విడుదలకు ముందే దుమ్మురేపుతోన్న OnePlus 5

ఈ ఏడాదికిగాను హై-ఎండ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌‌ఫోన్‌లుగా భావిస్తోన్న సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8+లు ఇప్పటికే మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో, సామ్‌‌సంగ్ ప్రత్యర్థి బ్రాండ్‌లలో ఒకటైన వన్‌ప్లస్ మరో బ్లాక్‌బాస్టర్ ఫోన్‌ను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతోంది. ఈ బ్రాండ్ నుంచి త్వరలో విడుదల కాబోతోన్న OnePlus 5 స్పెసిఫికేషన్స్ పరంగా గెలాక్సీ ఎస్8కు షాకిస్తోంది.

Read More : సంచలనం రేపిన Coolpad ఫోన్‌ల పై డిస్కౌంట్లే డిస్కౌంట్లు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గెలాక్సీ 8ను బీట్ చేసిందా..?

తాజా‌గా GSM Arena పోస్ట్ చేసిన ఓ కథనం ప్రకారం OnePlus 5 బెంచ్ మార్కింగ్ స్కోర్ గెలాక్సీ 8ను బీట్ చేసినట్లు తెలుస్తోంది.

వన్‌ప్లస్ 5 స్కోర్

రివీల్ అయిన బెంచ్ మార్కింగ్ ఫలితాల ప్రకారం వన్‌ప్లస్ 5 సింగిల్ కోర్ టెస్ట్‌లో 1963 పాయింట్లను స్కోర్ చేయగా, మల్టీ కోర్ టెస్ట్ లో 6687 పాయింట్లను స్కోర్ చేసింది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 స్కోర్

ఇదే సమయంలో గెలాక్సీ ఎస్8 సింగిల్ కోర్ టెస్ట్‌లో 1924 పాయింట్లను స్కోర్ చేయగా, మల్టీ కోర్ టెస్ట్ లో 6084 పాయింట్లను మాత్రమే స్కోర్ చేయగలిగింది.

వన్‌ప్లస్ 4 ఎందుకు రావటం లేదు..

వాస్తవానికి వన్‌ప్లస్ 3కి సక్సెసర్ వర్షన్‌గా వన్‌ప్లస్ 4 మార్కెట్లోకి రావల్సి ఉంది. అయితే చైనా మూఢనమ్మకాల ప్రకారం 4 అంకె కలిసిరాదట. ఈ నేపథ్యంలో వన్‌ప్లస్ 4ను పక్కనబెట్టి వన్‌ప్లస్ 5 మోడల్ పై కంపెనీ దృష్టిసారించినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.

 

రూమర్స్ ఏం చెబుతున్నాయంటే.?

వన్‌ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ పై రన్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇదే సమయంలో 8జీబి ర్యామ్ కెపాసిటీతో ఈ ఫోన్‌ను రంగంలోకి దింపనున్నారట. 23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను కూడా ఫోన్‌లో అమర్చనున్నారట.

OppoMart అనే ఆన్‌లైన్ రిటైలర్

ఇప్పటికే, OppoMart అనే ఆన్‌లైన్ రిటైలర్ వన్‌ప్లస్5 స్మార్ట్‌ఫోన్‌ను తన లిస్టింగ్స్‌లో ప్రదర్శించింది. ఈ రిటైలర్ పోస్ట్ చేసిన వివరాల ప్రకారం ఈ హై-ఎండ్ డివైస్ ధర 449 డాలర్లు ఉంటుందని తెలుస్తోంది. ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.29,000.

OnePlus 5 స్పెక్స్ (అన్ అఫీషియల్)

OppoMart లిస్టింగ్స్  ప్రకారం OnePlus 5 స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి... 5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ స్ర్కీన్ (2560 x 1440పిక్సల్స్), 2.44గిగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 835 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 6జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 12 మెగా పిక్సల్ రేర్ డ్యుయల్ కెమెరా సెటప్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసిగ్ కెమెరా, ఆండ్రాయిడ్ నౌగట్ ఆధారంగా డిజైన్ చేసిన ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం, 3580 mAh బ్యాటరీ విత్ డాష్ ఛార్జ్ 2.0 టెక్నాలజీ.

తెరపైకి 8జీబి ర్యామ్ వేరియంట్ కూడా..

మార్కెట్లో వినిపిస్తోన్న మరికొన్ని రూమర్స్ ప్రకారం OnePlus 5 8జీబి ర్యామ్ వేరియంట్‌లో కూడా లభ్యమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ వేరియంట్ 3600mAh బ్యాటరీ పై రన్ అవుతుందట.

జూన్ మొదటి వారంలో లాంచ్ అయ్యే అవకాశాలు..

తాజా రిపోర్ట్స్‌ను బట్టి చూస్తంటే.. OnePlus 5 జూన్ మొదటి వారంలో లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే వన్‌ప్లస్ కంపెనీ సీఈఓ OnePlus 5 తయారీ ప్రాసెస్‌లో ఉన్నట్లు ధృవీకరించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
OnePlus 5 Beats Samsung Galaxy S8 Even Before Its Launch. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot