అసుస్ దెబ్బ, వన్‌ప్లస్ 6పై భారీ తగ్గింపు

చైనా మొబైల్ దిగ్గజం వన్‌ప్లస్‌ కంపెనీ తాజాగా లాంచ్‌ చేసిన తన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్‌ 6 డిస్కౌంట్‌ ధరలో అందుబాటులో ఉంది.

|

చైనా మొబైల్ దిగ్గజం వన్‌ప్లస్‌ కంపెనీ తాజాగా లాంచ్‌ చేసిన తన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్‌ 6 డిస్కౌంట్‌ ధరలో అందుబాటులో ఉంది. అమెజాన్‌ ఇండియా సైట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లాట్‌ 2000 రూపాయల డిస్కౌంట్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంది. వన్‌ప్లస్‌ నుంచి ఈ లేటెస్ట్‌ ఫ్లాగ్‌షిప్‌ను కొనుగోలు చేసిన వారికి వెంటనే ఈ డిస్కౌంట్‌ను ఇవ్వనున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది. జూలై 4 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఆఫర్‌, జూలై 15 వరకు అందుబాటులో ఉండనుంది. ​హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలకు ఈ డిస్కౌంట్‌ లభిస్తుంది.

 

64Mp క్వాలిటీతో 9 కెమెరాల స్మార్ట్‌ఫోన్, దిగ్గజాలకు దిమ్మతిరిగినట్టే !64Mp క్వాలిటీతో 9 కెమెరాల స్మార్ట్‌ఫోన్, దిగ్గజాలకు దిమ్మతిరిగినట్టే !

వన్‌ప్లస్‌ 6 స్పెషిఫికేషన్లు

వన్‌ప్లస్‌ 6 స్పెషిఫికేషన్లు

ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ఆధారిత ఆక్సీజెన్‌ఓఎస్‌ 5.1, డ్యూయల్‌-సిమ్‌(నానో), 6.28 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఫుల్‌ ఆప్టిక్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 84 శాతం స్క్రీన్‌ టూ బాడీ రేషియో, గొరిల్లా గ్లాస్‌ 5, క్వాల్‌కామ్‌ 845 ఎస్‌ఓసీ, 6జీబీ ర్యామ్‌ లేదా 8జీబీ ర్యామ్‌, 16 మెగాపిక్సెల్‌, 20 మెగాపిక్సెల్స్‌తో డ్యూయల్‌ రియర్‌ కెమెరా, 16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా, ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌(0.4 సెకన్లలో అన్‌లాక్‌), వెనుకవైపు ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, 64జీబీ, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్లు, 3300ఎంఏహెచ్‌ బ్యాటరీ

ఐడియా వినియోగదారులు

ఐడియా వినియోగదారులు

దీంతో పాటు ఐడియా వినియోగదారులు ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొంటే, మరో రెండు వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. అలాగే ఉచితంగా 12 నెలల పాటు యాక్సిడెంటల్‌ డ్యామేజ్‌ ఇన్సూరెన్స్‌ కూడా వర్తిస్తుంది.

జర్నీ ఆఫర్లు
 

జర్నీ ఆఫర్లు

జర్నీ ఆఫర్లు కూడా ఉన్నాయి. క్లియర్‌ట్రిప్‌ నుంచి విమానం, హోటల్‌ బుకింగ్స్‌ చేసుకునే వారికి వన్‌ప్లస్‌ కంపెనీ రూ.25 వేల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇలా పలు ప్రయోజనాలను వన్‌ప్లస్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు ఆ కంపెనీ ఆఫర్‌ చేస్తుంది.

రెండు వేరియంట్లు

రెండు వేరియంట్లు

వన్‌ప్లస్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్లు 6 జీబీ ర్యామ్‌/64 జీబీ స్టోరేజ్‌, 8 జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌లలో మార్కెట్‌లోకి వచ్చింది. 6 జీబీ ర్యామ్‌ ధర 34,999 రూపాయలు కాగ, 8 జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర 39,999 రూపాయలు. మిడ్‌నైట్‌ బ్లాక్‌, మిర్రర్‌ బ్లాక్‌, సిల్క్‌ వైట్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌లో ఈ ఫోన్‌ లభ్యమవుతుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఈఎంఐ ఆఫర్‌

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఈఎంఐ ఆఫర్‌

కాగా పైన పేర్కొన్న అన్ని వేరియంట్లకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఈఎంఐ ఆఫర్‌ మాత్రమే వాలిడ్‌లో ఉంది. ఈ ఆఫర్‌ కేవలం అమెజాన్‌ ఇండియా సైట్‌లో మాత్రమే ఉంది. వన్‌ప్లస్‌ స్టోర్‌లో ఈ ఆఫర్లు లేవు.

 Asus Zenfone 5Z

Asus Zenfone 5Z

అసుస్ నుంచి Asus Zenfone 5Z మార్కెట్లోకి వచ్చిన నేపథ్యంలో కంపెనీ ఈ రకమైన తగ్గింపును చేపట్టినట్లు తెలుస్తోంది. 6/8 జీబీ ర్యామ్ వేరియెంట్లలో ఈ ఫోన్ రూ.29,999, రూ.36,999 ధరలకు వినియోగదారులకు ఈ నెల 9వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా ఈ ఫోన్ లభ్యం కానుంది. ఫోన్ లాంచింగ్ సందర్భంగా పలు ఆఫర్లను కూడా అందిస్తున్నారు.

రూ.3వేల ఫ్లాట్ డిస్కౌంట్

రూ.3వేల ఫ్లాట్ డిస్కౌంట్

ఐసీఐసీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.3వేల ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తారు. అలాగే రూ.499 కే ఫ్లిప్‌కార్ట్ కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. 

రూ.3,333 నెలవారీ ఈఎంఐతో..

రూ.3,333 నెలవారీ ఈఎంఐతో..

రూ.3,333 నెలవారీ ఈఎంఐతో నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇక జియో ఈ ఫోన్‌పై రూ.2200 క్యాష్‌బ్యాక్ ఇస్తున్నది.

అసుస్ జెన్‌ఫోన్ 5జడ్ ఫీచర్లు

అసుస్ జెన్‌ఫోన్ 5జడ్ ఫీచర్లు

6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, 12, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Best Mobiles in India

English summary
OnePlus 6 gets 'discount' after Asus Zenfone 5Z launch More news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X