చైనా దిగ్గజం ఒప్పో ఈ మధ్య oppo R15ని చైనాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఊపులో కొత్త ఫోన్ ని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. వన్ ప్లస్ మోడల్స్ లో రానున్న ఈఫోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని లీకయిన రిపోర్టులను బట్టి తెలుస్తోంది. కాగా Oppo R15, Oppo R15 Dream Mirror Editionలు చైనాలో లాంచ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే OnePlus 5T, Oppo R11sలు మార్కెట్లో సత్తా చాటుతున్న నేపథ్యంలో కంపెనీ ఇంకా అధునాతన ఫీచర్లతో OnePlus 6ని తీసుకురానున్నట్లు సమాచారం.
దీని మీద ఇప్పటికే గ్రౌండ్ వర్క్ జరుగుతుందని తెలుస్తోంది. కాగా ఈ ఫోన్లో display fingerprint sensor ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ ఫీచర్ వన్ ప్లస్ 5టీలో ప్రవేశపెట్టాలని చూసినప్పటికీ అది సాధ్యం కాకపోవడంతో OnePlus 6లో ఈ ఫీచర్ ని ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. రానున్న ఈ ఫోన్ అచ్చం ఐఫోన్ Xని పోలి ఉంటుందని 19.9 డిస్ ప్లే నాచ్‌తో రానుందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. కాగా ఈ ఫోన్ Oppo R15లో ఉన్న ఫీచర్లతోనే మార్కెట్లోకి రానుందని తెలుస్తోంది.
6.28-inch OLED full-HD+ (1080x2280) display with 19:9 aspect ratioతో Oppo R15 వచ్చిన సంగతి తెలిసిందే. OnePlus 6లో Snapdragon 845 SoCతో రానున్నట్లు సమాచారం. కాగా ఈ ఫోన్ కి సంబంధించి కొద్ది వివరాలు మాత్రమే లీకయ్యాయి. వచ్చ ఏడాది మార్కెట్లోకి రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
సిగ్గుమాలిన చైనా, వాట్సప్ ద్వారా ఇండియాపై హ్యాకింగ్ దాడి, +86తో జాగ్రత్త
Oppo R15 ధర ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి.
ధర రూ.30,800 ఇండియాలో అంచనా
ఐఫోన్ 10 తరహాలో డిస్‌ప్లే పై భాగంలో నాచ్, వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ప్రధాన ఆకర్షణ
ఒప్పో ఆర్15 ఫీచర్లు
6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3450 ఎంఏహెచ్ బ్యాటరీ, వీవోవోసీ ఫ్లాష్ చార్జింగ్.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.