Home
Mobile

OnePlus 5 లేటెస్ట్ అప్‌డేట్స్

OnePlus 5 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అందులో మొదటి వేరియంట్ 6జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, రెండవ వేరియంట్ 8జీబి ర్యామ్ + 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్.

By Sivanjaneyulu Bommu

జూన్ 20న జరగబోతోన్న OnePlus 5 గ్లోబల్ లాంచ్‌ను పురస్కరించుకుని ఆ ఫోన్‌కు సంబంధించిన మొదటి అఫీషియల్ ఇమేజ్‌ను వన్‌ప్లస్ కంపెనీ రివీల్ చేసింది. మరింత స్లిమ్ లుక్‌లో కనిపిస్తోన్న ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌కు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ప్రొఫెషనల్‌ స్థాయి కెమెరాలతో...

ప్రొఫెషనల్‌ స్థాయి కెమెరాలతో...

ఈ ఫోన్ కెమెరాలను మరింత ప్రొఫెషనల్‌గా మలిచే క్రమంలో DxOMark అనే ఇమేజ్ క్వాలిటీ రేటింగ్ వెబ్‌సైట్‌తో వన్‌ప్లస్ టై-అప్ అయ్యింది. ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే స్మార్ట్‌ఫోన్ కెమెరా టెక్నాలజీని వన్‌ప్లస్ కంపెనీ మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

జూన్ 22న ఇండియన్ మార్కెట్లో...

జూన్ 22న ఇండియన్ మార్కెట్లో...

ఇండియన్ మార్కెట్లో OnePlus 5 జూన్ 22న లాంచ్ కాబోతోంది. ముంబైలో జరగబోతోన్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పుటికే అన్ని ప్రముఖ మీడియా వెబ్‌సైట్‌లకు ఇన్విటేషన్స్ అందాయి. ఈ లాంచ్ ఈవెంట్ ను పరుస్కరించుకుని ప్రత్యేకమైన కాంటెస్ట్ ను కూడా వన్‌ప్లస్ నిర్వహిస్తోంది.

ఐదుగురు విజేతలకు వన్‌ప్లస్ 5

ఐదుగురు విజేతలకు వన్‌ప్లస్ 5

ఈ కాంటెస్ట్‌లో గెలుపొందిన ఐదుగురు విజేతలకు వన్‌ప్లస్ 5 ఫోన్‌లను బహుమతిగా వన్‌ప్లస్ ఇవ్వనుంది. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనాలనుకునే వారు oneplus.net వెబ్‌సైట్‌లోకి తమ వన్‌ప్లస్ లేదా ఫేస్‌బుక్, జీయెయిల్ అకౌంట్ల ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

 జూన్ 12 నుంచి ఇన్విటేషన్స్..

జూన్ 12 నుంచి ఇన్విటేషన్స్..

జూన్ 20న జరగబోయే OnePlus 5 లాంచ్ ఈవెంట్‌ను చూడాలను కుంటున్నవారికి వన్‌ప్లస్ 5 ఎస్ఎంఎస్ అలర్ట్‌లను పంపుతోంది. వన్‌ప్లస్ అఫీషియల్ సైట్‌లోకి వెళ్లటం ద్వారా ఈ అలర్ట్‌ను పొందవచ్చు. జూన్ 22న ముంబైలో జరిగే ఈవెంట్‌కు హాజరవ్వాలనుకునే వారు రూ.999 చెల్లించి ఇన్విటేషన్‌ను పొందవచ్చు. జూన్ 12 నుంచి ఇన్విటేషన్స్ జారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

రూ.10,000 ఖరీదు చేసే వెల్‌కమ్ ప్యాక్..

రూ.10,000 ఖరీదు చేసే వెల్‌కమ్ ప్యాక్..

ఈ ఇన్విటేషన్‌ను తీసుకున్న వారికి OnePlus 5 లాంచ్ టీ-షర్ట్‌తో పాటు రూ.10,000 ఖరీదు చేసే వెల్‌కమ్ ప్యాక్ లభిస్తుంది. ఈ ప్యాక్‌లో రూ.3,990 ఖరీదు చేసే వన్‌ప్లస్ ట్రావెల్ బ్యాక్‌ప్యాక్‌తో పాటు రూ.6,000 ఖరీదు చేసే వన్‌ప్లస్ సన్ గ్లాసెస్ ఇంకా రూ.999 ఖరీదు చేసే వన్‌ప్లస్ వోచర్ ఉంటుంది. ఈ ప్యాక్, యూజర్ వన్‌ప్లస్ అకౌంట్‌లో క్రెడిట్ అవుటుంది. OnePlus 5 కొనుగోలు చేసిన మూడు రోజుల్లోపు ఈ ప్యాక్‌ను వాడుకోవల్సి ఉంటుంది.

రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది..?

రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది..?

OnePlus 5 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అందులో మొదటి వేరియంట్ 6జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వర్షన్, రెండవ వేరియంట్ వచ్చేసరికి 8జీబి ర్యామ్ + 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వర్షన్. 64జీబి వేరియంట్ ధర రూ.32,999గాను, 128జీబి వేరియంట్ ధర రూ.37,999గాను ఉండొచ్చని తెలుస్తోంది.

Amazon Indiaలో OnePlus 5

Amazon Indiaలో OnePlus 5

జూన్ 22న ఇండియాలో లాంచ్ కాబోతోన్న OnePlus 5 స్మార్ట్‌ఫోన్‌ను తమ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతున్నట్లు Amazon India తెలిపింది. ఈ లాంచ్‌కు సంబంధించి ఓ ప్రత్యేకమైన పేజీని కూడా అమెజాన్ విడుదల చేసింది. ఈ పేజీలో పేర్కొన్న వివరాల ప్రకారం OnePlus 5 ఫోన్ జూన్ 22, మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ అవుతుంది. అదే రోజు సాయంత్రం 4.30 నుంచి సేల్‌ ప్రారంభమవుతుంది.

 

OnePlus 5 స్పెసిఫికేషన్స్..

OnePlus 5 స్పెసిఫికేషన్స్..

క్వాల్కమ్ కంపెనీ ఆఫర్ చేస్తున్న లేటెస్ట్ Snapdragon 835 చిప్‌సెట్‌తో పాటు ఫుల్ హైడెఫినిషన్ రిసల్యూషన్ డిస్‌ప్లే, డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,300mAh బ్యాటరీ విత్ డాష్ బోర్డ్ సపోర్ట్ వంటి శక్తివంతమైన ఫీచర్లు OnePlus 5 ఫోన్‌లో ఉండబోతున్నాయి.

Best Mobiles in India

English summary
OnePlus 5: Everything you need to know about the upcoming ‘flagship killer’. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X