Home
Mobile

డీల్ అంటే ఇదే, OnePlus 6 పై ఏకంగా రూ.5000 తగ్గింపు..

పండుగ సీజన్‌ను పురస్కరించుకుని వన్‌ప్లస్ ఇండియా సంచలన ఆఫర్‌తో దూసుకొచ్చింది. తన ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ అయిన వన్‌ప్లస్ 6 (OnePlus 6) పై ఏకంగా రూ.5000 ధర తగ్గింపును వన్‌ప్లస్ అనౌన్స్ చేసింది.

పండుగ సీజన్‌ను పురస్కరించుకుని వన్‌ప్లస్ ఇండియా సంచలన ఆఫర్‌తో దూసుకొచ్చింది. తన ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ అయిన వన్‌ప్లస్ 6 (OnePlus 6) పై ఏకంగా రూ.5000 ధర తగ్గింపును వన్‌ప్లస్ అనౌన్స్ చేసింది. అక్టోబర్ 10వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు Amazon.in లో జరగబోతోన్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భాగంగా ఈ సంచలన ఆఫర్ అందుబాటులో ఉంటుంది. లాంచ్ సమయంలో వన్‌ప్లస్ 6 (64జీబి వేరియంట్) ధర రూ.34,999గా ఉంది. తాజా అనౌన్స్ చేసిన లిమిఐటెడ్ పిరియడ్ ధర తగ్గింపులో భాగంగా రూ.29,999కే అందుబాటులో ఉంటుంది.

శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో వన్‌ప్లస్ 6 ఒకటి..

శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో వన్‌ప్లస్ 6 ఒకటి..

వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తోన్న వారికి ఈ లేటెస్ట్ డీల్ ఓ హాట్ కేక్ లాంటిదనే చెపొచ్చు. 2018లో లాంచ్ అయిన అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లలో వన్‌ప్లస్ 6 ఒకటి. రూ.30,000 బడ్జెట్‌లో బెస్ట్ మొబిలిటీ డివైస్‌గా గుర్తింపుతెచ్చుకున్న వన్‌ప్లస్ 6లో టాప్‌లైన్ డిస్‌ప్లే, హై-క్వాలిటీ కెమెరా, ఫ్లాగ్‌షిప్ చిప్ సెట్, ప్రీమియమ్ స్థాయి డిజైన్ వంటి టాప్ క్వాలిటీ స్పెక్స్ ఉన్నాయి. ఈ ఫోన్ తాజాగా Android 9 Pie అప్‌డేట్‌ను కూడా అందుకోవటం విశేషం.

 

 

ధర తగ్గింపుతో పాటు అదనపు డిస్కౌంట్లు కూడా..

ధర తగ్గింపుతో పాటు అదనపు డిస్కౌంట్లు కూడా..

అమెజాన్ దీపావళి సేల్‌ను పురస్కరించుకుని వన్‌ప్లస్ ఈ విధంగా తన ఫ్లాగ్‌షిప్ డివైసెస్ పై ధర తగ్గించటం ఇదే మొదటిసారి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ 6 కొనుగోలు పై రూ.5000 ధర తగ్గింపులో అదనపు డిస్కౌంట్లను కూడా అమెజాన్ అందుబాటులో ఉంచింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియ్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి అదనంగా 10% ఇన్‌స్టెంట్ డిస్కౌంట్‌ అందుబాటులో ఉంటుందని అమెజాన్ తెలిపింది.

రూ.30,000 బడ్జెట్‌లో బెస్ట్ ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్..

రూ.30,000 బడ్జెట్‌లో బెస్ట్ ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్..

రూ.30,000 బడ్జెట్‌లో బెస్ట్ ప్రీమియమ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌గా వన్‌ప్లస్ 6 గుర్తింపుతెచ్చుకుంది. హైక్వాలిటీ మెటీరియల్స్‌తో అత్యంత ఆకర్షణీయంగా క్రాఫ్ట్ కాబడిన ఈ స్మార్ట్‌ఫోన్ మొదటి‌లుక్‌లోనే మనల్ని ఇంప్రస్ చేసేస్తుంది. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చసిన గ్లాస్ ప్యానల్ ప్రీమియమ్ ఇంకా అధునాతన లుక్‌ను ఆఫర్ చేస్తుంది. ఫోన్ ముందు ఇంకా వెనుక భాగాల్లో ఏర్పాటు చేసిన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ డివైస్ డ్యురబులిటీని మరింత రెట్టింపు చేసింది. వన్‌ప్లస్ 6లో అమర్చిన 6.28 అంగుళాల భారీ డిస్‌ప్లే టాప్-రేటెడ్ వ్యూవింగ్ యాంగిల్స్‌ను యూజర్‌కు చేరువచేస్తుంది.

 

 

ధర తక్కవ పనీతీరు ఎక్కువ...

ధర తక్కవ పనీతీరు ఎక్కువ...

ఇండియన్ మార్కెట్లో వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌ను మే 2018లో లాంచ్ చేసారు. ఈ ఫోన్‌కు సంబంధించిన 64జీబి స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.34,999గా లాంచ్ సమయంలో కంపెనీ ఫిక్స్ చేసింది. ఈ వేరియంట్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 చిప్‌సెట్‌తో పాటు 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి హై-గ్రేడ్ స్పెసిఫికేషన్‌లను వన్‌ప్లస్ పొందుపరిచింది. బెస్ట్ క్వాలిటీ స్పెసిఫికేషన్స్‌తో వస్తోన్న ఈ డివైస్‌లో మల్టిటాస్కింగ్ అదరహో అనిపిస్తుంది. స్టోరేజ్ పరంగానూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. ఇదే సమయంలో ఈ డివైస్‌లో బ్లోట్‌వేర్ సమస్యలు కూడా అంతగా లేవు. సబ్టిల్ కస్టమైజేషన్ ఫీచర్స్‌తో లోడై ఉన్న ఈ డివైస్‌లో యూజర్ ఇంటర్ ఫేస్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది.

 

 

బెస్ట్ క్వాలిటీ కెమెరా..

బెస్ట్ క్వాలిటీ కెమెరా..

వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసిన కెమెరా యూనిట్స్ సరికొత్త బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేసాయి. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన డ్యుయల్ లెన్స్ కెమెరా సెటప్ 16 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ కాంభినేషన్‌లో హైక్వాలిటీ ఫోటోగ్రఫీని ప్రొడ్యూస్ చేస్తుంది. ముఖ్యంగా నైట్ ఫోటోగ్రఫీకి ఈ కెమెరా బాగా ఉపయోగపడుతుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో ఉన్నాయి.

వన్‌ప్లస్ 6నే ఎందుకు కొనాలి..?

వన్‌ప్లస్ 6నే ఎందుకు కొనాలి..?

2018లో లాంచ్ అయిన అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో తన స్థానాన్ని పదలిపరుచుకున్న వన్‌ప్లస్ 6 అనేక రికార్డులను కైవసం చేసుకుంది. వన్‌ప్లస్ 6 లాంచ్‌తో క్యూ2, 2018కిగాను వేగంగా విస్తరించిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా వన్‌ప్లస్ గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇండియన్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి వన్‌ప్లస్ 6 లాంచ్ తరువాత 284 శాతం వృద్థిని వన్‌ప్లస్ నమోదు చేయగలిగింది. ఇదే సమయంలో వేగవంతంగా అమ్ముడుపోయిన స్మార్ట్‌ఫోన్‌గా కూడా అమెజాన్ గుర్తింపు తెచ్చుకుంది.

 

 

Best Mobiles in India

English summary
OnePlus 6 at a discounted price of INR 29,999 is the best smartphone deal of the year.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X