Home
Mobile

క్రోమా స్టోర్లలో అందుబాటులోకి రానున్న వన్‌ప్లస్ 6 ఫోన్లు..

వన్ ప్లస్ 6 మే 16న లండన్ లో ఓ భారీ ఈవెంట్ సాక్షిగా మార్కెట్లోకి విడుదల అయ్యింది. ఇండియాలో ఈ ఫోన్ తర్వాత రోజు మే 17న రిలీజ్ అయ్యింది.

By M Krishna Adithya

వన్‌ప్లస్ 6 మే 16న లండన్ లో ఓ భారీ ఈవెంట్ సాక్షిగా మార్కెట్లోకి విడుదల అయ్యింది. ఇండియాలో ఈ ఫోన్ తర్వాత రోజు మే 17న రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.34999 గా నిర్ణయించారు. అయితే ఈ ఫోన్ మే 21 నుంచి అమెజాన్ లో అందుబాటులోకి రానుండగా, వన్‌ప్లస్ ఆఫీషియల్ ఆన్‌లైన్ స్టోర్ లో అందుబాటులో వచ్చింది. అయితే ప్రస్తుతం వన్ ప్లస్ 6 ఇప్పుడు క్రోమా స్టోర్స్ లో కూడా అందుబాటులోకి రానుంది.

oneplus 6

మొత్తం ఎంపిక చేసినటువంటి 112 క్రోమా స్టోర్లలో మే 22 నుంచి వన్ ప్లస్6 అందుబాటులోకి రానుంది. అయితే ఈ స్టోర్లలో ఫోన్ ల అమ్మకాలపై పలు బ్యాంకులు క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నాయి. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, పేటీఎం ద్వారా కొనుగోలు చేసే ఫోన్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్లు సైతం ప్రకటిస్తున్నారు. ఎస్ బీఐ ఓ అడుగు ముందుకు వేసి తమ బ్యాంకు కార్డుతో ఫోన్ కొనుగోలు చేస్తే రూ.2000 క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది.

కంపెనీకి చెందిన పాప్ అప్ స్టోర్స్ ను మొత్తం 8 నగరాల్లో ఏర్పాటు చేసింది. ముంబై, పునే, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, అహ్మదాబాద్‌, బెంగళూరుల్లో ఈ స్టోర్స్ ను ఏర్పాటు చేసి సేల్స్ ప్రారంభించనుంది. ఈ స్టోర్స్ మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 8 గంటల వరకూ మాత్రమే ఈ స్టోర్స్‌లో ఫోన్లను ఫ్లాష్ సేల్ లో భాగంగా అందుబాటులో ఉంచనున్నారు. అంతే కాదు 6జీబీ ర్యామ్ 64జీబీ మొబైల్ ధర రూ.34999 కాగా, 8 జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ధర్ రూ.39999 గా నిర్ణయించారు. అంతేకాదు తాజా హాలివుడ్ సంచలనం మార్వెల్ అవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ. 44999గా నిర్ణయించారు.

వన్ ప్లస్ 6 ఫీచర్లు
వన్ ప్లస్6 ఫీచర్ల విషయానికి వస్తే.. 6.28 అంగుళాల డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, వాటర్ రెసిస్టెంట్ బాడీ, 4జీ వోల్టీ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి ఫాస్ట్ చార్జింగ్, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యాష్ చార్జ్ లాంటి ఫీచర్లు వన్ ప్లస్6లో అందుబాటులోకి రానున్నాయి.

Best Mobiles in India

English summary
OnePlus 6 will go on sale via Croma stores in India from May 22 More news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X