రికార్డుల హోరులో OnePlus 5T..

Written By:

వన్‌ప్లస్ నుంచి దూసుకొచ్చిన OnePlus 5T గ్లోబల్ మార్కెట్లో అమ్మకపు రికార్డుల హోరును తలపిస్తూ పోతోంది. నవంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా ప్రైమ్ మెంబర్ షిప్ యూజర్ల కోసం తొలిసారి అమ్మకానికి వచ్చిన ఈ ఫోన్ రికార్డు స్థాయిలో అమ్మకాలను కొల్లగొట్టింది.

కూల్ ప్యాడ్ నోట్ 5 లైట్ 32 జిబి వేరియంట్ విడుదల

టాప్ లైన్ స్పెషిఫికేషన్స్ తో దూసుకొచ్చిన ఈ ఫోన్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. నేటి నుండి ఈ ఫోన్ అమెజాన్ లోనూ, అలాగే oneplusstoreలోనూ అమ్మకానికి రానుంది. మధ్యాహ్నం 12 pm నుంచి 1 pm వరకు అదీ గంట సేల్ మాత్రమే జరగనుంది. దీని ధరను కంపెనీ రూ. 32,999 నిర్ణయించింది.

నోకియా 2 వచ్చేసింది, ధర రూ. 6,999 మాత్రమే, 2 రోజుల బ్యాటరీ బ్యాకప్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ధర

అమ్మకాల్లో సంచలనం రేపిన OnePlus 5కి అధునాతన ఫీచర్లు జోడించి OnePlus 5Tని మార్కెట్లోకి కంపెనీ తీసుకువచ్చింది. 6జిబి ర్యామ్ 64జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌ధర రూ. 32,999గానూ,8 జిబి ర్యామ్ 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌ధరను రూ. 37,999గానూ నిర్ణయించింది.

OnePlus 5T ఫీచర్లు

6అంగుళాల ఆప్లిక్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 1080 x 2160 రిజల్యూషన్‌, స్నాప్‌డ్రాగన్‌ 845 ప్రోసెసర్‌ ఆండ్రాయిడ్‌ నౌగట్‌ 7.1.1, ఓరియో అప్ డేట్, వెనుక 20 ఎంపీ కెమెరా, 6/8జీబీ ర్యామ్‌ , 64/128 జీబీ స్టోరేజ్‌, 3,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ఆఫర్లు

అమెజాన్లో HDFC Bank Debit and Credit Cards తో కొనుగోలు చేసిన వారికి రూ. 1500 డిస్కౌంట్ అందనుంది. అలాగే ఐడియా యూజర్లు కోసం 18 నెలల పాటు 1000 జిబి డేటా కూడా ఇవ్వనున్నారు. దీంతో పాటు ఏడాది పాటు Accidental Damage Insuranceని కూడా ఉంది. దీనిపై మరిన్ని ఆఫర్లు ఏంటనేది 12 pm తర్వాత తెలుస్తుంది.

 

 

వన్ ప్లస్ 5 ఫీచర్లు...

కాగా వన్‌ప్లస్ 5 ఇప్పటికే ఇండియా మార్కెట్లోకి వచ్చింది. వన్ ప్లస్ 5 ఫీచర్లు... 5.5 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 23 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్ 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 4జీ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 3600 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యాష్ చార్జ్ 2.0

అంచులు పలుచగా

అంచులు పలుచగా (బెజిల్‌లెస్‌) ఉండటం ఈ మొబైల్‌ ప్రత్యేకత. సగం స్క్రీన్‌ మాత్రమే కనిపిస్తున్న ఈ ఫొటోలో అంచులు తక్కువగా ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన ఫుల్‌ స్క్రీన్‌ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లు శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌9, ఎల్‌జీ జీ6, ఐఫోన్‌ ఎక్స్‌, ఎంఐ మిక్స్‌కు ఈ మొబైల్‌ గట్టిపోటీ ఇవ్వనుందని నివేదికలు తెలియజేస్తున్నాయి.

6 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే..

వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్ 6 అంగుళాల ఫుల్ హెచ్‌డి (రిసల్యూషన్ 1,060×2,080 పిక్సల్) డిస్‌ప్లేతో రాబోతోంది. 18:9 యాస్పెక్ట్ రేషియోను కలిగి ఉండే ఈ డిస్‌ప్లే పై ఎక్కువు కంటెంట్‌ను వీక్షించే వీలుంటుంది. బీజిల్-లెస్ డిజైన్‌తో రాబోతోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను వన్‌ప్లస్ డిజైన్ టీమ్ అత్యుత్తమంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో పొందుపరిచిన బెస్ట్ క్లాస్ ప్రాసెసర్‌ ఇంకా శక్తివంతమైన ర్యామ్‌ వ్యవస్థలు మల్టిటాస్కింగ్‌ను కొత్త లెవల్‌కు తీసుకువెళతాయట.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
OnePlus 5T does it again: Creates launch day sales record in just 6 hours more news at Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot