అభిమానుల కళ్లన్నీ ఈ ఫోన్ వైపే, అయిదు నగరాల్లో లైవ్ షో..

Written By:

చైనాకు చెందిన మొబైల్ దిగ్గజం వన్‌ప్లస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 5టీని ఈ నెల 16వ తేదీన విడుదల చేయనున్న విషయం విదితమే. న్యూయార్క్ లో అట్టహాసంగా జరగనున్న ఈ వేడుకలో OnePlus 5Tని కంపెనీ రిలీజ్ చేయనుంది. ఈ ఫోన్ ఈవెంట్ ని Bangalore, Delhi, Mumbai, Hyderabad, and Pune లాంటి నగరాల్లోని PVR theatresలో లైవ్ షోగా అందిచనున్నారు.

వన్‌ప్లస్ నుంచి మరో సంచలనం దూసుకొస్తోంది

అభిమానుల కళ్లన్నీ ఈ ఫోన్ వైపే, అయిదు నగరాల్లో లైవ్ షో..

ఈ లాంచ్ ఈవెంట్ టికెట్ ధరను 50 డాలర్లుగా కూడా కంపెనీ కన్ఫర్మ్ చేసింది. అయితే ఈ టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ నెల 16వ తేదీన గురువారం భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు వన్‌ప్లస్ 5టీ ఈవెంట్ జరగనుంది.

రూ. 3 వేల తగ్గింపుతో 6జిబి ర్యామ్ ఫోన్, నవంబర్ 16 నుంచి ఎక్స్‌క్లూజివ్ విక్రయాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వన్‌ప్లస్‌ 5టి ఫీచర్లు (అంచనా)

6అంగుళాల బెజెల్ లెస్ డిస్‌ప్లే
2160 x 1080 రిజల్యూషన్‌
స్నాప్‌డ్రాగన్‌ 845 ప్రోసెసర్‌
ఆండ్రాయిడ్‌ నౌగట్‌ 7.1.1, ఓరియో అప్ డేట్
వెనుక 20 ఎంపీ కెమెరా , 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
6/8జీబీ ర్యామ్‌ , 64/128 జీబీ స్టోరేజ్‌
3,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ

అమ్మకాల తేదీల‌ను..

లాంచ్ తేదీకి ముందే ఈ ఫోన్ అమ్మకాల తేదీల‌ను మాత్రం ఆ సంస్థ కన్‌ఫాం చేసింది. వన్‌ప్లస్ 5టీ ఈ నెల 28వ తేదీ నుంచి వినియోగదారులకు మార్కెట్‌లో అందుబాటులోకి వస్తుంది.

ఈ నెల 21వ తేదీనే అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు

అయితే అంతకు వారం ముందుగానే.. అంటే ఈ నెల 21వ తేదీనే అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ఈ ఫోన్ ఫ్లాష్ సేల్‌లో లభ్యం కానుంది. ఆ రోజున సాయంత్రం 4.30 గంటలకు వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్‌కు గాను ఫ్లాష్ సేల్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అమెజాన్ సంస్థ తెలియజేసింది.

6/8 జీబీ ర్యామ్ వేరియెంట్లలో

ఇక ఈ ఫోన్ 6/8 జీబీ ర్యామ్ వేరియెంట్లలో లభ్యం కానుండగా, ప్రారంభ ధర రూ.38వేలుగా ఉండనున్నట్టు సమాచారం. కాగా వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్ ధర ఇప్పుడు రూ. 38 వేలుగా ఉంది.

ఫింగర్ ప్రింట్ ప్రధాన ఆకర్షణ

OnePlus 5Tకి ఫింగర్ ప్రింట్ ప్రధాన ఆకర్షణగా నిలవనుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. స్టన్నింగ్ డిైన్ తో వచ్చిన ఈ సెన్సార్ ద్వారా ఫోన్ మరింత అందంగా కనిపిస్తుందని, ఎటువంటి అంతరాయం లేకుండా లాక్ ఓపెన్ అవుతందని కంపెనీ చెబుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
OnePlus 5T set to redefine smartphone trend as it will be the first in many aspects more news at Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting