వన్‌ప్లస్ 3టీ vs వన్‌ప్లస్ 5, మీరు తెలుసుకోవల్సిన విషయాలు

వన్‌ప్లస్ 5 మునుపటి వన్‌ప్లస్ ఫోన్‌లతో పోలిస్తే, అటు ధర పరంగా ఇటు స్పెసిఫికేషన్స్ పరంగా ముందంజలో ఉంది.

|

OnePlus కంపెనీ తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ అయిన వన్‌ప్లస్ 5ను కొద్ది గంటల క్రితమే ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ మునుపటి వన్‌ప్లస్ ఫోన్‌లతో పోలిస్తే, అటు ధర పరంగా ఇటు స్పెసిఫికేషన్స్ పరంగా ముందంజలో ఉంది. వన్‌ప్లస్ 3టీతో వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్‌ను కంపేర్ చేసి చూసినట్లయితే...

 

ధర పరంగా...

ధర పరంగా...

ఇండియన్ మార్కెట్లో వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 6జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ.32,999. 8జీబి ర్యామ్ + 128జీబి స్టోరేజ్ ధర రూ.37,999.

ఇదే సమయంలో వన్‌ప్లస్ 3టీ ధరలను పరిశీలించిన్లయితే.. 6జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999. 6జీబి ర్యామ్ + 128జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,999.

 

డిజైన్ పరంగా ఈ ఫోన్‌ల మధ్య తేడాలు..

డిజైన్ పరంగా ఈ ఫోన్‌ల మధ్య తేడాలు..

జైన్ పరంగా వన్‌ప్లస్ 3టీతో పోలిస్తే వన్‌ప్లస్ 5 మరింత స్లిమ్‌గా ఉంటుంది. వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని వన్‌ప్లస్ ఫోన్‌లలో కల్లా OnePlus 5 మరింత స్లిమ్‌గా కనిపిస్తోంది. ఈ ఫోన్ మందం 7.25 మిల్లీ మీటర్లు. బరువు 153 గ్రాములు. ఇదే సమయంలో వన్‌ప్లస్ 3టీ 158 గ్రాములు బరువును కలిగి ఉంటుంది. ఫోన్ మందం 7.4 మిల్లీ మీటర్లు. వన్‌ప్లస్ 5 ఫోన్ వెనుక భాగంలో కెమెరా పొజీషన్‌ను సెంటర్ నుంచి సైడ్‌కు మార్చటం జరిగింది. కలర్ ఆప్షన్స్ విషయానికి వచ్చేసరికి వన్‌ప్లస్ 3టీ ఫోన్ గన్‌మెటల్, సాఫ్ట్‌గోల్డ్ ఇంకా మిడ్‌నైట్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. వన్‌ప్లస్ 5 మాత్రం మిడ్‌నైట్ బ్లాక్ లేదా స్లేట్ గ్రే వేరింయట్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి
 

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి OnePlus 5 స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే (1920 x 1080పిక్సల్స్)తో వస్తోంది. 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ డిస్‌ప్లేకు రక్షణ కవచంలా నిలుస్తుంది.

 హార్డ్‌వేర్ పరంగా ఈ ఫోన్‌ల మధ్య తేడాలు

హార్డ్‌వేర్ పరంగా ఈ ఫోన్‌ల మధ్య తేడాలు

హార్డ్‌వేర్ పరంగా చూస్తే వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ Snapdragon 821 చిప్‌సెట్ పై రన్ అవుతుంది. 6జీబి ర్యామ్ వచ్చే ఈ ఫోన్‌ను 64జీబి ఇంకా 128జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో సొంతం చేసుకోవచ్చు. ఇదే సమయంలో వన్‌ప్లస్ 5 Snapdragon 835 చిప్‌సెట్ పై రన్ అవుతుంది. ర్యామ్ విషయానికి వచ్చేసరికి 6జీబి అలానే 8జీబి ర్యామ్ వేరియంట్‌లలో ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. స్టోరేజ్ పరంగా 64జీబి ఇంకా 128జీబి వర్షన్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ 3400mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇదే సమయంలో వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్ 3300mAh బ్యాటరీతో వస్తోంది. Dash Chargingను ఈ బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. ఈ టెక్నాలజీతో ఫోన్‌ను ఒక గంటసేపు ఛార్జ్ చేస్తే చాలు రోజంతా వాడుకోవచ్చు.

 

కెమెరా విషయానికి వచ్చేసరికి..

కెమెరా విషయానికి వచ్చేసరికి..

ఈ రెండు ఫోన్‌లు 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను ఉన్నాయి. రేర్ ఫేసింగ్ కెమెరాల విషయానికి వచ్చేసరికి వన్‌ప్లస్ 3టీ మోడల్ కేవలం 16ఎంపీ కెమెరాను మాత్రమే కలిగి ఉంటుంది. ఇదే సమయంలో వన్‌ప్లస్ 5 డ్యుయల్ కెమెరా సెటప్‌తో వస్తోంది. ఈ డ్యుయల్ కెమెరా సెటప్ 16 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ కాంభినేషన్‌లో రెండు కెమెరాలను కలిగి ఉంటుంది. 16 మెగా పిక్సల్ కెమెరాను సోనీ IMX398 సెన్సార్‌తో తీర్చిదిద్దగా, 20 మెగా పిక్సల్ టెలీఫోటో కెమెరాను సోనీ IMX350 సెన్సార్‌తో తీర్చిదిద్దారు. ఐఫోన్ 7 ప్లస్ తరహాలో ఈ కెమెరా 'bokeh' ఎఫెక్ట్స్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ కెమెరా వన్‌ప్లస్ 3టీతో పోలిస్తే వేగవంతమైన ఆటో‌ఫోకస్‌ను అందింగలదని కంపెనీ చెబుతోంది. ఈ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ మాడ్యుల్ ద్వారా 4కే క్వాలిటీ వీడియోలను రికార్డ్ చేసుకునే వీలుంటుంది.

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి...

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి...

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సస్టం పై రన్ అవుతాయి. అయితే, వన్‌ప్లస్ 5 మోడల్‌కు భవిష్యత్‌లో మరిన్ని సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు లభించే అవకాశం ఉంది.

వన్‌ప్లస్ 5 ఫుల్ స్పెసిఫికేషన్స్...

వన్‌ప్లస్ 5 ఫుల్ స్పెసిఫికేషన్స్...

ఆండ్రాయిడ్ నౌగట్ 7.1.1 ఆపరేటింగ్ సిస్టం, 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్), 2.45గిగాహెట్జ్ ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, అడ్రినో 540 గ్రాఫిక్స్, ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 16 మెగా పిక్సల్ 20 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,3,300mAh బ్యాటరీ వితం డాష్ ఛార్జింగ్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్.

 వన్‌ప్లస్ 3టీ స్పెసిఫికేషన్స్...

వన్‌ప్లస్ 3టీ స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల 1080 పిక్సల్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 2.35GHz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్‌, 6జీబి ర్యామ్, వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అందులో మొదటికి 64జీబి వర్షన్, రెండవది 128జీబి వర్షన్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్, 3400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
OnePlus 3T vs OnePlus 5: What’s the difference?. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X