ఆపిల్, సామ్‌సంగ్‌లకు OnePlus 5T షాకివ్వబోతోందా..?

|

ఆపిల్, సామ్‌సంగ్ వంటి దిగ్గజ బ్రాండ్‌లకు షాకిస్తూ, బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో హై-ఎండ్ ఫోన్‌లను అందిస్తోన్న వన్‌ప్లస్ మరో సంచలనానికి సిద్ధమవుతోంది. OnePlus 5T పేరుతో ఈ బ్రాండ్ అభివృద్ది చేసిన లెేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ నవంబర్ 16న న్యూయార్క్‌లో లాంచ్ కాబోతోంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ లాంచ్ ఈవెంట్‌ను వన్‌ప్లస్ ఇండియాన్ ఫ్యాన్స్ పీవీఆర్ థియేటర్స్ ద్వారా వీక్షించే వీలుంటుంది.

 

ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్ ఇంకా పూణే నగరాల్లోని ఎంపిక చేసిన పీవీఆర్ సినిమా థియేటర్స్‌లో ఈ లాంచ్ ఈవెంట్‌ను వన్‌ప్లస్ ప్రత్యక్ష ప్రసారం చేయబోతోంది. ఈ లైవ్ ఈవెంట్‌కు సంబంధించిన టికెట్లను Bookmyshow వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. టికెట్ ఖరీదు రూ.99. ఇండియన్ మార్కెట్లో వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్ ఇండియాతో పాటు వన్‌ప్లస్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లు అఫీషియల్‌గా విక్రయించబోతున్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన Early Access Sale నవంబర్ 21 సాయత్రం 4.30 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. ఈ సేల్‌లో లిమిటెడ్ స్టాక్‌లో మాత్రమే వన్‌ప్లస్ 5టీ యూనిట్లు అందుబాటులో ఉంటాయి. అఫీషియల్ సేల్ మాత్రం నవంబర్ 28 నుంచి ప్రారంభమవుతుంది. వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి కొద్దికొద్దిగా వివరాలను రివీల్ చేస్తూ వస్తోన్న వన్‌ప్లస్ ఈసారి ఓ టీజర్ వీడియోనే లాంచ్ చేసింది. ఆ videoను ఇక్కడ మీరు చూడొచ్చు.

వన్‌ప్లస్ 5కు సక్సెసర్ వర్షన్..

వన్‌ప్లస్ 5కు సక్సెసర్ వర్షన్..

వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయి 100 రోజులు పూర్తయినప్పటికి ఇంకా ఆ ఫోన్‌కు క్రేజ్ తగ్గలేదు. ఇందుకు కారణం ఫోన్‌లోని ప్రీమియమ్ రేంజ్ స్పెసిఫికేషన్లే. ఈ నేపథ్యంలో వన్‌ప్లస్ 5కు సక్సెసర్ వర్షన్‌గా రాబోతోన్న వన్‌ప్లస్ 5టీ పై భారీ అంచనాలు నెలకున్నాయి. ఇంయిన్ మార్కెట్లో వన్‌ప్లస్ 5టీ ధర రూ.40,000లోపు ఉండొచ్చని తెలుస్తోంది.

 6 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే..

6 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే..

వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్ 6 అంగుళాల ఫుల్ హెచ్‌డి (రిసల్యూషన్ 1,060×2,080 పిక్సల్) డిస్‌ప్లేతో రాబోతోంది. 18:9 యాస్పెక్ట్ రేషియోను కలిగి ఉండే ఈ డిస్‌ప్లే పై ఎక్కువు కంటెంట్‌ను వీక్షించే వీలుంటుంది. బీజిల్-లెస్ డిజైన్‌తో రాబోతోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను వన్‌ప్లస్ డిజైన్ టీమ్ అత్యుత్తమంగా తీర్చిదిద్దిన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో పొందుపరిచిన బెస్ట్ క్లాస్ ప్రాసెసర్‌ ఇంకా శక్తివంతమైన ర్యామ్‌ వ్యవస్థలు మల్టిటాస్కింగ్‌ను కొత్త లెవల్‌కు తీసుకువెళతాయట.

కొత్త ఫోన్ 8 గంటలు ఛార్జింగ్ పెట్టి వాడాలా, కారణం ఏంటీ..?కొత్త ఫోన్ 8 గంటలు ఛార్జింగ్ పెట్టి వాడాలా, కారణం ఏంటీ..?

ముఖ్యమైన కెమెరా అప్‌గ్రేడ్స్
 

ముఖ్యమైన కెమెరా అప్‌గ్రేడ్స్

వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పల కెమెరా శాంపిల్స్‌ను కంపెనీ సహ వ్యవస్థాపకులైన కార్ల్ పీ,పీట్ లాయులు ఇటీవల తమ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా రివీల్ చేయటం జరిగింది. ఈ శాంపిల్స్‌ను బట్టి చూస్తుంటే వన్‌ప్లస్ 5టీ కెమెరాలు ప్రొఫెషనల్ స్థాయి ఫీచర్లతో రాబోతున్నాయన్నది స్పష్టమవుతోంది.

 పెద్ద బ్యాటరీ, క్విక్ ఛార్జింగ్...

పెద్ద బ్యాటరీ, క్విక్ ఛార్జింగ్...

వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్‌లలో వినియోగించిన అమోల్డ్ ప్యానల్స్‌ను సామ్‌సంగ్ తయారు చేసినట్లు తెలుస్తోంది. భారీ ఫీచర్లతో వస్తోన్న వన్‌ప్లస్ 5టీకి పెద్ద బ్యాటరీనే అవుతుంది. చూచాయిగా తెలుస్తోన్న సమచారం ప్రకారం వన్‌ప్లస్ 5టీ 3,450mAh బ్యాటరీతో రాబోతోంది. వన్‌ప్లస్ డాష్ చార్జింగ్ సపోర్ట్‌తో ఈ బ్యాటరీ క్షణాల్లో చార్జ్ చేసుకునే వీలుంటుంది.

OnePlus 5T స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉండొచ్చు..

OnePlus 5T స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉండొచ్చు..

6-ఇంచ్ క్వాడ్ హైడెఫినిషన్ స్ర్కీన్, 18:9 యాస్పెక్ట్ రేట్ డిస్‌ప్లే విత్ 2160 x 1080 పిక్సల్స్ రిసల్యూషన్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 క్వాడ్-కోర్ ప్రాసెసర్, క్లాక్‌ స్పీడ్ అప్‌ టూ 2.45GHz, ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), - 20 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా, F2.6/F1.6 అపెర్చుర్.

Best Mobiles in India

English summary
OnePlus to launch OnePlus 5T on November 16 in New York. The smartphone will flaunt a 6-inch FHD+ screen

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X