Home
Mobile

OnePlus 6 మీద భారీ అంచనాలు,గ్రాండ్ వెల్‌కం చెప్పిన టెక్ దిగ్గజాలు

కొద్ది నెలల నుంచి రూమర్లతో సంచలనం రేకెత్తించిన వన్‌ప్లస్ 6 ఎట్టకేలకు మార్కెట్లోకి విడుదలయింది.

By Hazarath Aiah

కొద్ది నెలల నుంచి రూమర్లతో సంచలనం రేకెత్తించిన వన్‌ప్లస్ 6 ఎట్టకేలకు మార్కెట్లోకి విడుదలయింది. ఇండియా మార్కెట్లో విడుదలయిన ఈ ఫోన్ ఓ మార్కెట్లోని మిగతా కంపెనీ ఫోన్లకు గట్టి సవాల్ విసురుతుందని తెలుస్తోంది. కంపెనీ 6GB+64GB వేరియంట్ ధరను రూ. 34,999గా నిర్ణయించింది. వన్‌ప్లస్‌ 6 తోపాటు వన్‌ప్లస్‌ 6 మార్వెల్‌ అవెంజర్స్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ వేరియంట్‌ను కూడా కంపెనీ ఆవిష్కరించింది. వన్‌ప్లస్‌ 6 అచ్చం ఐఫోన్‌ ఎక్స్‌ మాదిరి నాచ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. అంతా గ్లాస్‌తో వచ్చిన తొలి వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ కూడా ఇదే కావడం విశేషం. ఈ లాంచ్‌ ఈవెంట్‌లోనే కంపెనీ ఐదు కొత్త వన్‌ప్లస్‌ ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్లను, 10 కొత్త సర్వీసు సెంటర్లను కూడా ప్రకటించింది.దీనిపై టెక్ దిగ్గజాల స్పందన ఏంటో ఓ సారి చూద్దాం.

మార్వెల్

మార్వెల్

ఈ టెక్ దిగ్గజం వన్‌ప్లస్ 6 మార్కెట్లో ఓ కొత్త ఒరవడికి నాంది పలికిందంటూ ఆకాశానికి ఎత్తేసింది. కెమెరాపరంగా లుక్స్ పరంగా వన్‌ప్లస్ 6 ఉన్నతంగా ఉందని మార్కెట్లో మిగతా ఫోన్లకు ఖచ్చితంగా సవాల్ విసురుతుందని తెలిపింది. కాగా మార్వెల్ అవెంజర్స్ ఎడిషన్ పేరుతో వన్‌ప్లస్ 6 నుంచి మరో వేరియంట్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.మూడు రంగులు మిడ్‌నైట్‌ బ్లాక్‌, మిర్రర్‌ బ్లాక్‌, సిల్క్‌ వైట్‌ లిమిటెడ్‌ ఎడిషన్లలో ఈ ఫోన్‌ లభ్యమవుతోంది. వన్‌ప్లస్‌ 6 మార్వెల్‌ అవెంజర్స్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ ధర రూ.44,999గా కంపెనీ నిర్ణయించింది.

క్వాల్ కామ్

క్వాల్ కామ్

టెక్ దిగ్గజం క్వాల్ కామ్ వన్‌ప్లస్ కు గ్రాండ్ వెలకం చెబుతూ ఓ పోస్టును పెట్టింది. కంగ్రాచ్యులేషన్ వన్‌ప్లస్ అంటూ ట్యాగ్ ఉంచింది.కాగా ఈ ఫోన్ పవర్ పుల్ Snapdragon 845 CPUతో వచ్చింది.

క్రోమా స్టోర్స్

క్రోమా స్టోర్స్

ప్రముఖ సెల్లర్ దిగ్గజం క్రోమా ఈ ఫోన్ మీద ఆసక్తికర పోస్టును ఉంచింది. ఈ నెల 21 నుంచి అన్నీ క్రోమా స్టోర్లలో ఈఫోన్ అందుబాటులో ఉంటుందని ఆసక్తిగల వినియోగదారులు దీన్ని కొనుగోలు చేయవచ్చని తెలిపింది. అలాగే అద్భుతమైన ఆఫర్లను కూడా ప్రకటించామని చెబుతోంది.

ధర

ధర

వన్‌ప్లస్‌ 6 ప్రస్తుతం రెండు స్టోరేజ్‌ వేరియంట్లలో భారత మార్కెట్‌లోకి వస్తోంది. 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.34,999 కాగ, 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 39,999 రూపాయలు. 256జీబీ వేరియంట్‌ భారత్‌కు రావడం లేదు.

వన్‌ప్లస్ 6 స్పెసిఫికేష‌న్లు

వన్‌ప్లస్ 6 స్పెసిఫికేష‌న్లు

6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే, 2280 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 64/128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 16, 20 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, వాట‌ర్ రెసిస్టెన్స్ బాడీ, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, డ్యాష్ చార్జ్‌.

Best Mobiles in India

English summary
OnePlus 6 receives a warm welcome from leading brands across the globe More news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X