వన్‌ప్లస్ 6 లీక్‌లు చెపుతున్న కొత్త ఫీచర్స్ ఇవే ...

Posted By: M KRISHNA ADITHYA

వన్‌ప్లస్ నుంచి వస్తున్న ఫ్లాగ్ షిప్ ఫోన్ వన్‌ప్లస్ 6 గురించి ఇప్పటికే పలు రూమర్లు మార్కెట్లో షికారు చేస్తుండగా, తాజాగా రిలీజ్ చేసిన కంపెనీ టీజర్ లో మరికొన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి. కొత్త టీజర్ లో వన్‌ప్లస్ 6 ఫోన్ ప్రత్యేకమైన అడ్వన్స్‌డ్ టచ్ గెశ్చర్ కంట్రోల్స్ ను కలిగి ఉన్నాయి. ఈ తరహా గెశ్చర్స్ కంట్రోల్స్ అండ్రాయిడ్ ఓరియో ఓపెన్ బీటా 3 అప్‌డేట్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ ఆండ్రాయిడ్ వెర్షన్ వన్ ప్లస్ 5T నుంచే అందుబాటులోకి వచ్చింది. వన్‌ప్లస్ విడుదల చేసిన ఈ టీజర్ ను ట్విట్టర్ లో విడుదల చేయగా, అందులో గెశ్చర్స్ తో మీ అనుభవాన్ని వేగవంతం చేసుకోండి అంటూ సంస్థ ట్వీట్ చేసింది. దీన్ని బట్టి పలు స్వైప్ యాక్షన్స్ ను మొబైల్ కలిగి ఉందని తెలుస్తోంది. అంటే వన్ ప్లస్ 6 టచ్ గెశ్చర్ సపోర్ట్ గా ఉందని తెలుస్తోంది. అయితే ఏ తరహా గెశ్చర్స్ ను వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ కలిగి ఉందో ఇంకా తేలాల్సి ఉంది.

వన్‌ప్లస్ 6 లీక్‌లు చెపుతున్న కొత్త ఫీచర్స్ ఇవే ...

కంపెనీకి చెందిన గత వర్షన్ వన్‌ప్లస్ 5 T లో ఓపెన్ బీటా అప్ డేట్స్ ను కలిగి ఉంది. దీన్ని బట్టి వన్‌ప్లస్ 6 కూడా ఐఫోన్ ఎక్స్ తరహాలోనే కనీసం మూడు టచ్ గెశ్చర్స్ కలిగి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ గెశ్చర్స్ సైతం బ్యాక్ టు హోమ్, సింపుల్ బ్యాక్ ఆప్షన్, అలాగే యాప్ ఓవర్ వ్యూ తెలుసుకునే గెశ్చర్ లాంటి ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవన్నీ మాత్రమే కాకుండా వన్‌ప్లస్ తమ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ద్వారా ఒక కొత్త తరహా స్టాటజీతో ముందుకు రానుంది. గెశ్చర్ సపోర్ట్ తో పాటు, ప్రస్తుతం ఉన్న ఫీచర్ల కన్నా కొత్త తరహా ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. ముఖ్యంగా అలర్ట్ స్లైడర్ గెశ్చర్ అనే కొత్త ఫీచర్ ఈ వన్ ప్లస్ 6 లో వీలున్నట్లు టెక్ ప్రేమికులు అంటున్నారు. కొత్త టీజర్ ని బట్టి చూస్తే మరికొన్ని అదనపు ఆకర్షణలు జోడించినట్లు కనిపిస్తోంది.

షియోమి గుడ్ న్యూస్, శాశ్వత ఓపెన్ సేల్‌ మీద Redmi 5

వన్‌ప్లస్ మరో వీడీయో టీజర్ ద్వారా ట్విట్టర్ లో చేసిన పోస్ట్ లో స్లైడ్ టు ఫోక్ విత్ ది అలర్ట్ స్లైడర్ అంటూ మరో లీక్ వదిలింది. టీజర్ ని బట్టి చూస్తే అలర్ట్ స్లైడర్ ద్వారా కెమెరా ఫోకస్ ను ఆటోమేటిగ్గా సెట్ చేసుకునే వీలుంది. అలర్ట్ స్లైడర్ ద్వారా అటు ఆడియో ప్రొఫైల్స్ అయిన రింగ్, అలాగే డూ నాట్ డిస్ట్రబ్, సైలెంట్ మోడ్స్ ను స్విచ్ చేసుకునేందుకు ఈ గెశ్చర్ ఉపయోగపడుతుంది.

ఈ కొత్త గెశ్చర్ సహాయంతో కెమెరా ఫోకస్ కోసం టచ్ చేయాల్సిన పనిలేదు. అలాగే క్లిక్ మనిపించేందుకు స్క్రీన్ కూడా టచ్ చేయాల్సిన అవసరం లేదు. గత వర్షన్ లో అయితే పవర్ బటన్ నొక్కితే కెమెరా వచ్చేది. అలాగే వాల్యూమ్ బటన్ తో ఫోటోలు క్లిక్ చేసుకునే వీలుండేది. అయితే కొత్త గెశ్చర్ తో ఈ పని తప్పంది.

English summary
OnePlus 6 to arrive with gesture controls; alert slider to get new function
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot