బంపరాఫర్లతో అమ్మకానికి వచ్చిన OnePlus 5T స్మార్ట్‌ఫోన్

By Hazarath
|

చైనా సెల్ఫీ మొబైల్ దిగ్గజం వన్‌ప్లస్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వన్‌ప్లస్‌ 5టీ స్మార్ట్‌ఫోన్‌ ఇండియాలో అమ్మకానికి వచ్చింది. నేటి నుండి అమెజాన్‌ ఇండియా, వన్‌ప్లస్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌ ద్వారా ఈ ఫోన్‌ను విక్రయిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. కాగా అమెజాన్‌ ఇండియా, వన్‌ప్లస్‌ ఆన్‌లైన్‌ స్టోర్లు రెండు ఈ ఫోన్ మీద పలు ఆఫర్లను ప్రకటించాయి.

 

ఆఫ్‌లైన్ స్టోర్లలో అమ్మకానికి నోకియా 6. ధర రూ. 14,999ఆఫ్‌లైన్ స్టోర్లలో అమ్మకానికి నోకియా 6. ధర రూ. 14,999

వన్‌ప్లస్‌ 5టీ ఫీచర్లు

వన్‌ప్లస్‌ 5టీ ఫీచర్లు

6 అంగుళాల అప్టిక్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే
ప్రొటెక్షన్‌ కోసం గొర్రిల్లా గ్లాస్‌ 5
ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌
6జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
8జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
ఆక్సీజెన్‌ఓఎస్‌ ఆధారిత ఆండ్రాయిడ్‌ 7.1.1 నోగట్‌తో రన్నింగ్‌
రెండు ప్రైమరీ కెమెరాలు, ఒకటి 20మెగాపిక్సెల్‌ సెన్సార్‌, రెండోది 16 మెగాపిక్సెల్‌ మోడ్యూల్‌
ముందు వైపు 16 మెగాపిక్సెల్‌ కెమెరా
తక్కువ వెలుతురులో కూడా మెరుగైన ఇమేజ్‌లు తీయడం దీని ప్రత్యేకత
3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ‌
ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌

ధర

ధర

6జీబీ ర్యామ్‌, 64జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.32,999 , 8జీబీ ర్యామ్‌, 128జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌ ధర రూ.37,999గా కంపెనీ నిర్ణయించింది. కాగా మిడ్‌నైట్‌ బ్లాక్‌ కలర్‌ వేరియంట్‌ మాత్రమే ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులో ఉంది.

రూ.1500 క్యాష్‌బ్యాక్‌
 

రూ.1500 క్యాష్‌బ్యాక్‌

ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డు యూజర్లకు రూ.1500 క్యాష్‌బ్యాక్‌, ఐడియా నుంచి 100జీబీ 4జీ మొబైల్‌ డేటా( రూ.357 రీఛార్జ్‌పై 18 నెలల పాటు రోజుకు 2జీబీ డేటా) ఇస్తోంది.

 ఏడాది ఉచిత మెంబర్‌షిప్‌

ఏడాది ఉచిత మెంబర్‌షిప్‌

జోమాటో గోల్డ్‌ ఏడాది ఉచిత మెంబర్‌షిప్‌, కిండిల్‌ స్టోర్‌పై రూ.500 క్రెడిట్‌, కొత్త అమెజాన్‌ ప్రైమ్‌ కస్టమర్లకు రూ.300 అమెజాన్‌ పే బ్యాలెన్స్‌, ప్రైమ్‌ వీడియో యాప్‌ ద్వారా వీడియో స్ట్రీమ్‌ చేస్తే రూ.250 అమెజాన్‌ పే బ్యాలెన్స్‌ అందుబాటులో ఉన్నాయి.

వన్ ఇయర్ యాక్సిడెంటల్ డ్యామేజి ఇన్సూరెన్స్

వన్ ఇయర్ యాక్సిడెంటల్ డ్యామేజి ఇన్సూరెన్స్

వన్‌ప్లస్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌పై వన్‌ప్లస్‌ 5టీ కొనుగోలు చేసిన కస్టమర్లకు యాక్ససరీస్‌పై రూ.1000 తగ్గింపు లభించనుంది. దీంతో పాటు కంపెనీ వన్ ఇయర్ యాక్సిడెంటల్ డ్యామేజి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా అందించనుంది.

 

 

Best Mobiles in India

English summary
OnePlus 5T now available for buying for all in India, price starts at Rs 32,999 Read more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X