స్టోరేజ్, బ్యాటరీ ఇంకా ప్రాసెసర్ విభాగాల్లో వన్‌ప్లస్ 3టీ ఫోన్ అప్‌గ్రేడెడ్ ఫీచర్లను కలిగి ఉంది. OnePlus 3T స్మార్ట్‌ఫోన్‌ను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దిన 10 స్పెషల్ ఫీచర్లను పరిశీలించినట్లయితే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వేగవంతమైన ప్రాసెసర్..

వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 2.35GHz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్‌తో వస్తోంది. OnePlus 3 ఫోన్ తరహాలోనే ఈ ఫోన్‌లో కూడా 6జీబి ర్యామ్‌ను ఏర్పాటు చేయటం జరిగింది.

ఎక్కువ స్టోరేజ్..

వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది. అందులో మొదటికి 64జీబి వర్షన్, రెండవది 128జీబి వర్షన్.

శక్తివంతమైన బ్యాటరీ..

వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 3400 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఇదే సమయంలో OnePlus 3 ఫోన్ కేవలం 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని మాత్రమే కలిగి ఉంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కెమెరా ఫీచర్స్..

వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్, రెండు 16 మెగా పిక్సల్ కెమెరాలను కలిగి ఉంటుంది. వీటిని ఫ్రంట్ ఇంకా రేర్ భాగాల్లో అమర్చటం జరిగింది., సామ్‌సంగ్ 3P8SP సెన్సార్‌తో ఇంటిగ్రేట్ చేయబడిన ఈ కెమెరాల ద్వారా హైడెఫినిషన్ వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.

స్ర్కీన్ ఇంకా బాడీ..

వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్.. 5.5 అంగుళాల 1.080 పిక్సల్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తోంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్ డిస్‌ప్లేకు రక్షణ కవచంలా నిలుస్తుంది.

ఆపరేటింగ్ సిస్టం..

వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్.. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారండా డిజైన్ చేసిన ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. త్వరలో నౌగట్ అప్‌డేట్ లభించే అవకాశముంది.

కలర్ వేరియంట్స్

గన్ మెటల్, గ్రాఫైట్ ఇంకా సోఫ్ట్ గోల్డ్ కలర్ వేరియంట్‌లలో వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుంది.

కనెక్టువిటీ ఫీచర్లు

ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్బీ టైప్-సీ కనెక్టర్, ఫ్లాస్ట్ ఛార్జింగ్ కోసం డాష్ ఛార్జ్ టెక్నాలజీ, డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ (క్యాటగిరి 6), డ్యుయల్ బ్యాండ్ వై-ఫై, వై-ఫై డెరెక్ట్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ 2.0 విత్ టైప్-సీ పోర్ట్, గూగుల్ కాస్ట్, జీపీఎస్, గ్లోనాస్, బ్లుటూత్ 4.2, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్.

ధర విషయానికొస్తే..

అనధికారికంగా తెలుస్తోన్న సమాచారం వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ 64జీబి వేరియంట్ ధర అంతర్జాతీయ మార్కెట్లో రూ.30,000 వరకు ఉండొచ్చు. 128జీబి వేరియంట్ ధర రూ.32,000గా ఉండొచ్చు.

లాంచ్ ఎప్పుడు..

వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ యూఎస్ మార్కెట్లో నవంబర్ 22 నుంచి, యూరోప్ మార్కెట్లో నవంబర్ 28 నుంచి లభ్యమవుతుంది. ఇండియన్ మార్కెట్లో లాంచ్‌కు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
OnePlus 3T is Official: Here are 10 Highlighted Features of the Phone. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting