లాంచింగ్‌కు ముందే యూజర్లను అమితంగా ఆకర్షిస్తున్న వన్‌ప్లస్ 6

Written By:

వన్‌ప్లస్ నుంచి దూసుకువస్తున్న వన్‌ప్లస్ 6 లాంచింగ్ కు ముందే వినియోగదారులను ఆకర్షిస్తోంది. latest Snapdragon 845 CPUతో వస్తున్న ఈ ఫోన్ అమిత వేగంతో పనితీరును కనబరుస్తుందని ఇప్పటినుంచే అంచనాలు మొదలయ్యాయి. కాగా ఈ స్మార్ట్‌ఫోన్ 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తోంది. రానున్న కాలంలో హార్డ్ వేర్, సాప్ట్ వేర్ పరంగా ఈ ఫోన్ సరికొత్త ఒరవడికి నాంది పలుకుతుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఉపయోగకమైన ఫీచర్లతో పాటు యూజర్లను ఆకట్టుకునే లుక్ తో ఈ ఫోన్ డిజైన్ ఉందని ఫోటోలను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.కంపెనీ నుంచి ఇప్పటికే వచ్చిన OnePlus 3T, OnePlus 5T మార్కెట్లో మంచి అమ్మకాలను కొల్లగొట్టి యూజర్లను ఆకట్టుకోవడంతో ఈ ఫోన్ కూడా అదే తరహాలో వెళుతుందని తెలుస్తోంది. ఈ ఫోన్ వినియోగదారుల చేతుల్లో ఇట్టే ఇమిడిపోతుందని ఫోన్ ని చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. మరి ఫోన్లో ఉన్న ఫీచన్లపై ఓ స్మార్ట్ లుక్కేద్దామా..

అదిరిపోయే ఫీచర్లతో వన్‌ప్లస్ 6, ఆసక్తిని రేకెత్తిస్తున్న లీకులు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వన్‌ప్లస్ 6' ఫీచర్లు ( అంచనా )

6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ వి8.0 (ఓరియో)
1440 x 2560 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్
క్వాల్‌కమ్ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 845
8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ
android 8.0 OREO
20, 16 మెగా పిక్సెల్స్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు,
20 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా
3500 ఎంఏహెచ్ బ్యాటరీ

edge-to-edge display

6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ edge-to-edge display డిస్‌ప్లేతో ఈ ఫోన్ రానుంది. యూజర్లు ఈ display ద్వారా మంచి మల్టీమీడియా అనుభూతిని పొందనున్నారు. bezel-less designతో రానున్న ఈ ఫోన్లో reading, web browsing, gaming and video playback వంటి పనులు మీరు చాలా ఫాస్ట్‌గా చేయవచ్చు. ఎటువంటి అంతరాయం ఉండదు.

కెమెరా

కెమెరా విషయానికొస్తే vertical dual camer సెటప్ తో వస్తోంది. దీని ద్వారా మీరు అత్యంత తక్కువ వెలుతురులో కూడా నాణ్యమైనర ఫోటోలను తీసుకున అవకాశం ఉంది. Red colored alert slider అనే కొత్త ఫీచర్ ద్వారా మీరు మీ నోటిఫికేషన్లను వేగంగా తెలుసుకునే అవకాశం ఈ ఫోన్లో ఉంది. ఆడియో ఫైల్స్ కూడా చాలా త్వరగా ఓపెన్ అవుతాయి.దీంతో పాటు అలర్ట్ స్లైడర్ ద్వారా కెమెరా ఫోకస్ ను ఆటోమేటిగ్గా సెట్ చేసుకునే వీలుంది. అలర్ట్ స్లైడర్ ద్వారా అటు ఆడియో ప్రొఫైల్స్ అయిన రింగ్, అలాగే డూ నాట్ డిస్ట్రబ్, సైలెంట్ మోడ్స్ ను స్విచ్ చేసుకునేందుకు ఈ గెశ్చర్ ఉపయోగపడుతుంది.

గెశ్చర్స్ తో మీ అనుభవాన్ని వేగవంతం చేసుకోండి

వన్‌ప్లస్ విడుదల చేసిన ఈ టీజర్ ను ట్విట్టర్ లో విడుదల చేయగా, అందులో గెశ్చర్స్ తో మీ అనుభవాన్ని వేగవంతం చేసుకోండి అంటూ సంస్థ ట్వీట్ చేసింది. దీన్ని బట్టి పలు స్వైప్ యాక్షన్స్ ను మొబైల్ కలిగి ఉందని తెలుస్తోంది. అంటే వన్ ప్లస్ 6 టచ్ గెశ్చర్ సపోర్ట్ గా ఉందని తెలుస్తోంది. అయితే ఏ తరహా గెశ్చర్స్ ను వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ కలిగి ఉందో ఇంకా తేలాల్సి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
OnePlus 6 will bring futuristic design without compromising on basics More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot