8జీబి ర్యామ్‌తో OnePlus 5, అమెజాన్ ఎక్స్‌క్లూజివ్

జూన్ 22న ఇండియాలో లాంచ్ కాబోతోన్న OnePlus 5 స్మార్ట్‌ఫోన్‌ను తమ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతున్నట్లు Amazon India తెలిపింది. ఈ లాంచ్‌కు సంబంధించి ఓ ప్రత్యేకమైన పేజీని కూడా అమెజాన్ విడుదల చేసింది. ఈ పేజీలో పేర్కొన్న వివరాల ప్రకారం OnePlus 5 ఫోన్ జూన్ 22, మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ అవుతుంది. అదే రోజు సాయంత్రం 4.30 నుంచి సేల్‌ ప్రారంభమవుతుంది.

8జీబి ర్యామ్‌తో OnePlus 5, అమెజాన్ ఎక్స్‌క్లూజివ్

వన్‌ప్లస్‌5 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ రోజే కొనాలనుకుంటున్న యూజర్లు ఈ అమెజాన్ పేజీలోకి వెళ్లి, తమ అకౌంట్‌లోకి లాగిన్ అవటం ద్వారా నోటిఫికేషన్ అలర్ట్‌ను సెట్ చేసుకోవచ్చు. 2.3 గిగాహెట్జ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 8జీబి ర్యామ్ కాంభినేషన్‌తో కూడిన OnePlus 5 ఫోన్ జూన్ 22న అమెజాన్.ఇన్ ద్వారా ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల కాబోతున్నట్లు ప్రముఖ టిప్స్టర్ ఇవాన్ బ్లాస్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేసారు.

8జీబి ర్యామ్‌తో OnePlus 5, అమెజాన్ ఎక్స్‌క్లూజివ్

OnePlus 5కు సంబంధించి తాజాగా లీకైన మరికొన్ని రూమర్స్ ప్రకారం వన్‌ప్లస్5, ఐఫోన్ 7ప్లస్‌కు దగ్గర పోలికలను కలిగి ఉంటుంది. OnePlus 5 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉండొచ్చు..?

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,

2.35గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 835 ఆక్టా కోర్ ప్రాసెసర్,

8జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),

ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,

16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

23 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,

4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

English summary
OnePlus 5 Will Sport 8GB of RAM, Amazon India Source Code Reveals. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting