వన్‌ప్లస్ 6లో అదిరిపోయే కలర్స్, స్టోరేజీ కెపాసిటీ విశేషాలివిగో..

|

ఇప్పుడు మార్కెట్లో వన్ ప్లస్ ఒక సంచలనమనే చెప్పవచ్చు. ఇప్పటి వరకూ కేవలం ఒకే కలర్ కింద ప్రాడెక్టులను ప్రవేశ పెట్టిన వన్ ప్లస్ ఇప్పడు వన్ ప్లస్ 6 విషయంలో మాత్రం మూడు వేరియంట్లలో మోడల్స్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అలాగే మూడు రకాల ప్రత్యేక ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల చేసింది. ముఖ్యంగా ర్యామ్ తో పాటు స్టోరేజీ విషయంలోనూ ఈ మూడు మోడల్స్ లో వ్యత్యాసాలున్నాయి. ఈ నేపథ్యంలో ఏ మోడల్ తీసుకుంటే బెటరో తెలుసుకోండి.

 
వన్‌ప్లస్ 6లో అదిరిపోయే కలర్స్, స్టోరేజీ కెపాసిటీ విశేషాలివిగో..

ముందుగా కలర్ ఎంచుకోండి..
వన్ ప్లస్6 మూడు ప్రత్యేక కలర్స్ తో మార్కెట్లోకి విడుదల అయ్యింది. అందులో మిర్రర్ బ్లాక్, మిడ్ నైట్ బ్లాక్, సిల్క్ వైట్ ప్రధానమైనవి. కానీ స్టోరేజీ విషయంలో మాత్రం ఒక్కో కలర్ ఒక్కో తరహా ప్రత్యేకతలు సంతరించుకుంది. అందులో చూస్తే ..
64 జీబీ స్టోరేజ్ : మిర్రర్ బ్లాక్
128 జీబీ స్టోరేజ్ : మిర్రర్ బ్లాక్, మిడ్ నైట్ బ్లాక్, సిల్క్ వైట్
256 జీబీ స్టోరేజ్ : మిడ్ నైట్ బ్లాక్
బేసిక్ మోడల్ లో కలర్ విషయంలో ఆప్షన్లు లేవు. కేవలం మిర్రర్ బ్లాక్ లోనే లభిస్తోంది. మీరు స్టోరేజీ విషయంలో పర్టిక్యులర్ గా ఉంటే మాత్రం మిడ్ నైట్ బ్లాక్ తో పాటు సిల్క్ వైట్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో కూడా సిల్క్ వైట్ ఎక్స్‌క్లూజివ్ లిమిటెడ్ ఎడిషన్‌గా అందుబాటులోకి రానుంది.

వాట్సప్ వాడటమే కాదు,ఈ తెలియని ఫీచర్లు కూడా గుర్తు పెట్టుకోండివాట్సప్ వాడటమే కాదు,ఈ తెలియని ఫీచర్లు కూడా గుర్తు పెట్టుకోండి

స్టోరేజీ ఎంతో చూసుకోండి..
ఒక్కసారి మీరు కలర్ ఎంపిక చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది స్టోరేజీ మీదనే అని చెప్పవచ్చు. 64 జీబీ విషయంలో మిర్రర్ బ్లాక్ మాత్రమే ఆప్షన్ ఉంది. ఇక అన్ని రకాల యాప్స్ వేసిన తర్వాత కూడా ఈ ఫీచర్ లో ఇంకా 10 జీబీ స్పేస్ మిగిలి ఉండటం విశేషం. ఇక స్టోరేజీ విషయంలో రెండో మోడల్ విషయానికి వస్తే 128 జీబీ అని చెప్పవచ్చు. ఇది బేస్ మోడల్ కన్నా ధర కాస్త ఎక్కువ అయినప్పటికీ 8 జీబీ ర్యామ్ దీంతో పాటు లభిస్తోంది. ఇక హెవీగా స్టోరేజీ అవసరం ఉన్న వారికి 256 జీబీ మోడల్ అవసరం కలుగుతుంది. పెద్ద ఎత్తున గేమ్స్ తో పాటు లోకల్ మీడియా స్టోరేజీ సపోర్ట్ దీని ద్వారా లభిస్తుంది. ధర విషయంలో వ్యత్యాసం ఉన్నప్పటికీ, 256 జీబీ మోడల్ హార్డ్ కోర్ టెకీలకు అత్యంత అవసరమైనది.

అధిక ర్యామ్ మీ ఫోన్ పాలిట శ్రీరామరక్ష...
వన్ ప్లస్ 6 లోని మూడు వేరియంట్లలో ర్యామ్ విషయంలో 64 జీబీ స్టోరేజీకి 6 జీబీ ర్యామ్ సపోర్ట్ గా లభిస్తోంది. నిజానికి 8 జీబీ ర్యామ్ అవసరమా అంటే అవసరం లేదనే చెప్పాలి. అయినప్పటికీ హై డ్యూటీ చేసేందుకు అవసరమనే చెప్పాలి. ఎక్కువ ర్యామ్ కలిగి ఉంటే ఫీచర్స్ ఫాస్ట్ గా పనిచేయడమే కాకుండా మీకు సమయం సేవ్ అవుతుంది. అందుకే ఎక్కువ ర్యామ్ సామర్థ్యం కలిగి ఉన్న ఫోన్ ఎంచుకోండి.

Best Mobiles in India

English summary
OnePlus 6: Which RAM and storage size should you buy? More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X