8జీబి ర్యామ్‌తో OnePlus 5

2017కు గాను ప్రముఖ బ్రాండ్‌లకు సంబంధించిన హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లు ఒక్కొక్కటిగా మార్కెట్లో లాంచ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో OnePlus కూడా తన తదుపరి వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ పై కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదలైన వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది.

Read More : ప్రపంచంలోనే అతి‌చిన్న స్మార్ట్‌ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భారీ అంచనాలు...

శక్తివంతమైన ఫీచర్లతో లాంచ్ అయిన ఈ డివైస్ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు తెగ నచ్చేస్తుండటంతో అప్‌కమ్మింగ్ వన్‌ప్లస్ ఫోన్ పై భారీ అంచనాలు నెలకున్నాయి.

వన్‌ప్లస్ 4 ఉండుదట?

వాస్తవానికి వన్‌ప్లస్ 3కి సక్సెసర్ వర్షన్‌గా వన్‌ప్లస్ 4 మార్కెట్లోకి రావల్సి ఉంది. అయితే చైనా మూఢనమ్మకాల ప్రకారం 4 అంకె కలిసిరాదట. ఈ నేపథ్యంలో వన్‌ప్లస్ 4ను పక్కనబెట్టి వన్‌ప్లస్ 5 మోడల్ పై కంపెనీ దృష్టిసారించినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.

జియో ప్రైమ్ ఆఫర్ పొడిగింపు, ఒక నెల కొంటే 4 నెలలు ఉచితం

శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్

వన్‌ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ పై రన్ అయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో 8జీబి ర్యామ్ కెపాసిటీతో ఈ ఫోన్‌ను రంగంలోకి దింపనున్నారట. 23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను కూడా ఫోన్‌లో అమర్చనున్నారట.

మరి కొన్ని రూమర్స్ ప్రకారం..

వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్ ఆల్ గ్లాస్ డిజైనింగ్‌తో రాబతోందట. 5.5 అంగుళాల డ్యుయల్ కర్వుడ్ ఫుల్ హైడెఫిపిషన్ డిస్‌ప్లే ఫోన్‌కు మరో ప్రధాన ఆకర్షణ కానుందట. ఈ రెండు ప్రధానమైన అంశాలు ఫోన్‌కు ప్రీమియమ్ లుక్‌ను తీసుకువస్తాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

రోజుకు 10జీబి డేటా, BSNL సంచలనం

మరి కొన్ని రూమర్స్ ప్రకారం..

వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్ IP68 సర్టిఫికేషన్‌తో రాబోతోంది. ఈ రేటింగ్‌తో వచ్చే ఫోన్ నీరు ఇంకా దుమ్ము ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కోగలదు. యూఎస్టీ టైప్ - సీ పోర్టును కూడా ఈ ఫోన్ లో నిక్షిప్తం చేసే అవకాశముందట. వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ కెపాసిటీ విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్ 64జీబి, 128జీబి ఇంకా ఆపై వేరియంట్‌లలో లభ్యమయ్యే అవకాశముందట.

పాఠకులకు గమనిక : ఈ స్టోరీలో ఉపయోగించుకున్న ఫోటోలు వన్‌ప్లస్ 5 ఫోన్‌కు చెందినవి కాదు. 

 

వన్‌ప్లస్ 5 కాన్సెప్ట్ వీడియో..

వన్‌ప్లస్ 5 కాన్సెప్ట్ వీడియో..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
OnePlus 5 Rumored To Come With Snapdragon 835 SoC, 23MP Camera. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot