Home
Mobile

వన్‌ప్లస్ 6 ఇండియా ధర లీకైంది : 33,999 నుండి మొదలు..

అంచనాల ప్రకారం వన్ ప్లస్ 6 మే నెలలో విడుదల కానుంది, క్రితం సంవత్సరం విడుదలైన వన్ ప్లస్ 5 తో పోలిస్తే ఒక నెల ముందుగానే విడుదల కానున్నట్లు తెలుస్తుంది.

By Chaitanyakumar Ark

అంచనాల ప్రకారం వన్ ప్లస్ 6 మే నెలలో విడుదల కానుంది, క్రితం సంవత్సరం విడుదలైన వన్ ప్లస్ 5 తో పోలిస్తే ఒక నెల ముందుగానే విడుదల కానున్నట్లు తెలుస్తుంది. కానీ నవంబర్ నుండే రూమర్లు రావడం ప్రారంభమవ్వడం చూస్తుంటే వన్ ప్లస్ 6 మీద అంచనాలు భారీగానే ఉన్నట్లు అర్ధమవుతుంది. వారంరోజుల ముందు వచ్చిన నివేదికల ప్రకారం, వన్ ప్లస్ 6 ధర తో పాటు దాని స్టోరేజ్ వేరియంట్లు కూడా బయటకు వచ్చాయి. తద్వారా వన్ ప్లస్ 6, 3 స్టోరేజ్ వేరియంట్లతో రానుంది . True - Tech అనే వెబ్ సైట్ వన్ ప్లస్ 6 ధరను తెలియజేయడంతో పాటు స్టోరేజ్ వేరియంట్లను కూడా పొందుపరిచింది. ఈ వెబ్ సైట్ కు మంచి ట్రాక్ రికార్డ్ కూడా ఉంది.

oneplus 6

గతంలో వన్ ప్లస్ 5T విషయంలో కూడా ఈ వెబ్ సైట్ చెప్పిన ధర ప్రకారమే ఇండియా లో లాంచ్ అయింది. ఇప్పుడిచ్చిన రిపోర్ట్ ప్రకారం, వన్ ప్లస్ 6, 3 వేరియంట్లతో రానుంది. మొదటిది 6జి‌బి రామ్ , 64జి‌బి అంతర్గత మెమరీ ని కలిగి ఉంటుంది . ఇది 33,999 నుండి 36,999 వరకు ఉండవచ్చు. రెండవది 6జి‌బి రామ్ తో, 128 జి‌బి అంతర్గత మెమరీని కలిగి ఉండి , 38,999 నుండి 42,999 వరకు ధరను కలిగి ఉండవచ్చు. ఇక మూడవది 8జి‌బి రామ్ తో 256 జి‌బి అంతర్గత మెమరీ తో 44,999 నుండి 48,999 మద్యలో ఉండనుంది.

అంచనా ధర , స్టోరేజ్ వేరియంట్లతో పాటు , ఈ రిపోర్ట్ ద్వారా మరికొన్ని విషయాలు కూడా తెలుస్తున్నాయి. వన్ ప్లస్ 6 తో పాటు, వన్ ప్లస్ బుల్లెట్ wireless హెడ్ఫోన్స్ కూడా విడుదల చేయనుంది. ఈ హెడ్ఫోన్స్ ఈమద్యనే బ్లూటూత్ సర్టిఫికేషన్ కూడా పాస్ అయింది.

ఈ రిపోర్ట్ ఇమేజ్ లో కూడా చూపబడినది. ఒకసారి చూడండి. ఈ ఇమేజ్ ప్రకారం, ఈ వన్ ప్లస్ 6 మొబైల్, A6003 మోడల్ నంబర్ ను కలిగి ఉంటుంది. మరియు ఇచ్చిన ధరల వివరాలను బట్టి చూస్తే మార్చి 29 నాటికి ధరల పరమైన నిర్ణయం ఇంకా పెండింగ్ లో ఉన్నట్లుగా ఉంది.

వన్ ప్లస్ అధికారిక టీజర్స్ దృష్ట్యా, వన్ ప్లస్ 6 gesture controls సపోర్ట్ తో, మరియు Alert Slider ఫీచర్ తో రానున్నదని తెలుస్తూ ఉంది. తద్వారా స్క్రీన్ ను టచ్ చేయకుండా కెమరా ఫోకస్ సెట్ చేసుకునే వెసులుబాటు కల్పించబడినట్లుగా అర్ధమవుతూ ఉంది. మరియు ఈ మద్యనే లీక్ అయిన వన్ ప్లస్ 6 ఇమేజ్ దృష్ట్యా ఇందులో snapdragon 845 SOC ప్రాసెసర్ తో రానుందని తెలుస్తుంది.

ఇక స్పెసిఫికేషన్స్ పరoగా చూస్తే, అంచనాల ప్రకారం oneplus 6 , 6.28 inch ఫుల్ HD మరియు అమోలెడ్ డిస్ప్లే తో 2280 x 1080 పిక్సెల్ రిసొల్యూషన్ కలిగి ఉంటుంది. లేటెస్ట్ android 8.0 OREO తో రానుంది. డ్యూయల్ కెమరా సెటప్ తో రేర్ 16mp మరియు 20mp కలిగి ఉండి , 3450 mah బాటరీ నిక్షిప్తమై డాషింగ్ చార్జ్ ఫీచర్ తో రానున్నదని సమాచారం.

Best Mobiles in India

English summary
OnePlus 6 India pricing leaked; to cost Rs. 33,999 onwards More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X