Home
Mobile

రివ్యూ రాయండి, వన్‌ప్లస్ 6 ఉచితంగా గెలుచుకోండి, కంపెనీ బంపరాఫర్

వన్‌ప్లస్‌ ప్రియులకి కంపెనీ ఓ మంచి శుభవార్తను మోసుకొచ్చింది. కంపెనీ నుంచి అతి త్వరలో దూసుకొస్తున్న వన్‌ప్లస్‌ 6ను ఉచితంగా గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

By Hazarath Aiah

వన్‌ప్లస్‌ ప్రియులకి కంపెనీ ఓ మంచి శుభవార్తను మోసుకొచ్చింది. కంపెనీ నుంచి అతి త్వరలో దూసుకొస్తున్న వన్‌ప్లస్‌ 6ను ఉచితంగా గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ఫోన్ ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది అలాగే దీని ధర ఫీచర్లను కంపెనీ ఇంకా ప్రకటించకపోయినప్పటికీ అది త్వరలో ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.కాగా ఈ ఫోన్ అమెజాన్లో exclusivelyగా అమ్మకానికి రానుంది. ఏప్రిల్ 22 నుంచి ఈ ఫోన్ అమెజాన్ ద్వారా యూజర్లు నోటిఫై ద్వారా రిజిస్టర్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఉచితంగా ఈ ఫోన్ ఎలా గెలుచుకోవాలో అనేదానిపై కంపెనీ అందించిన వివరాలను ఓ సారి పరిశీలిస్తే..

oneplus 6

వన్‌ప్లస్‌ వాడుతున్న వారుకాని లేక మరెవరైనా అభ్యర్థులు తాము వాడుతున్న వస్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌పై నిష్పక్షపాతంగా, నిజాయితీగా రివ్యూ రాయాల్సి ఉంటుంది.కంపెనీ ప్రకటించిన ల్యాబ్‌ ప్రోగ్రాంలో ఉత్తమ ఫీడ్‌ బ్యాక్‌ లేదా రివ్యూ అందించిన యూజర్లకు ఉచితంగా వన్‌ప్లస్‌ 6ను అందిస్తామని ఒక బ్లాగ్‌పోస్ట్‌లో ప్రకటించింది. ఈ పోటీలో ఎంపికయితే..ప్రపంచంలో వన్‌ప్లస్‌ 6ను అందుకునే తొలి వ్యక్తి మీరే అవుతారంటూ ది ల్యాబ్‌ వన్‌ప్లస్‌ 6 ఎడిషన్‌ అనే బ్లాగ్‌లో వెల్లడించింది.

గతంలో వన్‌ప్లస్‌ 5, వన్‌ప్లస్‌ 5టీ నిర్వహించినట్టుగా ఈ పోటీ నిర్వహిస్తున్నట్టు తలిపింది. ఎంట్రీలు పంపించేందుకు చివరి తేదీ మే 2. మే 12 న విజేతలను ప్రకటిస్తారు. రివ్యూలు ఇంగ్లీషులో మాత్రమే ఉండాలి. ఈ ల్యాబ్‌ ప్రోగ్రాం కోసం కేవలం 15మందిని ఎంపిక చేస్తారు. ఇతర నియమాలు, నిబంధనలు తదితర వివరాలు కోసం https://oneplus.typeform.com/to/W08XQ0 లింక్‌లో చూడవచ్చు. కాగా ఈ ఫోన్ కి సంబంధించిన టీజర్ ఇప్పటికే ట్విట్టర్లో దుమ్మురేపుతోంది.

Best Mobiles in India

English summary
OnePlus 6: Here’s how to get the phone before launch; register on Amazon India More News at Gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X