వన్‌ప్లస్ 6టి ఎందుకు కొనాలి, ఎందుకు కొనకూడదో తెలుసుకోండి
చైనా మొబైల్ తయారీ దిగ్గజం వన్‌ప్లస్ కంపెనీ తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ వన్‌ప్లస్ 6టిని గత వారం లాంచ్ చేసిన సంగతి విదితమే. దీని ప్రారంభ ధర రూ. 37,999గా ఉంది.
చైనా మొబైల్ తయారీ దిగ్గజం వన్‌ప్లస్ కంపెనీ తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ వన్‌ప్లస్ 6టిని గత వారం లాంచ్ చేసిన సంగతి విదితమే. దీని ప్రారంభ ధర రూ. 37,999గా ఉంది. కాగా వన్‌ప్లస్ కంపెనీ నుంచి వచ్చిన మోస్ట్ వాల్యుబుల్ అలాగే హై ఎండ్ ధరలో వచ్చి మొట్టమొదటి ఫోన్ కూడా ఇదేనని చెప్పవచ్చు. గతంలో వచ్చిన వన్‌ప్లస్ 6లో కొన్ని మార్పులను చేర్పులను చేసి వన్‌ప్లస్ 6టిని ఇండియా మార్కెట్లోకి కంపెనీ తీసుకువచ్చింది. గతంలో వచ్చిన వన్‌ప్లస్ 5, వన్‌ప్లస్ 5టి విజయవంతమైన నేపథ్యంలో కంపెనీ 6 సీరిస్ లో కూడా అదే ఒరవడిని కొనసాగించింది. అయితే ఇంత భారీ బడ్జెట్ ఫోన్ ని యూజర్లు ఎందుకు కొనాలి అనేదానిపై మీకు GizBot Telugu ఓ స్పెషల్ స్టోరీని అందిస్తోంది. ఓ స్మార్ట్ లుక్కేయండి.

ఎందుకు కొనవచ్చు....
ఫింగర్ ప్రింట్ సెన్సార్
తొలిసారిగా వన్‌ప్లస్ తన వన్‌ప్లస్ 6టి ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేసింది. దీంతో కేవలం 0.34 సెకన్ల వ్యవధిలోనే ఫోన్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు. ఈ తరహా ఫీచర్ ఇతర ఫోన్లలో చాలా తక్కువగా ఉంది.

వాల్యూ ఫర్ మనీ
6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 549 డాలర్లు (దాదాపుగా రూ 37,999)గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 579 డాలర్లు (దాదాపుగా రూ.42,490)గా ఉంది. ఇక 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 629 డాలర్లు (దాదాపుగా రూ.46,160)గా ఉంది. ధర ఎక్కువైనప్పటికీ ఫీచర్ల పరంగా ఈ ఫోన్ దిగ్గజాలను ఢీకొంటుందని కచ్చితంగా చెప్పవచ్చు.

బ్యాటరీ
వన్‌ప్లస్ 6టి ఫోన్‌లో 3700 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఉంది.

బిగ్గర్ స్క్రీన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, డిజైన్
ఇందులో 6.41 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్‌ను దీనికి అందిస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్‌లను ఏర్పాటు చేయడం వల్ల ఫోన్ వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది. ఈ ఫోన్‌లో వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌ను అందిస్తున్నారు.

కెమెరా , హార్డ్ వేర్
వన్‌ప్లస్ 6టి ఫోన్ వెనుక భాగంలో 16, 20 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇందులో అందిస్తున్నారు.

ఎందుకు కొనకూడదు..
ప్రాసెసర్
ఈ విషయంలో వన్‌ప్లస్ 6టి ఫోన్ యూజర్లను నిరాశపరిచింది. ఎందుకంటే వన్‌ప్లస్ 6లో కూడా సేమ్ ఇదే ప్రాసెసర్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ ని రెండింటిలో నిక్షిప్తం చేశారు.

IP68 dust and water-proof
ఇది కావాలనుకున్న వారు దీనిని కొనేందుకు ముందుకు రాకండి. ఎందుకంటే ఈ ఫోన్లో ఈ సదుపాయం అందుబాటులో లేదు. వన్‌ప్లస్ 6టిలో కంపెనీ ఎందుకో IP68 dust and water resistant ఫీచర్ ని అందించలేదు.

3.5ఎంఎం ఆడియో జాక్
ఈ ఫోన్ లో ఇది ఓ పెద్ద మైనస్ గా చెప్పుకోవచ్చు. ఇందులో 3.5ఎంఎం ఆడియో జాక్‌ను పూర్తిగా తీసేశారు. అందువల్ల యూఎస్‌బీ టైప్ సి పోర్టుకే ఇయర్‌ఫోన్స్‌ను కనెక్ట్ చేసుకుని ఆడియో వినాల్సి ఉంటుంది.

అమ్మకాలు ఆపే అవకాశం...
కంపెనీ నుంచి మరో ఆరు నెలల్లో వన్‌ప్లస్ 7 లాంచ్ కానున్న నేపథ్యంలో ఈ ఫోన్ అమ్మకాలను పూర్తిగా ఆపివేసే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు దీన్ని కొనుగోలు చేయకపోవడమే మంచిదని విశ్లేషకులు చెబుతున్నారు.

వన్ ప్లస్ 6టి ఫీచర్లు
6.41 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0పై, డ్యుయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాటర్ రెసిస్టెంట్, యూఎస్‌బీ టైప్ సి, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.


Click it and Unblock the Notifications