అదిరిపోయే ఫీచర్లతో వన్‌ప్లస్ 6, ఆసక్తిని రేకెత్తిస్తున్న లీకులు
స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో సంచలనాలు నమోదు చేస్తున్న వన్‌ప్లస్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ OnePlus 6 అతి త్వరలో దూసుకురానుంది.
స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో సంచలనాలు నమోదు చేస్తున్న వన్‌ప్లస్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6 అతి త్వరలో దూసుకురానుంది.అత్యానుధిక డిజైన్‌తో యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించే విధంగా ఈ ఫోన్ రానుందని పలు రిపోర్టులు చెబుతున్నాయి. బడ్జెట్ రేంజ్ ధరలోనే ఈ ఫోన్ ఉండబోతుందని తెలుస్తోంది. OnePlus 6 గురించి ఇప్పటికే పలు రూమర్లు మార్కెట్లో షికారు చేస్తుండగా, తాజాగా రిలీజ్ చేసిన కంపెనీ టీజర్ లో మరికొన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి. ఈ ఫోన్ లేటెస్ట్ Snapdragon 845 CPUతో పాటు 8GB RAM, 256GB internal storageతో రానుందని తెలుస్తోంది. ఆక్సిజన్ ఓఎస్ తో రానున్న ఈఫోన్ మీద యూజర్లు ఇప్పటికే ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్లుగా టీజర్ ను బట్టి తెలుస్తోంది.

వన్‌ప్లస్ 6' ఫీచర్లు ( అంచనా )
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ వి8.0 (ఓరియో)
1440 x 2560 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్
క్వాల్‌కమ్ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 845
8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ
android 8.0 OREO
20, 16 మెగా పిక్సెల్స్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు,
20 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా
3500 ఎంఏహెచ్ బ్యాటరీ

అడ్వన్స్‌డ్ టచ్ గెశ్చర్ కంట్రోల్స్..
కొత్త టీజర్ లో వన్‌ప్లస్ 6 ఫోన్ ప్రత్యేకమైన అడ్వన్స్‌డ్ టచ్ గెశ్చర్ కంట్రోల్స్ ను కలిగి ఉన్నాయి. ఈ తరహా గెశ్చర్స్ కంట్రోల్స్ అండ్రాయిడ్ ఓరియో ఓపెన్ బీటా 3 అప్‌డేట్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ ఆండ్రాయిడ్ వెర్షన్ వన్ ప్లస్ 5T నుంచే అందుబాటులోకి వచ్చింది. వన్ ప్లస్ అధికారిక టీజర్స్ దృష్ట్యా, వన్ ప్లస్ 6 gesture controls సపోర్ట్ తో, మరియు Alert Slider ఫీచర్ తో రానున్నదని తెలుస్తూ ఉంది.

గెశ్చర్స్ తో మీ అనుభవాన్ని వేగవంతం చేసుకోండి
వన్‌ప్లస్ విడుదల చేసిన ఈ టీజర్ ను ట్విట్టర్ లో విడుదల చేయగా, అందులో గెశ్చర్స్ తో మీ అనుభవాన్ని వేగవంతం చేసుకోండి అంటూ సంస్థ ట్వీట్ చేసింది. దీన్ని బట్టి పలు స్వైప్ యాక్షన్స్ ను మొబైల్ కలిగి ఉందని తెలుస్తోంది. అంటే వన్ ప్లస్ 6 టచ్ గెశ్చర్ సపోర్ట్ గా ఉందని తెలుస్తోంది. అయితే ఏ తరహా గెశ్చర్స్ ను వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ కలిగి ఉందో ఇంకా తేలాల్సి ఉంది.

అలర్ట్ స్లైడర్ ద్వారా కెమెరా ఫోకస్.
దీంతో పాటు అలర్ట్ స్లైడర్ ద్వారా కెమెరా ఫోకస్ ను ఆటోమేటిగ్గా సెట్ చేసుకునే వీలుంది. అలర్ట్ స్లైడర్ ద్వారా అటు ఆడియో ప్రొఫైల్స్ అయిన రింగ్, అలాగే డూ నాట్ డిస్ట్రబ్, సైలెంట్ మోడ్స్ ను స్విచ్ చేసుకునేందుకు ఈ గెశ్చర్ ఉపయోగపడుతుంది. ఈ కొత్త గెశ్చర్ సహాయంతో కెమెరా ఫోకస్ కోసం టచ్ చేయాల్సిన పనిలేదు.

స్క్రీన్ కూడా టచ్ చేయాల్సిన అవసరం లేదు..
అలాగే క్లిక్ మనిపించేందుకు స్క్రీన్ కూడా టచ్ చేయాల్సిన అవసరం లేదు. గత వర్షన్ లో అయితే పవర్ బటన్ నొక్కితే కెమెరా వచ్చేది. అలాగే వాల్యూమ్ బటన్ తో ఫోటోలు క్లిక్ చేసుకునే వీలుండేది. అయితే కొత్త గెశ్చర్ తో ఈ పని తప్పంది.

ఫాస్ట్ డౌన్ లోడ్
వన్‌ప్లస్ 6 ఫోన్‌లో అల్ట్రా ఫాస్ట్ క్యాట్.16 గిగాబైట్ ఎల్టీఈ కనెక్టివిటీతో వన్‌ప్లస్ 6ను తయారుచేసినట్లు తెలిస్తోంది. దీని ద్వారా దాదాపు 600ఎంబీపీఎస్ స్పీడ్‌తో 4జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉండే ప్రదేశాల్లో 720పిక్సెల్ హెచ్‌డీ సినిమాను.. అంటే 2.5 నుంచి 4జీబీ సైజు కలిగిన ఫైల్‌ను కూడా సెకన్ల వ్యవధిలో డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉన్నట్లు రూమర్లు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications