మరికొద్ది రోజుల్లో మార్కెట్లో లాంచ్ కాబోతోన్న OnePlus 5 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి సరికొత్త ఫోటోలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. slashleaks అనే వెబ్‌సైట్ ఈ ఫోటోలను రివీల్ చేసింది. ఈ ఇమేజెస్‌లో ఫోన్ వెనుక వైపు డిజైన్ ఎలిమెంట్స్‌తో పాటు, ఫోన్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన TPU (థర్మోప్లాస్టిక్ పాలియురేతేన్) కేస్‌లను కూడా చూపించారు.
హైబ్రీడ్ మెటీరియల్‌తో..
మరింత ట్రాన్స్‌పరెంట్‌గా కనిపించే టీపీయూ కేస్‌లను హైబ్రీడ్ మెటీరియల్‌తో తయారు చేస్తారు. ఈ మెటీరియల్‌లో హార్డ్ ప్లాస్టిక్ అలానే సాఫ్ట్ సిలికాన్‌లు మిక్స్ అయి ఉంటాయి.
బ్లూ, గోల్డ్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్‌లలో
వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్ కోసం రూపొందించబడిన ఈ ప్రత్యేకమైన కేస్‌లు బ్లూ, గోల్డ్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి.
Amazon India ఎక్స్‌క్లూజివ్
జూన్ 22న ఇండియాలో లాంచ్ కాబోతోన్న OnePlus 5 స్మార్ట్‌ఫోన్‌ను Amazon India ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది. ఈ లాంచ్‌కు సంబంధించి ఓ ప్రత్యేకమైన పేజీని కూడా అమెజాన్ విడుదల చేసింది. ఈ పేజీలో పేర్కొన్న వివరాల ప్రకారం OnePlus 5 ఫోన్ జూన్ 22, మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ అవుతుంది. అదే రోజు సాయంత్రం 4.30 నుంచి సేల్ ప్రారంభమవుతుంది.
శక్తివంతమైన ప్రాసెసర్, 8జీబి ర్యామ్
Qualcomm Snapdragon 835 ప్రాసెసర్‌తో రాబోతోన్న వన్‌ప్లస్5 ఫోన్‌కు మరో ప్రధానమైన హైలైట్ 8జీబి ర్యామ్. ఈ విధమైన కాంభినేషన్‌తో రాబోతోన్న వన్‌ప్లస్ 5 పనితీరు పరంగా సరికొత్త బెంచ్ మార్కును సెట్ చేస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు.
బ్యాటరీ విషయంలోనూ సూపర్..
బ్యాటరీ పరంగా కూడా ఈ ఫోన్ ఏ మాత్రం నిరుత్సహాపరచదని తెలుస్తోంది. డాష్ ఛార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ విధంగా డిజైన్ కాబడిన వన్‌ప్లస్ 5 బ్యాటరీ 0% - 100% ఛార్జింగ్‌ను కేవలం 30 నిమిషాల్లో అందుకోగలదట.
డ్యుయల్ - లెన్స్ కెమెరా ప్రధాన హైలైట్...
వన్‌ప్లస్ 5కు డ్యుయల్ - లెన్స్ రేర్ కెమెరా సెటప్ ప్రధాన హైలైట్‌గా చెప్పుకోవచ్చు.ఈ డ్యయల్ లెన్స్ కెమెరాను గెలాక్సీ ఎస్8 కెమెరా కంటే ధీటుగా వన్‌ప్లస్ అభివృద్ధి చేయించినట్లు తెలుస్తోంది.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.