OnePlus 6T కొంటున్నారా, సిటి బ్యాంక్ భారీ డిస్కౌంట్‌పై ఓ లుక్కేయండి

చైనాకు చెందిన మొబైల్స్ తయారీ దిగ్గజం వన్‌ప్లస్ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6టి ని న్యూయార్క్‌లో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో అక్టోబర్ 30న లాంచ్ చేసిన సంగతి విదితమే.

|

చైనాకు చెందిన మొబైల్స్ తయారీ దిగ్గజం వన్‌ప్లస్ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6టి ని న్యూయార్క్‌లో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో అక్టోబర్ 30న లాంచ్ చేసిన సంగతి విదితమే. నవంబర్ 1 నుంచి ఇది మార్కెట్లోకి వెళ్లింది.ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 549 డాలర్లు (దాదాపుగా రూ.40,290)గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 579 డాలర్లు (దాదాపుగా రూ.42,490)గా ఉంది. ఇక 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 629 డాలర్లు (దాదాపుగా రూ.46,160)గా ఉంది. ఈ ఫోన్ కొనుగోలుదారులకు సిటిబ్యాంక్ రూ.1500 క్యాష్ బ్యాక్ ఆఫర్ ని అందిస్తోంది. ఈ ఆఫర్ డిసెంబర్ 10 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

 

అదిరే ఫీచర్లతో Infinix Note 5 Stylus, ధర రూ. 15,999అదిరే ఫీచర్లతో Infinix Note 5 Stylus, ధర రూ. 15,999

 సిటిబ్యాంక్ డెబిట్ కార్డు కాని క్రెడిట్ కార్డు కాని కలిగి ఉండాలి...

సిటిబ్యాంక్ డెబిట్ కార్డు కాని క్రెడిట్ కార్డు కాని కలిగి ఉండాలి...

ఈ ఆఫర్ పొందాలంటే మీరు సిటిబ్యాంక్ డెబిట్ కార్డు కాని క్రెడిట్ కార్డు కాని కలిగి ఉండాలి. ఈ కార్డులు మీ దగ్గర ఉన్నట్లయితే అమెజాన్ ఇండియా సైటు ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇది కూడా లిమిటెడ్ పిరియడ్ ఆఫర్లో ఉన్నందున ఓ సారి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఆఫర్...

ఈ ఆఫర్...

నవంబర్ 23 నుంచి డిసెంబర్ 10 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. మీరు మినిమం రూ.22 వేలను ఒకేఒక లావాదేవీతో జరపాల్సి ఉంటుంది. ఇలా లావాదేవీ జరిపిన వారికి రూ.1500 క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే మీరు రూ, 4500 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఈ మొత్తం మీకు మార్చి 10 2019న క్రెడిట్ అవుతుంది.

 కంపెనీ ఈ ఈఫోన్ లాంచ్ సమయంలోనే పలు ఆఫర్లను....
 

కంపెనీ ఈ ఈఫోన్ లాంచ్ సమయంలోనే పలు ఆఫర్లను....

దీంతో పాట కంపెనీ ఈ ఈఫోన్ లాంచ్ సమయంలోనే పలు ఆఫర్లను ప్రకటించింది. దాదాపు రూ.5400 వరకు ఓచర్లను పొందుతారు. అదనంగా 3టిబి జియో డేటాను కూడా ఈ ఫోన్ కొనుగోలుతో అందిస్తోంది. కిండ్లే బుక్స్ మీద 6 శాతం తగ్గింపును ఇస్తోంది. అదనగా డ్యామేజి ప్రొటెక్షన్ , ఈఎమ్ఐ ఆప్సన్లకు కూడా అందిస్తోంది.

 

 

6.41 ఇంచుల భారీ డిస్‌ప్లే...

6.41 ఇంచుల భారీ డిస్‌ప్లే...

ఇందులో 6.41 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్‌ను దీనికి అందిస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్‌లను ఏర్పాటు చేయడం వల్ల ఫోన్ వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది. ఈ ఫోన్‌లో వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌ను అందిస్తున్నారు.

కెమెరా...

కెమెరా...

వన్‌ప్లస్ 6టి ఫోన్ వెనుక భాగంలో 16, 20 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇందులో అందిస్తున్నారు.

ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌..

ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌..

కాగా తొలిసారిగా వన్‌ప్లస్ తన వన్‌ప్లస్ 6టి ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేసింది. దీంతో కేవలం 0.34 సెకన్ల వ్యవధిలోనే ఫోన్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో 3.5ఎంఎం ఆడియో జాక్‌ను పూర్తిగా తీసేశారు. అందువల్ల యూఎస్‌బీ టైప్ సి పోర్టుకే ఇయర్‌ఫోన్స్‌ను కనెక్ట్ చేసుకుని ఆడియో వినాల్సి ఉంటుంది. వన్‌ప్లస్ 6టి ఫోన్‌లో 3700 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఉంది.

 

 

Best Mobiles in India

English summary
Buy OnePlus 6T with Rs. 1,500 cashback until December 10: Here’s how you can avail the discount more News at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X