హైదరాబాద్‌లో OnePlus 5 ఈవెంట్, అక్కడే కొనుగోలు చేసే అవకాశం

OnePlus 5 ఇండియా లాంచ్‌కు సమయం సమీపిస్తోన్న నేపధ్యంలో మరికొన్ని ఆసక్తికర వివరాలను వన్‌ప్లస్ ఇండియా అనౌన్స్ చేసింది. జూన్ 22న ముంబైలో జరిగే వన్‌ప్లస్ 5 అఫీషియల్ లాంచ్ ఈవెంట్ తరువాత నాలుగు ప్రధాన పట్టణాల్లో పాప్-అప్ ఈవెంట్ లను నిర్వహించబోతోన్నట్లు కంపెనీ తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హైదరాబాద్‌తో పాటు...

హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై ప్రాంతాల్లో ఈ pop-up ఈవెంట్స్‌‌ను నిర్వహించబోతోన్నట్లు వన్‌ప్లస్ తెలిపింది. ఈ pop-up ఈవెంట్‌కు హాజరయ్యే ప్రతిఒక్కరికి ఫోన్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయటంతో పాటు కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని, అయితే లిమిటెడ్ స్టాక్‌లోనే ఫోన్ అందుబాటులో ఉంటాయని వన్‌ప్లస్ తెలిపింది. కాబట్టి మీరు ముందు వరసలో ఉన్నట్లయితే ఫోన్ మీకు ఖచ్చితంగా లభిస్తుంది.

జూన్ 20న అంతర్జాతీయ మార్కెట్లో, జూన్ 22న ఇండియన్ మార్కెట్లో...

OnePlus 5 స్మార్ట్ ఫోన్ జూన్ 20న అంతర్జాతీయ మార్కెట్లో జూన్ 22న ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతోన్న విషయం తెలిసిందే. అమెజాన్ ఇండియాలో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా లభించే ఈ ఫోన్‌ రెండు వేరియంట్ లలో ఉంటుందని సమచారం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
OnePlus 5 India Launch: Pop-Up Events to Be Held in New Delhi, Hyderabad, Bengaluru, Chennai. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting