Home
Mobile

మే 17న మార్కెట్లోకి OnePlus 6, ఫీచర్లు, ధర మరిన్ని వివరాలు మీకోసం !

లాంచింగ్ తేదీకన్నా ముందు ప్రపంచ మొబైల్ మార్కెట్ ని లీకులతో షేక్ చేసిన OnePlus 6 స్మార్ట్‌ఫోన్ ఎట్టకేలకు మార్కెట్లోకి వచ్చే తేదీ ఫిక్స్ అయింది.

By Hazarath Aiah

లాంచింగ్ తేదీకన్నా ముందు ప్రపంచ మొబైల్ మార్కెట్ ని లీకులతో షేక్ చేసిన OnePlus 6 స్మార్ట్‌ఫోన్ ఎట్టకేలకు మార్కెట్లోకి వచ్చే తేదీ ఫిక్స్ అయింది. ఈ నెల 17 వ తేదీన ఇది మార్కెట్లోకి రానుందని OnePlus కంపెనీ స్పష్టం చేసింది. OnePlus 6 స్మార్ట్‌ఫోన్ స్పీడ్ తో పాటు కొన్ని అధునాతన ఫీచర్లతో రానుందని సోషల్ మీడియాలో ఈ మధ్య వార్తలు హల్ చల్ చేశాయి. డిజైన్, డిస్ ప్లే కెమెరా సెగ్మెంట్లలో ఈ ఫోన్ కొత్త బెంచ్ మార్క్ ను నమోదు చేయనుందని అంచనాలు ఇప్పటికే ఊపందుకున్నాయి. వినియోగదారులకు ఊహించని అనుభూతిని అందిచేందుకు త్వరలో దూసుకురానున్న ఈ ఫోన్ ఫీచర్లు , హార్డ్ వేర్, అంచనా ధర ఇలాంటి వివరాలపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

డిజైన్

డిజైన్

సీమ్ లెస్ మెటల్ బాడీతో పాటు వాటర్ డస్ట్ రెసిస్టివిటీతో oneplus 6 దూసుకురానుంది. కంపెనీ oneplus 6 ఫస్ట్ ఇమేజ్ ని ట్విట్టర్లో విడుదల చేసినప్పుడు 'More immersion in a refined form factor'తో ట్యాగ్ లైన్ ఇచ్చింది. అంటే అభిమానులు ఊహించని విధంగా ఈ ఫోన్ డిజైన్ ఉండబోతుందని ఆ ఇమేజ్ ని బట్టి ఇట్టే తెలిసిపోతుంది. సుతిమెత్తని ఫినిష్ తో పాటు రౌండెడ్ కార్నర్స్ , ఆకర్షణీయమైన కర్వ్స్ తో ఫోన్ రానుంది. గ్లాస్ బ్యాక్ ఆఫ్సన్ కూడా ఉండనుంది. డ్యూయెల్ రేర్ కెమెరాతో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5mm headphone jackలు అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. అలాగే అలర్ట్ స్లైడర్ అనే అధునాతన ఫీచర్ ని కూడా దీనిలో పొందుపరిచారు.

అలర్ట్ స్లైడర్

అలర్ట్ స్లైడర్

అలర్ట్ స్లైడర్ ద్వారా కెమెరా ఫోకస్ ను ఆటోమేటిగ్గా సెట్ చేసుకునే వీలుంది. అలర్ట్ స్లైడర్ ద్వారా అటు ఆడియో ప్రొఫైల్స్ అయిన రింగ్, అలాగే డూ నాట్ డిస్ట్రబ్, సైలెంట్ మోడ్స్ ను స్విచ్ చేసుకునేందుకు ఈ గెశ్చర్ ఉపయోగపడుతుంది. ఈ కొత్త గెశ్చర్ సహాయంతో కెమెరా ఫోకస్ కోసం టచ్ చేయాల్సిన పనిలేదు.అలాగే క్లిక్ మనిపించేందుకు స్క్రీన్ కూడా టచ్ చేయాల్సిన అవసరం లేదు. గత వర్షన్ లో అయితే పవర్ బటన్ నొక్కితే కెమెరా వచ్చేది. అలాగే వాల్యూమ్ బటన్ తో ఫోటోలు క్లిక్ చేసుకునే వీలుండేది. అయితే కొత్త గెశ్చర్ తో ఈ పని తప్పంది.

 Display

Display

వన్‌ప్లస్ 5టీతో పోలిస్తే ఈ ఫోన్ డిస్ ప్లే విభాగంలో యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించనుంది. అమోల్డ్ ప్యానల్ తో పాటు 6.ఇంచ్ edge-to-edge displayతో రానుంది. ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే నోచ్ ఫీచర్తో రానుంది. ఈ ఫీచర్ ద్వారా యూజ్లరు బెస్ట్ మల్టీమీడియా అనుభూతిని పొందుతారు. టీజర్ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. 6 సెకండ్ల వీడియోలో గెశ్చర్ తో మీ అనుభవాన్ని వేగం చేసుకోండి అని స్లోగన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. యూజర్లు ఈ display ద్వారా మంచి మల్టీమీడియా అనుభూతిని పొందనున్నారు. bezel-less designతో రానున్న ఈ ఫోన్లో reading, web browsing, gaming and video playback వంటి పనులు మీరు చాలా ఫాస్ట్‌గా చేయవచ్చు. ఎటువంటి అంతరాయం ఉండదు.

 కెమెరా

కెమెరా

కెమెరా విషయానికొస్తే vertical dual camer సెటప్ తో వస్తోంది. దీని ద్వారా మీరు అత్యంత తక్కువ వెలుతురులో కూడా నాణ్యమైన ఫోటోలను తీసుకునే అవకాశం ఉంది. Red colored alert slider అనే కొత్త ఫీచర్ ద్వారా మీరు మీ నోటిఫికేషన్లను వేగంగా తెలుసుకునే అవకాశం ఈ ఫోన్లో ఉంది. ఆడియో ఫైల్స్ కూడా చాలా త్వరగా ఓపెన్ అవుతాయి.దీంతో పాటు అలర్ట్ స్లైడర్ ద్వారా కెమెరా ఫోకస్ ను ఆటోమేటిగ్గా సెట్ చేసుకునే వీలుంది. అలర్ట్ స్లైడర్ ద్వారా అటు ఆడియో ప్రొఫైల్స్ అయిన రింగ్, అలాగే డూ నాట్ డిస్ట్రబ్, సైలెంట్ మోడ్స్ ను స్విచ్ చేసుకునేందుకు ఈ గెశ్చర్ ఉపయోగపడుతుంది.ఫ్యాషన్, ఫోర్టెయిట్ ఫోటోగ్రాఫర్ ErrikosAndreou వన్‌ప్లస్ 6 కెమెరాతో బాలీవుడ్ హీరోయిన్ ఆదితి రావు హైదరిని తీసిన ఫోటో ఇప్పుడు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

హార్డ్‌వేర్, సాప్ట్‌వేర్

హార్డ్‌వేర్, సాప్ట్‌వేర్

ఈ ఫోన్ హర్డ్‌వేర్‌ విభాగంలో బెస్ట్ ఫీచర్లతో మార్కెట్లోకి రానుంది. లేటెస్ట్ గా వచ్చిన Snapdragon 845 CPUతో పాటు 68 జిబి ర్యామ్ అలాగే 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ని పొందుపరిచారు. దీని ద్వారా ఫోన్ పనితీరు మరింత వేగవంతం అవుతుంది. యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించేందుకు వన్‌ప్లస్ 6 Android 8.1 Oreo ఆపరేటింగ్ సిస్టంని పొందుపరిచారు. అలాగే త్వరలో రానున్న కొత్త ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ పీకి అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. లేటెస్ట్ గూగుల్ ఆండ్రాయిడ్ సాప్ట్ వేర్ అయిన ఆక్సిజన్ ఓఎస్ మీద ఈ ఫోన్ వస్తోంది.

ధర

ధర

వన్‌ప్లస్ 6 ఫోన్ 2018 జూన్ 17న మార్కెట్లోకి రానుంది. అంచనాల ప్రకారం 8GB RAM and 256GB ROM ఫోన్ ధర రూ. 40 వేలుగా ఉండవచ్చని తెలుస్తోంది. మే 21వ తేదీనుంచి వన్ ప్లస్ ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్న వారు ఈ ఫోన్ ఆర్డర్ చేసే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది. అమెజాన్ ద్వారా ఈ ఫోన్ అమ్మకానికి రానుంది.
వన్‌ప్లస్ 6' ఫీచర్లు ( అంచనా )
6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఆండ్రాయిడ్ వి8.0 (ఓరియో) 1440 x 2560 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ క్వాల్‌కమ్ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 845 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ android 8.0 OREO 20, 16 మెగా పిక్సెల్స్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా 3500 ఎంఏహెచ్ బ్యాటరీ

Best Mobiles in India

English summary
OnePlus 6: Everything you need to know about the upcoming flagship smartphone More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X