దిగ్గజాలకు దడపుట్టిస్తోన్న OnePlus 5

సామ్‌సంగ్, యాపిల్ వంటి హై-ఎండ్ బ్రాండ్‌లకు పోటీగా OnePlus బ్రాండ్ గతేడాది మార్కెట్లోకి తీసుకువచ్చిన వన్‌ప్లస్ 3, వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్‌లు ఏ రేంజ్‌లో హిట్టయ్యాయో మనందరికి తెలుసు. అడ్వాన్సుడ్ స్పెసిఫికేషన్‌లతో రూ.30,000 ధర రేంజ్‌లో లాంచ్ అయిన ఈ మోడల్స్‌కు ఇప్పటికి మార్కెట్లో ఆదరణ లభిస్తోండటం విశేషం. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8, యాపిల్ ఐఫోన్ 7లకు పోటీగా వన్‌ప్లస్ తీసుకురాబోతోన్నలేటెస్ట్ డివైస్ OnePlus 5.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

'Never Settle' ట్యాగ్‌లైన్‌తో..

'Never Settle' ట్యాగ్‌లైన్‌తో వన్‌ప్లస్ 5 క్యాంపైన్ ఇప్పటికే ఇంటర్నెట్‌ను హోరెత్తిస్తోంది. మార్కెట్లో OnePlus ట్రాక్ రికార్డును పరిశీలించినట్లయితే, బడ్జెట్ రేంజ్‌‌లో ఈ బ్రాండ్ ఆఫర్ చేసిన ప్రతి స్మార్ట్‌ఫోన్ అటు స్పెసిఫికేషన్స్ పరంగా ఇటు పనితీరు పరంగా అంచనాలకు మించిన పనితీరును కనబర్చింది. ఈ నేపథ్యంలో వన్‌ప్లస్‌ 5 మార్కెట్లో అనౌన్స్ అయిన నాటి నుంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.

జూన్ 20న అంతర్జాతీయ మార్కెట్లో, జూన్ 22న ఇండియన్ మార్కెట్లో

వన్‌ప్లస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్ జూన్ 20న అంతర్జాతీయ మార్కెట్లో, జూన్ 22న ఇండియన్ మార్కెట్లో విడుదల కాబోతోంది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 మోడల్‌కు ప్రధాన కాంపీటీటర్‌గా భావిస్తోన్న వన్‌ప్లస్ 5కు డ్యుయల్ - లెన్స్ రేర్ కెమెరా సెటప్‌ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

 

ఆ ఫోటో ఉత్కంఠను మరింత పెంచింది...

ఈ డ్యయల్ లెన్స్ కెమెరాను గెలాక్సీ ఎస్8 కెమెరా కంటే ధీటుగా వన్‌ప్లస్ అభివృద్ధి చేయించినట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్ 5 డ్యుయల్ - లెన్స్ రేర్ కెమెరా ద్వారా క్యాప్చుర్ చేసిన ఓ ఫోటోను వన్‌ప్లస్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసి ఉత్కంఠను మరింత పెంచింది.

హై-ఎండ్ ఫోన్‌లకు డ్యుయల్ కెమెరా సెటప్ ప్రధాన స్పెసిఫికేషన్‌...

ఈ మధ్య లాంచ్ అయిన అన్ని హై-ఎండ్ ఫోన్‌లకు డ్యుయల్ కెమెరా సెటప్ ప్రధాన స్పెసిఫికేషన్‌గా ఉన్నప్పటికి, సామ్‌సంగ్ నుంచి ఇటీవల మార్కెట్లో లాంచ్ చేసిన గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ ఫోన్‌లలో డ్యుయల్ కెమెరా సెటప్ లోపించటంవిశేషం.

ప్రొఫెషనల్‌ స్థాయి కెమెరాలతో వన్‌ప్లస్ 5

వన్‌ప్లస్ 5 కెమెరాలను మరింత ప్రొఫెషనల్‌గా మలిచే క్రమంలో DxOMark అనే ఇమేజ్ క్వాలిటీ రేటింగ్ వెబ్‌సైట్‌తో వన్‌ప్లస్ టై-అప్ అయ్యింది. దీని బట్టి చూస్తుంటే స్మార్ట్‌ఫోన్ కెమెరా టెక్నాలజీని వన్‌ప్లస్ కంపెనీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతోంది.

Snapdragon 835 ప్రాసెసర్‌తో పాటు 8జీబి ర్యామ్

Qualcomm Snapdragon 835 ప్రాసెసర్‌తో రాబోతోన్న వన్‌ప్లస్‌5 ఫోన్‌కు మరో ప్రధానమైన హైలైట్ 8జీబి ర్యామ్. ఈ విధమైన కాంభినేషన్‌తో రాబోతోన్న వన్‌ప్లస్ 5 పనితీరు పరంగా సరికొత్త బెంచ్ మార్కును సెట్ చేస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. బ్యాటరీ పరంగా కూడా ఈ ఫోన్ ఏ మాత్రం నిరుత్సహాపరచదని తెలుస్తోంది. డాష్ ఛార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ విధంగా డిజైన్ కాబడిన వన్‌ప్లస్ 5 బ్యాటరీ 0% - 100% ఛార్జింగ్‌ను కేవలం 30 నిమిషాల్లో అందుకోగలదట.

జూన్ 22న ఇండియా లాంచ్..

ఇండియన్ మార్కెట్లో OnePlus 5 జూన్ 22న లాంచ్ కాబోతోంది. ముంబైలో జరగబోతోన్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పుటికే అన్ని ప్రముఖ మీడియా వెబ్‌సైట్‌లకు ఇన్విటేషన్స్ అందాయి. ఈ లాంచ్ ఈవెంట్‌ను పరుస్కరించుకుని ప్రత్యేకమైన కాంటెస్ట్‌ను కూడా వన్‌ప్లస్ నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్‌లో గెలుపొందిన ఐదుగురు విజేతలకు వన్‌ప్లస్ 5 ఫోన్‌లను బహుమతిగా వన్‌ప్లస్ ఇవ్వనుంది. ముంబైలో జరిగే ఈవెంట్‌కు హాజరవ్వాలనుకునే వారు రూ.999 చెల్లించి ఇన్విటేషన్‌ను పొందవచ్చు. జూన్ 12 నుంచి ఇన్విటేషన్స్ జారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. oneplus అఫీషియల్ స్టోర్ ద్వారా ఈ టికెట్లను కొనుగోలు చేయవచ్చు.

గెలిచిన వారికి కోటి..

ఈ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా 'Best Smartphone Contest' గ్రాండ్ ఫైనల్ ను కూడా వన్ ప్లస్ నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమాన్ని మెయిడిన్ వన్‌ప్లస్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తారు. ఈ కాంటెస్ట్ లో గెలుపొందిన విజేతకు రూ.కోటిని బహుమతిగా అందజేస్తారు. ఈ కాంటెస్ట్ మార్చిలో ప్రారంభమైంది. జూన్ 22న ఇండియాలో లాంచ్ కాబోతోన్న OnePlus 5 స్మార్ట్‌ఫోన్‌ను తమ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతున్నట్లు Amazon India తెలిపింది. ఈ లాంచ్‌కు సంబంధించి ఓ ప్రత్యేకమైన పేజీని కూడా అమెజాన్ విడుదల చేసింది. ఈ పేజీలో పేర్కొన్న వివరాల ప్రకారం OnePlus 5 ఫోన్ జూన్ 22, మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ అవుతుంది. అదే రోజు సాయంత్రం 4.30 నుంచి సేల్‌ ప్రారంభమవుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
OnePlus 5 has teased enough! See it yourself to believe it. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot