Home
Mobile

టెన్సన్ రేకెత్తిస్తున్న వన్‌ప్లస్ 6 టీజర్, ప్రతి ఫీచర్ ఓ హైలెట్..

చైనా దిగ్గజం వన్‌ప్లస్ కంపెనీ నుంచి రాబోతున్న వన్‌ప్లస్ 6 మీద అభిమానుల్లో అనేక అంచనాలు నెలకొని ఉన్నాయి.

By Hazarath Aiah

చైనా దిగ్గజం వన్‌ప్లస్ కంపెనీ నుంచి రాబోతున్న వన్‌ప్లస్ 6 మీద అభిమానుల్లో అనేక అంచనాలు నెలకొని ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం కంపెనీ నుంచి వచ్చిన ఈ ఫోన్ టీజర్ నే. ఈ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. స్పీడ్ అలాగే పెర్ఫారెమెన్స్ లో ఈ ఫోన్ అద్భుతంగా ఉండే అవకాశం ఉందని టీజర్ ని బట్టి తెలుస్తోంది. కాగా ఈఫోన్ అతి త్వరలో వినియోగదారుల ముందుకు రానుంది. ఇప్పటి మార్కెట్లో ట్రెండ్ సెట్ చేసేదానికి రెడీ అన్నట్లుగా ఈ ఫోన్ ఫీచర్లు, డిజైన్ టీజర్లో అదరగొడుతున్నాయి. మొత్తానికి అభిమానులకు మంచి అనుభూతిని కలిగించే అనేక రకాలైన ఫీచర్లతో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది. అత్యంత తక్కువ ధరలోనే ఈ ఫోన్ వినియోగదారుల చెంతకు రానుందని తెలుస్తోంది.

అనేక రకాలైన ఆకట్టుకునే అంశాలు

అనేక రకాలైన ఆకట్టుకునే అంశాలు

వన్‌ప్లస్ కంపెనీ అధికారిక సమాచారం ప్రకారం రానున్న వన్‌ప్లస్ 6 స్మార్ట్ ఫోన్లో సరికొత్త ఫీచర్లతో పాటు అనేక రకాలైన ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. ఈ ఫోన్ speed and performance విభాగంలో ఇతర ఫోన్లను సవాల్ చేస్తుందని కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. దీనికి అనేక ఆసక్తికర కారణాలను కంపెనీ చెబుతోంది.

డిజైన్

వన్‌ప్లస్ కంపెనీ తన అధికారిక ట్విట్టర్లో ట్వీట్ చేసిన వివరాల ప్రకారం మునుపెన్నడూ లేని అధునాతన డిజైన్ తో ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్‌ కంపెనీ విడుదల చేసిన టీజర్‌లో చూపినట్లుగానే ఈ స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్‌ ఎక్స్‌ మాదిరి నాచ్‌ డిస్‌ప్లే డిజైన్‌తో మార్కెట్‌లోకి విడుదల కానుంది. ఇందులో ప్రధానంగా 3.5mm headphone jack యూజర్లను విపరీతంగా ఆకట్టుకోనుందని తెలుస్తోంది. యూజర్ల చేతిల్లో ఈ ఫోన్ సరికొత్త లుక్ తో దర్శనమిస్తుందని కంపెనీ ధీమాను వ్యక్తం చేస్తోంది.

అలర్ట్ స్లైడర్

వన్‌ప్లస్ మరో వీడీయో టీజర్ ద్వారా ట్విట్టర్ లో చేసిన పోస్ట్ లో స్లైడ్ టు ఫోక్ విత్ ది అలర్ట్ స్లైడర్ అంటూ మరో లీక్ వదిలింది. టీజర్ ని బట్టి చూస్తే అలర్ట్ స్లైడర్ ద్వారా కెమెరా ఫోకస్ ను ఆటోమేటిగ్గా సెట్ చేసుకునే వీలుంది. అలర్ట్ స్లైడర్ ద్వారా అటు ఆడియో ప్రొఫైల్స్ అయిన రింగ్, అలాగే డూ నాట్ డిస్ట్రబ్, సైలెంట్ మోడ్స్ ను స్విచ్ చేసుకునేందుకు ఈ గెశ్చర్ ఉపయోగపడుతుంది.

New Gesture support

ఈ కొత్త గెశ్చర్ సహాయంతో కెమెరా ఫోకస్ కోసం టచ్ చేయాల్సిన పనిలేదు. అలాగే క్లిక్ మనిపించేందుకు స్క్రీన్ కూడా టచ్ చేయాల్సిన అవసరం లేదు. గత వర్షన్ లో అయితే పవర్ బటన్ నొక్కితే కెమెరా వచ్చేది. అలాగే వాల్యూమ్ బటన్ తో ఫోటోలు క్లిక్ చేసుకునే వీలుండేది. అయితే కొత్త గెశ్చర్ తో ఈ పని తప్పంది. ఐఫోన్ ఎక్స్ తరహాలోనే కనీసం మూడు టచ్ గెశ్చర్స్ కలిగి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ గెశ్చర్స్ సైతం బ్యాక్ టు హోమ్, సింపుల్ బ్యాక్ ఆప్షన్, అలాగే యాప్ ఓవర్ వ్యూ తెలుసుకునే గెశ్చర్ లాంటి ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

పెద్ద స్క్రీన్

వీడీయో టీజర్ ప్రకారం ఈ ఫోన్ మంచి అనుభూతిని అందించే డిస్ ప్లే రానున్నట్లు తెలుస్తోంది. యూజర్లకు ఈ పోన్లో వ్యూయింగ్ సరికొత్తగా కనిపించేలా నాచ్ డిజైన్ ని పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. ఈ ఫీచర్ డిస్ ప్లే పై భాగంలో ఆకర్షణీయంగా కనిపించి అత్యంత తక్కువ స్పేస్ తీసుకునే విధంగా ఉంటుందని తెలుస్తోంది.

వాటర్ రెసిస్టెంట్

వాటర్‌ రెసిస్టెన్స్‌ ఫిచర్‌ వన్‌ప్లస్‌ 6లో కీలక ఫీచర్‌గా ఉండనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే వన్ ప్లస్ కంపెనీ ప్రకటించింది. ఇప్పటివరకూ విడుదలైన అన్ని ఒన్‌ప్లస్‌ ఫోన్ల కంటే ‘వన్‌ప్లస్‌ 6'లో డేటా వేగం అత్యధికంగా ఉండే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Unmatched Speed and Efficiency

హార్డ్ వేర్, సాప్ట్ వేర్ విభాగాల్లో ఈ ఫోన్ మంచి పనితీరును కనబరిచే అవకాశం ఉంది. Snapdragon 845 SoCతో పాటు 6GB/8GB RAM వేరియంట్లలో ఈ ఫోన్ రానుంది. స్టోరేజ్ విషయానికొస్తే 128GB and 256GB modelsలో లభ్యం కానుంది. 64జీబీ బేస్‌ వేరియంట్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర 34వేల రూపాయలుగానూ, 128 జీబీ టాప్‌ స్మార్ట్‌ఫోన్‌ వేరియంట్‌ ధర 39వేల రూపాయలుగా ఉండొచ్చని అంచనా.

స్పెసిఫికేషన్స్ పరoగా చూస్తే,

అంచనాల ప్రకారం oneplus 6 , 6.28 inch ఫుల్ HD మరియు అమోలెడ్ డిస్ప్లే తో 2280 x 1080 పిక్సెల్ రిసొల్యూషన్ కలిగి ఉంటుంది. లేటెస్ట్ android 8.0 OREO తో రానుంది. డ్యూయల్ కెమరా సెటప్ తో రేర్ 16mp మరియు 20mp కలిగి ఉండి , 3450 mah బాటరీ నిక్షిప్తమై డాషింగ్ చార్జ్ ఫీచర్ తో రానున్నదని సమాచారం. అలాగే కెమెరా ఫీచర్లు కూడా యూజర్లను ఓ సరికొత్త ప్రపంచానికి తీసుకువెళతాయి.

వన్‌ప్లస్‌ 6 స్పెషిఫికేషన్లపై అంచనా

6.28 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీప్లస్‌ డిస్‌ప్లే
19:9 ఆస్పెక్ట్‌ రెషియో
845 సాన్‌డ్రాగన్‌ అక్టాకోర్‌ చిప్‌ సెట్‌
6జీబీ ర్యామ్‌
64జీబీ, 128జీబీ స్టోరేజ్‌ ఆప్షన్లు
వెనుకవైపు 16+20 మెగాపిక్సెల్‌ డ్యూయల్‌ సెన్సార్లు
ముందు వైపు 20 మెగాపిక్సెల్‌ కెమెరా
3450 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Best Mobiles in India

English summary
OnePlus 6 new teaser video gets us pumped for their new flagship smartphone more news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X