జూన్‌లోనే OnePlus 5, ఫీచర్లు ఇవే?

8జీబి ర్యామ్ వేరియంట్‌ కూడా ఉంటుందా..

|

సక్సెస్ ఫుల్ చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఒకటైన వన్‌ప్లస్ తన అప్‌కమ్మింగ్ స్మార్ట్‌ఫోన్ OnePlus 5ను జూన్‌లో లాంచ్ చేయబోతోన్నట్లు సమాచారం.

Read More : ఇండియాలో ఫోన్ పోతే దొరికే ఛాన్స్ ఎంత..?

OppoMart అనే ఆన్‌లైన్ రిటైలర్ వద్ద..

OppoMart అనే ఆన్‌లైన్ రిటైలర్ వద్ద..

ఇప్పటికే, OppoMart అనే ఆన్‌లైన్ రిటైలర్ వన్‌ప్లస్5 స్మార్ట్‌ఫోన్‌ను తన లిస్టింగ్స్‌లో ప్రదర్శించింది. ఈ రిటైలర్ పోస్ట్ చేసిన వివరాల ప్రకారం ఈ హై-ఎండ్ డివైస్ ధర 449 డాలర్లు ఉంటుందని తెలుస్తోంది. ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.29,000.

OnePlus 5 స్పెక్స్ (అన్ అఫీషియల్)

OnePlus 5 స్పెక్స్ (అన్ అఫీషియల్)

ఈ లిస్టింగ్స్ రివీల్ చేసిన వివరాల ప్రకారం OnePlus 5 స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి...

5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ స్ర్కీన్ (2560 x 1440పిక్సల్స్), 2.44గిగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 835 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 6జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 12 మెగా పిక్సల్ రేర్ డ్యుయల్ కెమెరా సెటప్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసిగ్ కెమెరా, ఆండ్రాయిడ్ నౌగట్ ఆధారంగా డిజైన్ చేసిన ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం, 3580 mAh బ్యాటరీ విత్ డాష్ ఛార్జ్ 2.0 టెక్నాలజీ.

తెరపైకి 8జీబి ర్యామ్ వేరియంట్ కూడా..
 

తెరపైకి 8జీబి ర్యామ్ వేరియంట్ కూడా..

మార్కెట్లో వినిపిస్తోన్న మరికొన్ని రూమర్స్ ప్రకారం OnePlus 5 8జీబి ర్యామ్ వేరియంట్‌లో కూడా లభ్యమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ వేరియంట్ 3600mAh బ్యాటరీ పై రన్ అవుతుందట.

తాజా రిపోర్ట్స్‌ను బట్టి చూస్తంటే..

తాజా రిపోర్ట్స్‌ను బట్టి చూస్తంటే..

OnePlus 5 జూన్ మొదటి వారంలో లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే వన్‌ప్లస్ కంపెనీ సీఈఓ OnePlus 5 తయారీ ప్రాసెస్‌లో ఉన్నట్లు ధృవీకరించారు.

 

వన్‌ప్లస్ 3 ఆమె చేేతిలో అదరహో...

వన్‌ప్లస్ 3 ఆమె చేేతిలో అదరహో...

స్మార్ట్‌ఫోన్స్ ఎంత సెక్సీగా ఉంటాయో తెలుసా.. ఎంత సెక్సీగా ఉంటాయంటే మీరు ఫోటోలు చూసినంతగా.. వన్‌ప్లస్ 3టీ మిడ్‌నైట్ బ్లాక్ ఎడిషన్ స్టార్స్ , టీవీ ప్రెజెంటర్, డ్యాన్సర్, లోకల్ సెలబ్రిటి షిబాని దండేకర్ ఇచ్చిన ఫోజులకు గాడ్జెట్ ప్రపంచమే ఫిదా అయిపోయింది. వన్‌ప్లస్ ఫోన్‌ను పట్టుకుని ఆమె మాట్లాడుతుంటే స్మార్ట్‌ఫోన్ ప్రపంచానికే కొత్త ఊపు వచ్చినట్లయింది.

డిసెంబర్ 14నుంచి ఇండియన్ మార్కెట్లో..

డిసెంబర్ 14నుంచి ఇండియన్ మార్కెట్లో..

OnePlus 3T స్మార్ట్‌ఫోన్‌ డిసెంబర్ 14నుంచి ఇండియన్ మార్కెట్లో దొరుకుతోంది. 6జీబి ర్యామ్‌తో వచ్చిన ఈ ఫోన్ ను రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 64జీబి స్టోరేజ్ వర్షన్ ధర రూ.29,999. 128జీబి స్టోరేజ్ వర్షన్ ధర రూ.34,999. Amazon Indiaలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది...

 OnePlus 3కి అప్‌గ్రేడెడ్ వర్షన్

OnePlus 3కి అప్‌గ్రేడెడ్ వర్షన్

ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న OnePlus 3 ఫోన్‌తో పోలిస్తే కెమెరా, స్టోరేజ్, బ్యాటరీ ఇంకా ప్రాసెసర్ విభాగాల్లో వన్‌ప్లస్ 3టీ ఫోన్ అప్‌గ్రేడెడ్ ఫీచర్లను కలిగి ఉంది. OnePlus 3T స్మార్ట్‌ఫోన్‌ను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దారు..

శక్తివంతమైన ప్రాసెసర్...

శక్తివంతమైన ప్రాసెసర్...

వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 2.35GHz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్‌తో వస్తోంది. OnePlus 3 ఫోన్ తరహాలోనే ఈ ఫోన్‌లో కూడా 6జీబి ర్యామ్‌ను ఏర్పాటు చేయటం జరిగింది.

రెండు స్టోరేజ్ వేరియంట్స్...

రెండు స్టోరేజ్ వేరియంట్స్...

వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అందులో మొదటికి 64జీబి వర్షన్, రెండవది 128జీబి వర్షన్. వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 3400 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఇదే సమయంలో OnePlus 3 ఫోన్ కేవలం 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని మాత్రమే కలిగి ఉంది.

16 మెగా పిక్సల్ కెమెరా సపోర్ట్..

16 మెగా పిక్సల్ కెమెరా సపోర్ట్..

న్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్, రెండు 16 మెగా పిక్సల్ కెమెరాలను కలిగి ఉంటుంది. వీటిని ఫ్రంట్ ఇంకా రేర్ భాగాల్లో అమర్చటం జరిగింది., సామ్‌సంగ్ 3P8SP సెన్సార్‌తో ఇంటిగ్రేట్ చేయబడిన ఈ కెమెరాల ద్వారా హైడెఫినిషన్ వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.

ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే..

ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే..

వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్.. 5.5 అంగుళాల 1080 పిక్సల్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తోంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్ డిస్‌ప్లేకు రక్షణ కవచంలా నిలుస్తుంది.

ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం

ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం

వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారండా డిజైన్ చేసిన ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. త్వరలో నౌగట్ అప్‌డేట్ లభించే అవకాశముంది.

కనెక్టువిటీ ఫీచర్లు..

కనెక్టువిటీ ఫీచర్లు..

గన్ మెటల్, గ్రాఫైట్ ఇంకా సోఫ్ట్ గోల్డ్ కలర్ వేరియంట్‌లలో వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్బీ టైప్-సీ కనెక్టర్, ఫ్లాస్ట్ ఛార్జింగ్ కోసం డాష్ ఛార్జ్ టెక్నాలజీ, డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ (క్యాటగిరి 6), డ్యుయల్ బ్యాండ్ వై-ఫై, వై-ఫై డెరెక్ట్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ 2.0 విత్ టైప్-సీ పోర్ట్, గూగుల్ కాస్ట్, జీపీఎస్, గ్లోనాస్, బ్లుటూత్ 4.2, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్.

Best Mobiles in India

English summary
OnePlus 5 listing reveals price and complete specs ahead of June launch. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X