వన్‌ప్లస్ 5 కోసం గంటల తరబడి క్యూలైన్‌లలో
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8, ఎస్8+, యాపిల్ ఐఫోన్ ప్లస్ వంటి దిగ్గజ ఫోన్‌లకు వన్‌ప్లస్ 5 ధీటైన జవాబునిచ్చేలా ఉంది.
వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి లాంచ్ అయిన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ OnePlus 5కు ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన లభిస్తోంది. మార్కెట్లో అనౌన్స్ అయిన రోజు నుంచే ఈ ఫోన్ అందుబాటులో ఉండటంతో అన్ని చోట్లా పాజిటివ్ రివ్యూలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది లాంచ్ అయిన అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లలో వన్‌ప్లస్ 5 ఒకటి.

దిగ్గజ ఫోన్‌లకు వన్‌ప్లస్ 5 ధీటైన జవాబు...
మార్కెట్లో ఇప్పటి వరకు OnePlus ట్రాక్ రికార్డును పరిశీలించినట్లయితే, బడ్జెట్ రేంజ్‌లో ఈ బ్రాండ్ ఆఫర్ చేసిన ప్రతి స్మార్ట్‌ఫోన్ అటు స్పెసిఫికేషన్స్ పరంగా ఇటు పనితీరు పరంగా అంచనాలకు మించిన పనితీరును కనబర్చింది. ఈ నేపథ్యంలో వన్‌ప్లస్ 5 కూడా అలాంటి అంచనాలతోనే మార్కెట్లో లాంచ్ అయి ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే మార్కెట్లో లాంచ్ అయిన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8, ఎస్8+, యాపిల్ ఐఫోన్ ప్లస్ వంటి దిగ్గజ ఫోన్‌లకు వన్‌ప్లస్ 5 ధీటైన జవాబునిచ్చేలా ఉంది.

దేశవ్యాప్తంగా పాప్-అప్ ఈవెంట్స్
OnePlus 5 లాంచ్ ఈవెంట్ జూన్ 22న మంబైలో విజయవంతంగా ముగిసిన తరువాత మరో నాలుగు పట్టణాల్లో ఈ ఫోన్‌కు సంబంధించిన పాప్-అప్ ఈవెంట్స్ జరిగాయి. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై ప్రాంతాల్లో ఈ pop-up ఈవెంట్స్‌ను వన్‌ప్లస్ నిర్వహించింది.

వేల సంఖ్యలో యూజర్లు ఎగబడ్డారు.
ఈ pop-up ఈవెంట్‌కు హాజరయ్యే ప్రతిఒక్కరికి ఫోన్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయటంతో పాటు కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని వన్‌ప్లస్ తెలపటంతో వేల సంఖ్యలో యూజర్లు ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. OnePlus 5ను దక్కించుకునే వీరు గంటల తరబడి లైన్‌లలో నిలుచొని ఉండటం విశేషం.

అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ ‘వన్‌ప్లస్ 5’
2017లో ఇప్పటి వరకు లాంచ్ అయిన అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లలో వన్‌ప్లస్ 5 ఒకటి. ఈ ఫోన్ శక్తివంతమైన Qualcomm Snapdragon 835 SoCతో వస్తోంది. సరిగ్గా ఇలాంటి చిప్‌సెట్‌నే గెలాక్సీ ఎస్8, ఎస్8+ ఫోన్‌లలో సామ్‌సంగ్ వినియోగించింది. సామ్‌సంగ్ ఈ ఫోన్‌లను 4జీబి ర్యామ్‌తో ఆఫర్ చేయగా, వన్‌ప్లస్ మాత్రం 6జీబి, 8జీబి వర్షన్‌లలో తన వన్‌ప్లస్ 5 ఫోన్‌ను రంగంలోకి దింపింది. ఈ ఫోన్ ధర కూడా రూ.38,000లోపే ఉండటం విశేషం.

మార్కెట్లో ఓ ట్రెండ్ సెట్టర్..
వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్‌కు భారీ డిమాండ్ నెలకున్న నేపథ్యంలో ఆ కంపెనీ సీఈఓ Pete Lau హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐఫోన్‌లను విక్రయించే క్రమంలో యాపిల్ కంపెనీ అనుసరించే వ్యూహాలనే వన్‌ప్లస్ కూడా అనుసరించటం విశేషం. 'Never Settle' ట్యాగ్‌లైన్‌తో లాంచ్ అయిన వన్‌ప్లస్ 5 విప్లవాత్మక ఫీచర్లతో మార్కెట్లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.

వీళ్లు యాపిల్ బాయ్స్ కాదు వన్‌ప్లస్ ఫ్యాన్స్..
OnePlus 5 స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు వన్‌ప్లస్ స్టోర్ వద్ద బారులు తీరిన అభిమానులు. వన్‌ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం అమెజాన్.ఇన్ అలానే వన్‌ప్లస్ స్టోర్‌లలో ఓపెన్ సేల్ పై దొరుకుతోంది.

OnePlus 5 మరింత స్లిమ్..
వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని వన్‌ప్లస్ ఫోన్‌లలో కల్లా OnePlus 5 మరింత స్లిమ్‌గా కనిపిస్తోంది. ఈ ఫోన్ మందం 7.25 మిల్లీ మీటర్లు. బరువు 153 గ్రాములు. చుట్టుకొలతలు 154.2 x 74.1 x 7.25 మిల్లీ మీటర్లు. ప్రత్యేకమైన అల్యూమినియమ్ యునిబాడి డిజైన్‌తో వన్‌ప్లస్ 5 వస్తోంది. డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి OnePlus 5 స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే (1920 x 1080పిక్సల్స్)తో వస్తోంది. 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ డిస్ ప్లేకు రక్షణ కవచంలా నిలుస్తుంది.

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్
OnePlus 5 స్మార్ట్‌ఫోన్, 2.45Ghz క్లాక్ స్పీడును కలిగిన శక్తివంతమైన Qualcomm Snapdragon 835 ప్రాసెసర్‌తో వస్తోంది. గ్రాఫిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అడ్రినో 540 గ్రాఫిక్ ప్రాసెసర్‌ను వినియోగించారు. ర్యామ్ ఇంకా స్టోరేజ్ అంశాలను పరిశీలించినట్లయితే OnePlus 5 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ వచ్చేసరికి 6జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ కెపాసిటీతో దొరుకుతుంది. రెండవ వేరియంట్ వచ్చేసరికి 8జీబి ర్యామ్ + 128జీబి స్టోరేజ్ కెపాసిటీతో దొరుకుతుంది.

సాఫ్ట్‌వేర్, కెమెరా
సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆధారంగా డిజైన్ చేసిన లేటెస్ట్ వర్షన్ ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్ం పై OnePlus 5 స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది. OnePlus 5 స్మార్ట్‌ఫోన్‌కు కెమెరా ప్రధాన హైలైట్. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన డ్యుయల్ కెమెరా సెటప్ 16 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ కాంభినేషన్ లో రెండు కెమెరాలను కలిగి ఉంటుంది. 16 మెగా పిక్సల్ కెమెరాను సోనీ IMX398 సెన్సార్ తో తీర్చిదిద్దగా, 20 మెగా పిక్సల్ టెలీఫోటో కెమెరాను సోనీ IMX350 సెన్సార్‌తో తీర్చిదిద్దారు. ఐఫోన్ 7 ప్లస్ తరహాలో ఈ కెమెరా 'bokeh' ఎఫెక్ట్స్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ కెమెరా వన్‌ప్లస్ 3టీతో పోలిస్తే వేగవంతమైన ఆటోఫోకస్‌ను అందింగలదని కంపెనీ చెబుతోంది. ఈ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ మాడ్యుల్ ద్వారా 4కే క్వాలిటీ వీడియోలను రికార్డ్ చేసుకునే వీలుంటుంది. ఫోన్ ముందు భాగంలో అమర్చిన 16 మెగా పిక్సల్ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలతో పాటు వీడియో కాలింగ్‌ను ఆస్వాదించే వీలుంటుంది.

Dash Charging
వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్ 3300mAh బ్యాటరీతో వస్తోంది. Dash Chargingను ఈ బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. ఈ టెక్నాలజీతో ఫోన్‌ను ఒక గంటసేపు ఛార్జ్ చేస్తే చాలు రోజంతా వాడుకోవచ్చు.


Click it and Unblock the Notifications