వన్‌ప్లస్ నుంచి మరో సంచలనం దూసుకొస్తోంది

Written By:

ప్రముఖ చైనా దిగ్గజం వన్‌‌ప్లస్‌ అతి త్వరలో లాంచ్ చేయబోతున్న న్యూ స్మార్ట్‌ఫోన్ వివరాలు సోషల్ మీడియాలో లీకయ్యాయి. నవంబర్ 16న ఇది అధికారికంగా మార్కెట్లోకి రానుందని అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు స్పెషిఫికేషన్లు, డిజైన్‌ తదితర వివరాలు లీకయ్యాయి.

వన్‌ప్లస్ 5 కోసం గంటల తరబడి క్యూలైన్‌లలో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భారీ స్క్రీన్‌, డ్యుయల్‌ కెమెరా సెటప్‌..

ఫుల్‌హెచ్‌డీ రిజల్యూషన్ భారీ స్క్రీన్‌, డ్యుయల్‌ కెమెరా సెటప్‌, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ , ఫేస్‌ అన్‌లాకింగ్‌ సాఫ్ట్‌వేర్‌తో ​ ఫీచర్‌తో దీన్ని లాంచ్‌ చేయనుందని వివిధ నివేదికల ద్వారా తెలుస్తోంది.

వన్‌ప్లస్‌ 5 స్మార్ట్‌ఫోన్‌ తరహాలోనే..

దాదాపు వన్‌ప్లస్‌ 5 స్మార్ట్‌ఫోన్‌ తరహాలోనే ఉన్నప్పటికీ తాజా డివైజ్‌ను 6జీబీ/64జీబీ స్టోరేజ్‌ , 8 జీబీ/128 స్టోరేజ్‌ వేరియంట్లలో దీన్ని లాంచ్‌ చేయనుందట. ధర వివరాలు ఇంకా తెలియలేదు.

 

వన్‌ప్లస్‌ 5టి నవంబర్‌ 21న..

అనధికార సమాచారం ప్రకారం వన్‌ప్లస్‌ 5టి నవంబర్‌ 21న ఇండియన్‌ మార్కెట్లో లాంచ్‌ కానుంది. నవంబర్‌ 28నుంచి అమెజాన్‌ ఇండియా ద్వారా ఇది విక్రయానికి లభించనుంది. మరోవైపు వైర్‌లెస్‌ చార్జర్‌తో ఈ డివైస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వన్‌‌ప్లస్​ సీఈవో ఇప్పటికే వెల్లడించారు.

అంచులు పలుచగా

అంచులు పలుచగా (బెజిల్‌లెస్‌) ఉండటం ఈ మొబైల్‌ ప్రత్యేకత. సగం స్క్రీన్‌ మాత్రమే కనిపిస్తున్న ఈ ఫొటోలో అంచులు తక్కువగా ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన ఫుల్‌ స్క్రీన్‌ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లు శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌9, ఎల్‌జీ జీ6, ఐఫోన్‌ ఎక్స్‌, ఎంఐ మిక్స్‌కు ఈ మొబైల్‌ గట్టిపోటీ ఇవ్వనుందని నివేదికలు తెలియజేస్తున్నాయి.

వన్‌ప్లస్‌ 5టి ఫీచర్లు

6అంగుళాల ఆప్లిక్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే
1080 x 2160 రిజల్యూషన్‌
స్నాప్‌డ్రాగన్‌ 845 ప్రోసెసర్‌
ఆండ్రాయిడ్‌ నౌగట్‌ 7.1.1, ఓరియో అప్ డేట్
వెనుక 20 ఎంపీ కెమెరా
6/8జీబీ ర్యామ్‌ , 64/128 జీబీ స్టోరేజ్‌
3,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ

వన్ ప్లస్ 5 ఫీచర్లు...

కాగా వన్‌ప్లస్ 5 ఇప్పటికే ఇండియా మార్కెట్లోకి వచ్చింది.
వన్ ప్లస్ 5 ఫీచర్లు...
5.5 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే
2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్
64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
23 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 4జీ
ఫింగర్‌ప్రింట్ సెన్సార్
3600 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యాష్ చార్జ్ 2.0

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
OnePlus 5T launch on Nov 16: Details of design, features & specs revealed read more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot