జూన్ 22న OnePlus 5 ఇండియా లాంచ్

వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి రాబోతోన్న లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ OnePlus 5, జూన్ 22న ఇండియాలో లాంచ్ అవుతోంది. ముంబై వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి హాజరవ్వాలనుకునే ఫ్యాన్స్ వన్‌ప్లస్ వెబ్‌సైట్‌లో టికెట్లను కొనుగోలు చేయవల్సి ఉంటుంది. ఈవెంట్‌కు హాజరైన ప్రతిఒక్కరికి సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ ఉంటాయి.

జూన్ 22న OnePlus 5 ఇండియా  లాంచ్

ఎంపిక కాబడిన ఫ్యాన్స్‌కు OnePlus 5 ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. OnePlus 5 ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో జూన్ 20న విడుదల చేస్తారు.ఈ కార్యక్రమంలో భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 నిమిషాలకు ప్రారంభమవుతుంది.

జూన్ 22న OnePlus 5 ఇండియా  లాంచ్

OnePlus 5 స్పెసిఫికేషన్స్ (అన్‌అఫీషియల్ ).. స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 2.5డి కర్వుడ్ గ్లాస్, 5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, 6జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 12 మెగా పిక్సల్ రేర్ డ్యుయల్ కెమెరా సెటప్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసిగ్ కెమెరా, ఆండ్రాయిడ్ నౌగట్ ఆధారంగా డిజైన్ చేసిన ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం, 3580 mAh బ్యాటరీ విత్ డాష్ ఛార్జ్ 2.0 టెక్నాలజీ.

English summary
OnePlus 5 is launching in India on June 22. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot