ప్రపంచంలోనే శక్తివంతమైన ప్రాసెసర్‌తో OnePlus 5
ఇదే విషయాన్నిQualcomm కూడా ధృవీకరించింది.
న్‌ప్లస్ కంపెనీ నుంచి మరికొద్ది రోజుల్లో లాంచ్ కాబోతోన్న OnePlus 5 ఫోన్ గురించి ఒక్కో సమాచారం అఫీషియల్‌గా రివీల్ అవుతోంది. వన్‌ప్లస్ బ్రాండ్ సీఈఓ Pete Lau వెల్లడించిన వివరాల ప్రకారం వన్‌ప్లస్ 5 ఫోన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మొబైల్ ప్రాసెసర్‌గా భావిస్తోన్న స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ పై రన్ కాబోతోంది. ఇదే విషయాన్నిQualcomm కూడా ధృవీకరించింది.

వన్‌ప్లస్ 4 ఏమైంది..?
వాస్తవానికి వన్‌ప్లస్ 3కి సక్సెసర్ వర్షన్‌గా వన్‌ప్లస్ 4 మార్కెట్లోకి రావల్సి ఉంది. అయితే చైనా మూఢనమ్మకాల ప్రకారం 4 అంకె కలిసిరాదట. ఈ నేపథ్యంలో వన్‌ప్లస్ 4ను పక్కనబెట్టి వన్‌ప్లస్ 5 మోడల్‌ను కంపెనీ తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.

స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ పై రన్ అయ్యే ఈ ఫోన్‌ను 8జీబి అలానే 6జీబి ర్యామ్ కెపాసిటీలో అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది.

అప్‌గ్రేడెడ్ కెమెరా..
అప్‌గ్రేడెడ్ కెమెరా ఫీచర్లతో రాబోతోన్న ఈ ఫోన్‌లో 23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 16 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాను ఫిట్ చేసినట్లు రూమర్స్ మిల్స్ చెబుతున్నాయి.

డ్యుయల్ కర్వుడ్ ఫుల్ హైడెఫిపిషన్ డిస్‌ప్లే
వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్ ఆల్ గ్లాస్ డిజైనింగ్‌తో రాబతోందట. 5.5 అంగుళాల డ్యుయల్ కర్వుడ్ ఫుల్ హైడెఫిపిషన్ డిస్‌ప్లే ఫోన్‌కు మరో ప్రధాన ఆకర్షణ కానుందట. ఈ రెండు ప్రధానమైన అంశాలు ఫోన్‌కు ప్రీమియమ్ లుక్‌ను తీసుకువస్తాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

IP68 సర్టిఫికేషన్‌తో..
వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్ IP68 సర్టిఫికేషన్‌తో రాబోతున్నట్లు సమాచారం. ఈ రేటింగ్‌తో వచ్చే ఫోన్ నీరు ఇంకా దుమ్ము ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కోగలదు

64జీబి, 128జీబి, 256జీబి స్టోరేజ్ కెపాసిటీల్లో..
యూఎస్టీ టైప్ - సీ పోర్టును కూడా ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసే అవకాశముందట. వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్ 64జీబి, 128జీబి, 256జీబి స్టోరేజ్ కెపాసిటీలో అందుబాటులో ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications








