8జిబి ర్యామ్‌తో వన్‌ప్లస్ 6, ధర, ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి

Written By:

చైనా దిగ్గజం వన్‌ప్లస్ కంపెనీ కొత్త కొత్త ఆవిష్కరణల దిశగా అడుగులు వేసేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కంపెనీ ప్రతిష్టాత్మకంగా వన్‌ప్లస్ 6ని మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు రెడీ అయింది. వన్‌ప్లస్ 6 టీజ్ రిలీజయినప్పటి నుండి ఈ ఫోన్ మీద అనేక ఆసక్తికర అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ ఫీచర్లు, ధర, స్పెషిఫికేషన్లు లాంటి వివరాలను తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ ఆసక్తికర అంశాలకు సంబంధించిన వివరాలను గిజ్‌బాట్ తెలుగు ప్రత్యేకంగా షేర్ చేసుకుంటోంది. కాగా ఈ విషయాలన్నీ సోషల్ మీడియాలో లీకయిన వార్తలను బట్టి మీకు అందిచండం జరుగుతోంది. అలాగే వన్‌ప్లస్ కంపెనీ అధికారికంగా కొన్ని వివరాలను అందించడం జరిగింది. వన్‌ప్లస్ అభిమానులు వన్‌ప్లస్ 6 గురించి కొన్ని విషయాలను అందించడం జరుగుతోంది. వాటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

లాంచింగ్‌కు ముందే యూజర్లను అమితంగా ఆకర్షిస్తున్న వన్‌ప్లస్ 6

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హర్డ్‌వేర్‌లో ప్రధానమైనవి

ఈ ఫోన్ హర్డ్‌వేర్‌ విభాగంలో బెస్ట్ ఫీచర్లతో మార్కెట్లోకి రానుంది. లేటెస్ట్ గా వచ్చిన Snapdragon 845 CPUతో పాటు 68 జిబి ర్యామ్ అలాగే 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ని పొందుపరిచారు. దీని ద్వారా ఫోన్ పనితీరు మరింత వేగవంతం అవుతుంది. యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించేందుకు వన్‌ప్లస్ 6 Android 8.1 Oreo ఆపరేటింగ్ సిస్టంని పొందుపరిచారు. అలాగే త్వరలో రానున్న కొత్త ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ పీకి అప్ గ్రేడ్ చేసుకోవచ్చు.

అద్భుతమైన స్క్రీన్

వన్‌ప్లస్ 5టీతో పోలిస్తే ఈ ఫోన్ డిస్ ప్లే విభాగంలో యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించనుంది. అమోల్డ్ ప్యానల్ తో పాటు 6.ఇంచ్ edge-to-edge displayతో రానుంది. ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే నోచ్ ఫీచర్తో రానుంది. ఈ ఫీచర్ ద్వారా యూజ్లరు బెస్ట్ మల్టీమీడియా అనుభూతిని పొందుతారు. టీజర్ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. 6 సెకండ్ల వీడియోలో గెశ్చర్ తో మీ అనుభవాన్ని వేగం చేసుకోండి అని స్లోగన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

3.5mm Headphone jack intact

వన్‌ప్లస్ 6 మంచి ఆడియో క్వాలిటీని అందిస్తుందని తెలుస్తోంది. 3.5mm Headphone jack ద్వారా యూజర్లు నాణ్యమైన క్వాలిటిని అందుకునే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో వచ్చిన ఫోన్లన్నీ ఈ ఫీచర్ తోనే మార్కెట్లోకి వస్తున్నాయి. అలాగే కెమెరాను ఇష్టపడే వారికోసం ఈ ఫోన్లే అనేక ఆసక్తిర ఫీచర్లను పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. సోనీ ఇమేజ్ సెన్సార్ ద్వారా ఫోటోల క్వాలిటీ మరింతగా పెరిగే అవకాశం ఉంది. అయితే కెమెరా క్వాలిటీ గురించి పూర్తి సమాచారం లాంచ్ అయితే కాని తెలియదు. బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్ 3500mAh battery వచ్చే అవకాశం ఉంది. డాష్ ఛార్జింగ్ ద్వారా స్పీడ్ చార్జ్ అయ్యే అవకాశం కూడా ఉంది.

విడుదల, ధరపై అంచనా

కాగా ఈఫోన్ 2018 జూన్ నెలలో యూజర్ల చేతిలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు వన్ ప్లస్ సీఈఓ కూడా ట్విట్టర్లో స్పందించారు. ఈ ఫోన్ రిలీజింగ్ డేట్ Q2, 2018లో ఉంటుందని తెలిపారు. కాగా ఈ ఫోన్ ధరపై కూడా స్పష్టమైన క్లారిటీ లేదు. అంచనాల ప్రకారం 8GB RAM and 256GB ROM ఫోన్ ధర రూ. 40 వేలుగా ఉండవచ్చని తెలుస్తోంది.
వన్‌ప్లస్ 6' ఫీచర్లు ( అంచనా )
6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ వి8.0 (ఓరియో)
1440 x 2560 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్
క్వాల్‌కమ్ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 845
8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ
android 8.0 OREO
20, 16 మెగా పిక్సెల్స్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు,
20 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా
3500 ఎంఏహెచ్ బ్యాటరీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
OnePlus 6 Roundup: Specifications, features and expected price more news at Telugu Gizbot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot