రేపు ఇండియాకి రానున్న OnePlus 6, లాంచ్ ఆఫర్లు ఇవే

|

అభిమానులు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న OnePlus 6 ఎట్టకేలకు రేపు ఇండియాలో అడుగుపెట్టనుంది. రేపు ముంబైలో అట్టహాసంగా జరిగే వేడుకలో కంపెనీ ఈ ఫోన్ ని లాంచ్ చేయనుంది. కొద్ది రోజుల నుంచి రోజుకొక లీకుతో ఈ ఫోన్ సోషల్ మీడియాలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కెమెరా విషయంలో ఈ ఫోన్ అనేక అంచనాలను రేకెత్తించింది. ఈ లైవ్ ని ప్రత్యక్షంగా వీక్షించే అభిమానుల కోసం కంపెనీ తన అఫిషియల్ పేజీలో లింక్ ను ఉంచింది. నేరుగా ఈవెంట్ చూడలేని వారు ఈ లింక్ ద్వారా లైవ్ ఈవెంట్ ని చూడవచ్చు. కాగా ఈఫోన్ స్పెషిఫికేషన్లు ఏంటనేది ఇంతవరకు ఎవరికీ సరిగా తెలియదు. కంపెనీ గోప్యంగా ఉంచింది. రేపు ఈ ఫోన్ కి సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

 

అమెజాన్‌లో వన్‌ప్లస్ 6 ఫస్ట్ అండ్ ఫాస్ట్ సేల్ స్టార్ట్ అయింది

లాంచ్ ఆఫర్స్

లాంచ్ ఆఫర్స్

అమెజాన్ ఇండియా ద్వారా అమ్మకానికి రానున్న ఈ ఫోన్ పై కంపెనీ కొన్ని లాంచ్ ఆఫర్లను ప్రకటించింది. discounts, cashback, Zero cost EMIs, and warranty offers ఇలా అన్ని రకాల ఆఫర్లను అందిస్తోంది. ఆసక్తి ఉన్న యూజర్లు అమెజాన్ ప్రైమ్ గిప్ట్ కార్డు, Kindle డిస్కౌంట్స్ గెలుచుకునే అవకాశం ఉంది. SBI Credit and Debit cards యూజర్లు రూ.2 వేల డిస్కౌంట్ ని ఫస్ట్ వీక్ సేల్ లో పొందే అవకాశం ఉంది. అలాగే ఫస్ట్ 3 నెలల వరకు నో కాస్ట్ ఈఎమ్ఐ ఆప్సన్ కూడా ఇచ్చింది. Servify ద్వారా 12 నెలలు యాక్సిడెంటల్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ కూడా ఇచ్చింది. దీంతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రైబర్స్ రూ.250 విలువ గల గిఫ్ట్ కార్డ్ అలాగే Kindle users రూ.500 డిస్కౌంట్ అందుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. దీంతో పాటు రూ.25 వేల వరకు ట్రావెలింగ్ బెనిఫిట్లు పొందనున్నారు. ఇందులో క్లియర్ ట్రిప్ నుండి ఫ్లైట్, హోటల్ బుకింగ్స్ లాంటివి చేసుకోవచ్చు.

First-of-its-kind Fast AF sale
 

First-of-its-kind Fast AF sale

అమెజాన్ ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే ఆసక్తి ఉన్న యూజర్ల కోసం Fast AF' sale ఆఫర్లని కూడా ప్రవేశపెట్టింది. అలాగే కొన్ని రకాల బెనిఫిట్లను కూడా అందిచనుంది.రూ. 1000 విలువ గల Amazon.in e-Gift Card అందిచనుంది. దీన్ని ఉపయోగించి కొనుగోలుదారులు 21 and 22 May 2018 నాడు ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీంతో పాటు అమెజాన్ పే బ్యాలన్స్ నుండి కొనుగోలు చేసే యూజర్లకు వన్ ప్లస్ కంపెనీ రూ.1000 క్యాష్ బ్యాక్ అందిచనుంది. గిఫ్ట్ కార్డు హోల్డర్స్ ఇలా రూ.2 వేల వరకు ప్రయోజనాలు పొందవచ్చు.

More joy for OnePlus 6 buyers

More joy for OnePlus 6 buyers

అలాగే పోన్ సేప్టీ మీద కూడా కంపెనీ కొన్ని రకాల ఆఫర్లను ప్రకటిస్తోంది. 3 నెలల పాటు తయారీదారు వారంటీ అలాగే సంవత్సరం వరకు వారంటీని కంపెనీ ఇవ్వనుంది. మరో 12 నెలల పాటు ఉచితంగా యాక్సిడెంటల్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ అందించనుంది. మొత్తం 15 నెలల పాటు కంపెనీ ద్వారా తయారీదారు వారంటీని అందుకోవచ్చు.

Exclusive camera samples before the launch day

Exclusive camera samples before the launch day

కాగా వన్‌ప్లస్ సీఈఓ Pete Lau వన్‌ప్లస్ 6 కెమెరా నుంచి తీసుకొన్న కొన్ని ఫోటోలను అధికారికంగా విడుదల చేశారు. ఈ ఫోటోలు మంచి క్వాలిటీతో పాటు ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా కనిపిస్తున్నాయి. మీరు చూస్తన్న ఫోటో కూడా అలాంటి కోవలోకే వస్తుంది. లో లైట్ అలాగే ప్రకాశవంతమైన వెలుతురులో ఫోటోలు తీసినప్పుడు అందుకు తగ్గట్లుగానే రంగులను ఈ కెమెరా తీసుకుని నాణ్యమైన ఫోటోలను అందిస్తోంది.

 Vogue May Cover shot on OnePlus 6

Vogue May Cover shot on OnePlus 6

Vogue magazineలో తొలిసారిగా వన్‌ప్లస్ నుంచి తీసిన ఫోటో పబ్లిష్ అయింది. Ace photographer ErrikosAndreou బాలీవుడ్ హీరోయిన్ల మీద ఫోటో షూట్ నిర్వహిస్తున్న సమయంలో వన్ ప్లస్ 6 కెమెరా నుంచి ఆదితి రావు ఫోటోను తీసారు. ఆ ఫోటో క్వాలిటీని చూసి మెచ్చుకున్న Vogue magazine కవర్ పేజీలో ఆ ఫోటోను ప్రచురించింది. ఆ ఫోటో చాలా సాధారణ లుకింగ్ తో ఉందని కెమెరా పనితీరు అద్భుతమని కూడా తెలిపింది.

OnePlus 6 x Marvel Avengers Special Edition

OnePlus 6 x Marvel Avengers Special Edition

మార్వెల్ అభిమానుల కోసం వన్‌ప్లస్ కంపెనీ Marvel Avengers Limited Edition OnePlus 6ని కూడా లాంచ్ చేస్తోంది. టీజర్ వీడియోలో OnePlus 6లో స్పెషల్ ఎడిషన్ ను తీసుకురాబోతున్నట్లు తెలిపింది. కాగా కంపెనీ ఇప్పటికే OnePlus 5లో OnePlus 5T Star Wars editionను గతేడాది ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

OnePlus 6 ఫీచర్లు

OnePlus 6 ఫీచర్లు

కాగా ఈ ఫోన్ శక్తివంతమైన క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ తో వస్తోంది. అలాగే 8జిబి ర్యామ్ తో పాటు 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ని పొందుపరిచారు. అధికారికంగా కంపెనీ కొన్ని రకాల లీకులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఫోన్ 6GB/64GB, 6GB/128GB, 8GB/128GB వేరియంట్లలో రానున్నట్లు తెలుస్తోంది. అలాగే వాటర్ డస్ట్ రెసిస్టెంట్ , మెటల్ గ్లాస్ డిజైన్ , 6-inch edge-to-edge FHD+ screen లాంటి ఫీచర్లతో రానుంది. కాగా ఈ ఫోన్ ధర ఎంత ఉంటుందనేది కంపెనీ ఇంకా ప్రకటించలేదు. రేపు అధికారికంగా తెలిసే అవకాశం ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
OnePlus 6 will launch on May 17, 2018. Check out the launch offers, OnePlus 6 features and everything we know so far More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more