256 జిబి స్టోరేజ్ కెపాసిటితో కొత్త స్మార్ట్‌ఫోన్‌,ధర ఫీచర్ల వివరాలు

|

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వన్‌ప్లస్ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్‌ 6ను ఎట్టకేలకు ఇండియా మార్కెట్లో విడుదల చేసింది. వన్‌ప్లస్‌ 6 తోపాటు వన్‌ప్లస్‌ 6 మార్వెల్‌ అవెంజర్స్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ వేరియంట్‌ను కూడా కంపెనీ ఆవిష్కరించింది. వన్‌ప్లస్‌ 6 అచ్చం ఐఫోన్‌ ఎక్స్‌ మాదిరి నాచ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. అంతా గ్లాస్‌తో వచ్చిన తొలి వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ కూడా ఇదే కావడం విశేషం. ఈ లాంచ్‌ ఈవెంట్‌లోనే కంపెనీ ఐదు కొత్త వన్‌ప్లస్‌ ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్లను, 10 కొత్త సర్వీసు సెంటర్లను కూడా ప్రకటించింది.

ఈ స్మార్ట్‌ఫోన్లపై రూ.11 వేల నుంచి రూ.6 వేల దాకా తగ్గింపు,డీల్ వివరాలు ఇవే

వన్‌ప్లస్ 6 స్పెసిఫికేష‌న్లు
 

వన్‌ప్లస్ 6 స్పెసిఫికేష‌న్లు

6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే, 2280 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 64/128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 16, 20 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, వాట‌ర్ రెసిస్టెన్స్ బాడీ, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, డ్యాష్ చార్జ్‌.

ధర

ధర

వన్‌ప్లస్‌ 6 ప్రస్తుతం రెండు స్టోరేజ్‌ వేరియంట్లలో భారత మార్కెట్‌లోకి వస్తోంది. 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.34,999 కాగ, 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 39,999 రూపాయలు. 256జీబీ వేరియంట్‌ భారత్‌కు రావడం లేదు.

మార్వెల్‌ అవెంజర్స్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌

మార్వెల్‌ అవెంజర్స్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌

మూడు రంగులు మిడ్‌నైట్‌ బ్లాక్‌, మిర్రర్‌ బ్లాక్‌, సిల్క్‌ వైట్‌ లిమిటెడ్‌ ఎడిషన్లలో ఈ ఫోన్‌ లభ్యమవుతోంది. వన్‌ప్లస్‌ 6 మార్వెల్‌ అవెంజర్స్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ ధర రూ.44,999గా కంపెనీ నిర్ణయించింది. మార్వెల్‌ అవెంజర్స్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ను అమెజాన్‌లో మే 29 నుంచి ఓపెన్‌ సేల్‌కు ఉంచనుంది.

అమెజాన్ ప్రైమ్ యూజర్స్‌కు
 

అమెజాన్ ప్రైమ్ యూజర్స్‌కు

అమెజాన్ ప్రైమ్ యూజర్స్‌కు మే 21న ప్రిబుకింగ్స్ మొదలు కానుండగా.. మే 22 నుంచి ఓపెన్ సేల్ మొదలవుతుంది. మే 21న తొలుత అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్ల కోసం అందుబాటులో ఉంచనున్నారు. అనంతరం ఓపెన్‌ సేల్‌కు రానుంది. వన్‌ప్లస్‌ స్టోర్‌ ద్వారా ఈ ఫోన్‌ లభ్యమవనుంది. లాంచ్ అయిన తొలి వారంలో ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా రూ.2 వేలు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

మూడేళ్ల కిందట ఇండియాలోకి ..

మూడేళ్ల కిందట ఇండియాలోకి ..

మూడేళ్ల కిందట ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ వన్ ప్లస్ బ్రాండ్ ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్లలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇక వన్‌ప్లస్‌కు ప్రత్యేకంగా ఆక్సిజన్‌ఓఎస్ అనే ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ ఉంది. ప్రస్తుతం వేగవంతమైన ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో ఇదీ ఒకటి.

Most Read Articles
Best Mobiles in India

English summary
OnePlus 6 launched in India: Check out price, features and specifications More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X