OnePlus 5 సేల్ స్టార్ట్ అయ్యింది, ఆఫర్లు ఇవే

వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన మొదటి ఓపెన్ సేల్ ఇండియన్ మార్కెట్లో సోమవారం అర్థరాత్రి (తెల్లవారితే మంగళవారం) నుంచి ప్రారంభమైంది. అమెజాన్ ఇండియాతో పాటు వన్‌ప్లస్ స్టోర్‌లలో ఈ సేల్ జరుగుతోంది. బెంగుళూరులో ఏర్పాటు చేసిన వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లో కూడా ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. మార్కెట్లో వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 6జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,999. 8జీబి ర్యామ్ + 128జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,999.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమెజాన్ ఆఫర్లు..

అమెజాన్ ఇండియా ద్వారా వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే వొడాఫోన్ యూజర్లకు 10జీబి 4జీ ఇంటర్నెట్ 1జీబి డేటా ధరకే లభిస్తుంది. 5 నెలల పాటు ఈ సదుపాయాన్ని ఆస్వాదించే వీలుంటుంది. వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే SBI డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ యూజర్లకు రూ.1500 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

OnePlus 5 చాలా స్లిమ్‌గా ఉంటుంది...

డిజైన్ పరంగా OnePlus 5 బెస్ట్ లుక్‌ను ఆఫర్ చేస్తోంది. వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని వన్‌ప్లస్ ఫోన్‌లలో కల్లా OnePlus 5 మరింత స్లిమ్‌గా కనిపిస్తోంది. ఈ ఫోన్ మందం 7.25 మిల్లీ మీటర్లు. బరువు 153 గ్రాములు. చుట్టుకొలతలు 154.2 x 74.1 x 7.25 మిల్లీ మీటర్లు. ప్రత్యేకమైన అల్యూమినియమ్ యునిబాడి డిజైన్‌తో వన్‌ప్లస్ 5 వస్తోంది. యాంటెనా బ్యాండ్స్ డిజైన్‌ను కూడా పూర్తిగా మార్చివేసినట్లు తెలుస్తోంది. డ్యుయల్ కెమెరా సెటప్ ఫోన్ రేర్ ప్యానల్‌కు ప్రత్యేకమైన లుక్‌‌ను తీసుకువచ్చింది.

ఫుల్ హైడెఫినిషన్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి OnePlus 5 స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే (1920 x 1080పిక్సల్స్)తో వస్తోంది. 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ డిస్ ప్లేకు రక్షణ కవచంలా నిలుస్తుంది.

ర్యామ్, ప్రాసెసర్, స్టోరేజ్

OnePlus 5 స్మార్ట్‌ఫోన్, 2.45Ghz క్లాక్ స్పీడును కలిగిన శక్తివంతమైన Qualcomm Snapdragon 835 ప్రాసెసర్‌తో వస్తోంది. గ్రాఫిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అడ్రినో 540 గ్రాఫిక్ ప్రాసెసర్‌ను వినియోగించారు. ర్యామ్ ఇంకా స్టోరేజ్ అంశాలను పరిశీలించినట్లయితే OnePlus 5 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ వచ్చేసరికి 6జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ కెపాసిటీతో దొరుకుతుంది. రెండవ వేరియంట్ వచ్చేసరికి 8జీబి ర్యామ్ + 128జీబి స్టోరేజ్ కెపాసిటీతో దొరుకుతుంది.

సాఫ్ట్‌వేర్..

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆధారంగా డిజైన్ చేసిన లేటెస్ట్ వర్షన్ ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్ం పై OnePlus 5 స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది.

కెమెరా ప్రధాన హైలైట్...

OnePlus 5 స్మార్ట్‌ఫోన్‌కు కెమెరా ప్రధాన హైలైట్. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన డ్యుయల్ కెమెరా సెటప్ 16 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ కాంభినేషన్ లో రెండు కెమెరాలను కలిగి ఉంటుంది. 16 మెగా పిక్సల్ కెమెరాను సోనీ IMX398 సెన్సార్ తో తీర్చిదిద్దగా, 20 మెగా పిక్సల్ టెలీఫోటో కెమెరాను సోనీ IMX350 సెన్సార్‌తో తీర్చిదిద్దారు. ఐఫోన్ 7 ప్లస్ తరహాలో ఈ కెమెరా 'bokeh' ఎఫెక్ట్స్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ కెమెరా వన్‌ప్లస్ 3టీతో పోలిస్తే వేగవంతమైన ఆటో‌ఫోకస్‌ను అందింగలదని కంపెనీ చెబుతోంది. ఈ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ మాడ్యుల్ ద్వారా 4కే క్వాలిటీ వీడియోలను రికార్డ్ చేసుకునే వీలుంటుంది. ఫోన్ ముందు భాగంలో అమర్చిన 16 మెగా పిక్సల్ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలతో పాటు వీడియో కాలింగ్‌ను ఆస్వాదించే వీలుంటుంది.

Dash Charging టెక్నాలజీతో..

వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్ 3300mAh బ్యాటరీతో వస్తోంది. Dash Chargingను ఈ బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. ఈ టెక్నాలజీతో ఫోన్‌ను ఒక గంటసేపు ఛార్జ్ చేస్తే చాలు రోజంతా వాడుకోవచ్చు.

ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు...

4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్ వీ5.0, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లు ఈ వన్‌ప్లస్ 5లో ఉన్నాయి. ఇక సెన్సార్స్ విషయానికొస్తే యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారో మీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్స్ వంటి సెన్సార్లు ఈ డివైస్‌లో ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
OnePlus 5 to Go on Open Sale in India via Amazon India, OnePlus Store. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot