డిజైన్ పరంగా సరికొత్త రికార్డు సృష్టించనున్న OnePlus 6 !

|

వన్‌ప్లస్ తరువాతి తరం ఫ్లాగ్‌షిప్ ఫోన్ వన్‌ప్లస్ 6ను కంపెనీ త్వరలో మార్కెట్లోకి ఆవిష్కరించనుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో అమితంగా రూమర్లు వస్తున్న ఫోన్ ఏదైనా ఉందంటే అది వన్‌ప్లస్ 6 మాత్రమేనని చెప్పాలి. అయితే ఇవి రూమర్లు మాత్రమే కాదు. దీనికి ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి. వన్‌ప్లస్ కంపెనీ తన ట్విట్టర్ పేజీలో ఆవిష్కరించిన టీజర్లో అనేక రకాలైన హింట్స్ ఇచ్చింది. ఈ అప్ కమింగ్ ఫోన్ లీకులతో మార్కెట్లో లాంచింగ్ కు ముందే పెద్ద హైప్ క్రియేట్ చేసింది. ఈ ఫోన్ అతి త్వరలో లాంచ్ కానున్న నేపధ్యంలో వన్‌ప్లస్ అభిమానులకు రోజురొజుకు దీని మీద తెగ ఆసక్తి పెరిగుతుందే కాని తగ్గడం లేదు. దీనికి కారణం నిన్న కంపెనీ సీఈఓ Pete Lau ఈ ఫోన్ డిజైన్ గురించి బహిర్గతం చేయడమే. ఆయన చేసిన పోస్టు రాబోయ్ వన్‌ప్లస్ 6 గురించి యూజర్లు ఏం అంచా వేస్తున్నారో అనే దానికి క్లియర్ ఐడియాను అందిస్తోంది. ఆయన చేసిన పోస్ట్ ప్రకారం చూస్తే వన్‌ప్లస్ 6 గతంలో వచ్చిన ఫోన్ల కన్నా మెరుగైన డిజైన్ తో నిర్మితమైనట్లు తెలుస్తోంది. ఈ పోస్టులో సారాంశాన్ని పరిశీలిస్తే..

 

40 Mpతో 3 కెమెరాల స్మార్ట్‌ఫోన్,అదరగొడుతున్న ఫీచర్లు,బడ్జెట్ ధర

OnePlus's first phone to feature a glass back

OnePlus's first phone to feature a glass back

వన్‌ప్లస్ ఫోన్లు అంటేనే ప్రత్యేక డిజైన్ తో ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రానున్న వన్‌ప్లస్ 6 కూడా దీనికి ఊతమిచ్చేలా రాబోతోంది. వన్‌ప్లస్ నుంచి రానున్న ఫోన్ ఆ కంపెనీ చరిత్రలో లేని విధంగా సరికొత్త డిజైన్ glass backతో వస్తోంది. డిజైన్ ద్వారా మార్కెట్లో ఓ ట్రెండ్ సృష్టించేందుకు రెడీ అయింది. ఈ గ్లాస్ డిజైన్ ఆకర్షణ మాత్రమే కాకుండా యూజర్లకు సరికొత్త ఫీలింగ్ ని అందిచనుంది.

 నాన్ టెక్ కోటింగ్

నాన్ టెక్ కోటింగ్

ఏది ఏమైనప్పటికీ వన్‌ప్లస్ 6 glass back డిజైన్‌తోనే కాకుండా 5-layer Nanotech Coating రేర్ ప్యానల్‌తో వస్తోంది. ఇలాంటి కోటింగ్ తో ఇప్పటివరకు ఏ ఇతర స్మార్ట్‌ఫోన్ రాలేదు. ఈ అదనపు కోటింగ్ ద్వారా ఫోన్ మరింత ఆకర్షణీయంగా తయారై మంచి అనుభూతిని అందించడమే కాకుండా యూజర్ల చేతిలో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వెనుక భాగంలో వైర్‌లెస్ చార్జింగ్ కోసం గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

OnePlus's honest design approach
 

OnePlus's honest design approach

వన్‌ప్లస్ కంపెనీ ఇటువంటి డిజైన్ కోసం దాదాపు 70 రకాల glass prototypes మీద పరీక్షలు నిర్వహించింది. వాటిల్లో నుంచి ఈ బెస్ట్ డిజైన్ సెలక్ట్ చేయడం జరిగింది. కంపెనీ ఎప్పుడూ ఇటువంటి డిజైన్ విషయంలో రాజీ పడలేదు. వన్ ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌లో 6 ఇంచుల డిస్‌ప్లే, అధునాతన స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తదితర పవర్‌ఫుల్ ఫీచర్లను ఏర్పాటు చేసినట్లు తెలిసింది.

 Truly bezel-less design

Truly bezel-less design

వన్‌ప్లస్ 6 ఫ్రంట్ ప్యానల్ మొత్తం bezel-less designతో వచ్చింది. ఈ రకమైన డిజైన్ ద్వారా యూజర్లు అద్భుతమైన వ్యూయింగ్ అనుభూతిని పొందుతారు. న్యూ నాచ్ డిజైన్ తో మీకు గరిష్టంగా అంటే పూర్తి స్తాయిలో వ్యూ అనుభూతిని ఆస్వాదిస్తారు. ఈ డిజైన్లోనే సెల్ఫీ కెమెరాలు సెన్సార్లు కూడా కలిసి ఉంటాయి. వాటికోసం ప్రత్యేకంగా ఎటువంటి నొక్కులు పొందుపరచలేదు.

Water-resistant body

Water-resistant body

డిజైన్ మాత్రమే కాకుండా వన్‌ప్లస్ 6 ఎన్నడూ చూడని కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి వస్తోందని తెలుస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ ద్వారా ఈ ఫోన్ వాటర్ resistant bodyతో రానుందని తెలిసింది. గతంలో వచ్చిన వన్‌ప్లస్ మోడల్స్‌లో లేని విధంగా వన్ ప్లస్ 6లో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను కూడా ఏర్పాటు చేశారని తెలిసింది.

Takeaway

Takeaway

సోషల్ మీడియాలో వస్తున్న రూమర్ల ప్రకారం OnePlus 6 OnePlus అభిమానులకు పండత వాతావరణాన్ని కల్పించడం ఖాయంగా కనిపిస్తోంది. రానున్న ఫోన్ డిజైన్ విషయంలో సరికొత్త ట్రాక్ రికార్డును నెలకొల్పుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. శాంసంగ్, ఆపిల్ ఫోన్లను సవాల్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. అయితే పూర్తి వివరాలు తెలియాలంటే ఫోన్ విడుదల తేదీ వరకు ఆగక తప్పదు..!

 రిలీజింగ్ డేట్

రిలీజింగ్ డేట్

వన్‌ప్లస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ వన్ ప్లస్ 6ను మే 17వ తేదీన భారత కాలమానం ప్రకారం ఉదయం 7.30 గంటలకు బీజింగ్‌లో జరగనున్న ఓ ఈవెంట్‌లో వన్‌ప్లస్ 6ను విడుదల చేయనున్నారు. ఇక అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు ముంబైలో జరగనున్న ప్రత్యేక ఈవెంట్‌లో వన్‌ప్లస్ 6ను భారత్‌లోనూ లాంచ్ చేయనున్నారు. తరువాత ఈ ఫోన్ మే 21వ తేదీ నుంచి భారత్‌లో యూజర్లకు లభిస్తుంది. ఎప్పటిలాగే అమెజాన్ సైట్‌లో ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా విక్రయించనున్నారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
OnePlus 6 will set a new design standard with its gorgeous glass back More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more