Home
Mobile

256జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో OnePlus 6, జూలై 10 నుంచి మార్కెట్లో..

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus), తన లేటెస్ట్ వెర్షన్ స్మార్ట్‌ఫోన్ అయిన వన్‌ప్లస్ 6ను కొద్ది నెలల క్రితమే ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది.

By Bommu Sivanjaneyulu

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus), తన లేటెస్ట్ వెర్షన్ స్మార్ట్‌ఫోన్ అయిన వన్‌ప్లస్ 6ను కొద్ది నెలల క్రితమే ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతానికి ఈ ఫోన్ రెండు వేరియంట్‌లలో మాత్రమే ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతోంది. వాటిలో మొదటి వేరియంట్ వచ్చేసరికి 6జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభ్యమవుతోంది. దీని ధర రూ.34,999. రెండవ వేరియంట్ వచ్చేసరికి 8జీబి ర్యామ్ + 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభ్యమవుతోంది. ధర రూ.39,999.

oneplus 6

హాట్ కేకుల్లా కొనేస్తున్నారు..
వీటితో పాటు OnePlus 6 Marvel Avengers పేరుతో లిమిటెడ్ ఎడిషన్ ఫోన్‌ను కూడా సంస్థ అందుబాటులో ఉంచింది. 8జీబి ర్యామ్ + 256జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌ సౌకర్యంతో లాంచ్ అయిన ఈ డివైస్‌ను యూజర్లు హాట్ కేకుల్లా కొనుగోలు చేయటంతో ఒక్కసారిగా స్టాక్ మొత్తం అయిపోయింది.

మిడ్‌నైట్ బ్లాక్ కలర్ వేరియంట్‌లో..
ఈ వేరియంట్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మిడ్‌నైట్ బ్లాక్ కలర్ వేరియంట్‌లో 8జీబి ర్యామ్ + 256జీబి వేరియంట్‌ను వన్‌ప్లస్ భారత్‌లోకి తీసుకురాబోతోంది. జూలై 10 నుంచి ఈ వేరియంట్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ధర రూ.43,999. అమెజాన్.ఇన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యమవుతుంది. ఆఫ్ లైన్ స్టోర్ లలో ఈ వేరియంట్ ను కొనుగోలు చేయాలనుకునే వారు జూలై 14 వరకు వేచి చూడకు తప్పదు.

వన్ ప్లస్ 6 స్పెసిఫికేషన్స్..
డ్యుయల్ నానో సిమ్ సపోర్ట్, ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 8.1 ఓరియో సపోర్ట్, 6.28 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ (1080x 2280 పిక్సల్స్) ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే విత్ 19:9 యాస్పెక్ట్ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి, 256జీబి), 16 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ సోనీ ఐఎమ్ఎక్స్371 సెన్సార్, 3300ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

Best Mobiles in India

English summary
OnePlus 6 was launched in India back in May this year along with the OnePlus 6 Marvel Avengers Limited Edition, which was the only variant to sport 8GB of RAM and 256GB of inbuilt storage. However, the stock was limited and the model was taken off shelves within days of launch.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X