Home
Mobile

వన్‌ప్లస్ 6టీ ఇండియా లాంచ్ గురించి పూర్తి వివరాలు

ఇండియన్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన ముద్రవేసిన వన్‌ప్లస్ తన మార్కెట్‌ను ఇంకా విస్తరిస్తోంది.

ఇండియన్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన ముద్రవేసిన వన్‌ప్లస్ తన మార్కెట్‌ను ఇంకా విస్తరిస్తోంది. వన్‌ప్లస్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్‌ప్లస్ 6టీ లాంఛింగ్‌కు సర్వం సిద్ధమైంది. అక్టోబర్ 30న రాత్రి 8.30 గంటలకు ఫోన్ లాంఛ్ చేయనున్నట్టు ఆ కంపెనీ గతంలోనే ప్రకటించింది. న్యూ ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ ఈవెంట్ జరగనుంది.

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న వన్‌ప్లస్, తన బ్రాండ్ వాల్యూను మరింతగా పెంచుకుంటోంది. వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి ఇప్పటివరకు మార్కెట్లో లాంచ్ అయిన ప్రతి స్మార్ట్‌ఫోన్ అటు పనితీరు పరంగా, ఇటు ధర పరంగా ఏ ఒక్కరిని నిరుత్సాహాపరచలేదు. హై-ఎండ్ స్పెసిఫికేషన్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అందించటమే వన్‌ప్లస్ ప్రధాన లక్ష్యం.

ఎక్కడి నుండైనా లాంచ్ ఈవెంట్ ను చూడొచ్చు...

ఎక్కడి నుండైనా లాంచ్ ఈవెంట్ ను చూడొచ్చు...

ఈ లాంచ్ ఈవెంట్‌ను వన్‌ప్లస్ ఇండియా అఫీషియల్ వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. ఈ ఈవెంట్‌కు హాజరయ్యే అభిమానులకు అక్కడ ఏర్పాటు చేసే ఎక్స్‌పీరియన్స్ జోన్‌లో ఫోన్‌ను చేతితో పట్టుకుని చూడటంతో పాటు డివైస్ పనితీరను విశ్లేషించే వీలుంటుంది. ఒక వేళ ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోతే ఎక్కడైనా నుండి లైవ్ స్ట్రీమింగ్ ట్యూన్ చేయవచ్చు. లైవ్ స్ట్రీమింగ్ రాత్రి 8:00 గంటల వద్ద ప్రారంభమవుతుంది. మీరు లైవ్ స్ట్రీమ్ కోసం తెలియజేయడానికి రిమైండర్ ను కూడా సెట్ చేయవచ్చు.

ఈ రోజే వన్‌ప్లస్ 6టీ ను ప్రీ-బుకింగ్ చేసుకోండి....

ఈ రోజే వన్‌ప్లస్ 6టీ ను ప్రీ-బుకింగ్ చేసుకోండి....

వన్‌ప్లస్ కంపెనీ అభిమానుల కోసం ఈ వన్‌ప్లస్ 6టీ ను ప్రీ బుకింగ్ చేసుకునే అవకాశం కలిపిస్తుంది . ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రీ బుకింగ్స్ Amazon.in,మరియు OnePlus ఎక్సక్లూజివ్ ఆఫ్ లైన్ స్టోర్స్ లో మొదలయ్యాయి. ప్రీ-బుకింగ్ ఆఫర్ ను పొందడం కోసం Amazon.in లో రూ. 1000 విలువ చేసే e-Gift Card ను కొనుగోలు చేయాలి.నవంబర్ 2వ తేదీ ఈ వన్‌ప్లస్ 6టీ ఓపెన్ సేల్ లో వచ్చాక ఆ డబ్బు ను రీడీమ్ చేసుకొనే అవకాశం వన్‌ప్లస్ కంపెనీ కలిపిస్తుంది. ప్రీ బుకింగ్ చేసుకున్న వినియోగదారుడికి రూ. 1490 విలువ చేసే Type-C Bullets ఇయర్ ఫోన్స్ కూడా వస్తాయి. అలాగే రూ.500 అమెజాన్ పే బ్యాలన్స్ కూడా లభిస్తుంది. రూ.1500 తో ప్రీ బుకింగ్ చేసిన కస్టమర్ కి రూ.1000 విలువ చేసే గిఫ్ట్ కార్డు లభిస్తుంది.

లాంచ్ డే ఆఫర్లు..

ఒక బ్రాండ్ గా OnePlus ఎల్లప్పుడూ ప్రతీ నూతన ఉత్పత్తి ప్రయోగంలో ఉత్సాహభరిత ఆఫర్లను అందిస్తుంది.వన్‌ప్లస్ 6టీ 'అన్ లాక్ ది స్పీడ్ ఆఫర్'ని ఆఫర్ చేయడానికి రిలయన్స్ జియోతో కంపెనీ చేతులు కలిపింది. ఆఫర్ కింద, వినియోగదారులకు రూ. 5,400 ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది . అయితే దాని కోసమై www.jio.com లేదా రిలయన్స్ డిజిటల్ స్టోర్స్, మై జియో స్టోర్స్, జియో రిటైలర్లు, మరియు ది MyJio యాప్ లో రూ. 299 రీఛార్జి చేసుకోవాలి.

 

 

ఫ్యూచరిస్టిక్ స్క్రీన్ అన్‌లాక్ టెక్నాలజీ..

ఫ్యూచరిస్టిక్ స్క్రీన్ అన్‌లాక్ టెక్నాలజీ..

వన్‌ప్లస్ తన లేటెస్ట్ 6టీ స్మార్ట్‌ఫోన్‌లో ఫ్యూచరిస్టిక్ స్క్రీన్ అన్‌లాక్ ఫీచర్‌ను ఇన్‌బిల్ట్ చేసింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ ఇంకా ఫౌండర్ Pete Lau అఫీషియల్ కన్ఫర్మ్ చేసారు. ఈ ఫీచర్‌కు సంబంధించి ఓ టీజర్‌ను కూడా వన్‌ప్లస్ విడుదల చేసింది. ఈ 5 సెకన్ల వీడియోలో ఫోన్‌లోని ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా మరింత లోతుగా రివీల్ చేసే ప్రయత్నం చేసారు. వన్‌ప్లస్ తన ఫ్యూచరిస్టిక్ స్క్రీన్ అన్‌లాక్ టెక్నాలజీ పై అనేక నెలలపాటు శ్రమించింది. దీంతో ఫోన్ అన్‌లాక్ సమయాన్ని మిల్లీ సెకన్లలోకి తీసుకురాగలిగింది.

 

 

బెస్ట్-ఇన్-క్లాస్ హార్డ్ వేర్ పెర్ఫార్మన్స్...

బెస్ట్-ఇన్-క్లాస్ హార్డ్ వేర్ పెర్ఫార్మన్స్...

వన్‌ప్లస్ 6టీ బెస్ట్-ఇన్-క్లాస్ హార్డ్ వేర్ పెర్ఫార్మన్స్ అందిస్తుంది. స్మార్ట్ ఫోన్ ప్రధాన స్నాప్ డ్రాగన్ 845 CPU తో మద్దతు ఇస్తుంది మరియు ఎంచుకోవడానికి 6జీబీ మరియు 8జీబీ ర్యామ్ ఎంపికలను కలిగి ఉంటుంది. భారీ 3,700 mAH బ్యాటరీ యూనిట్ మరియు గ్లిచ్-ఫ్రీ మరియు మేధో ఆక్సిజన్OS తో కలిపి,వన్‌ప్లస్ 6టీ శక్తిని కలిగి ఉంటుంది. మీరు ప్లే అవుతున్న గేమ్స్ లేదా బ్యాక్ గ్రౌండ్లో ఎన్ని యాప్స్ యాక్టీవ్ గా ఉన్నాయోనా పట్టింపు లేకుండా , వన్‌ప్లస్ 6టీ లాగ్-రహిత సాఫ్ వేర్ మరియు హార్డ్ వేర్ పనితీరును అందిస్తుంది.

ఆండ్రాయిడ్ Pie అడాప్టివ్ బ్యాటరీ ఫీచర్..

ఆండ్రాయిడ్ Pie అడాప్టివ్ బ్యాటరీ ఫీచర్..

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి వన్‌ప్లస్ 6టీ, Android Pie అవుట్-ఆఫ్-బాక్స్ ఆపరేటింగ్ సిస్టంతో వస్తోంది. ఈ అప్‌డేట్‌ను ఆక్సిజన్ ఓఎస్ స్కిన్‌తో వన్‌ప్లస్ అందించబోతోంది. ఆండ్రాయిడ్ Pie ఆపరేటింగ్ సిస్టంతో భారత్‌లో లాంచ్ కాబోతోన్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా వన్‌ప్లస్ 6టీ చరిత్రసృష్టించబోతోంది.ఈ లేటెస్ట్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టంకు అడాప్టివ్ బ్యాటరీ ఫీచర్ ప్రధానమైన హైలైట్‌గా నిలుస్తుంది. ఈ ఫీచర్ ఫోన్‌లోని అప్లికేషన్‌లను నిరంతరం మానిటర్ చేస్తూ అవసరమైన బ్యాటరీ పవర్‌ను మాత్రమే అవి ఉపయోగించుకునేలా చూస్తుంది. Android Pie అప్‌డేట్‌తో కూడిన ఆక్సిజన్ ఓఎస్ 9.0 స్కిన్ వన్‌ప్లస్ 6కు కూడా లభించబోతోంది.

టైప్-సీ వన్‌ప్లస్ బుల్లెట్ ఇయర్ ఫోన్స్...

టైప్-సీ వన్‌ప్లస్ బుల్లెట్ ఇయర్ ఫోన్స్...

వన్ ప్లస్ తన 6టీ డివైస్ తో పాటుగా యూఎస్బీ టైప్-సీ సపోర్టుతో కూడిన బుల్లెట్స్ వెర్‌లైస్ హెడ్‌ఫోన్‌లను కూడా మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. . ఈ కొత్త హెడ్‌ఫోన్స్‌లో ఫెర్ఫామెన్స్, బ్యాటరీ‌లైఫ్ ఇంకా సోనిక్ సిగ్నేచర్ మరింత అప్‌డేటెడ్‌గా ఉండనున్నాయని సమాచారం. బీటీ32బీ అనే మోడల్ నెంబర్‌తో విడుదల కాబోతోన్న ఈ విప్లవాత్మక ఇయర్‌ఫోన్స్ ధర ఇండియన్ మార్కెట్లో రూ.1,490 గా ఉంది.

రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లలో వన్‌ప్లస్ 6టీ....

రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లలో వన్‌ప్లస్ 6టీ....

వన్‌ప్లస్ కంపెనీ వ్యాపార విస్తరణలో భాగంగా రిలయన్స్ డిజిటల్‌తో చేతులు కలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో నెం.1 రిటైలింగ్ చెయిన్‌గా అవతరించిన రిలయన్స్ డిజిటల్‌ వన్‌ప్లస్ మొబైల్ ఫోన్‌లను ఆఫ్‌లైన్‌లో విక్రయించబోతోంది. కస్టమర్స్ వీటిని కొనుగోలు చేసే ముందు ఎక్స్‌పీరియన్స్ చేసే అవకాశాన్ని కూడా ఈ రిటైల్ చెయిన్ కల్పించబోతోంది.రిలయన్స్ డిజిటల్‌ స్టోర్‌లలో విక్రయించే వన్‌ప్లస్ ఫోన్‌ల పై ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవు. ఆన్‌లైన్‌లో ఎంత ధర అయితే ఉంటుందో ఆఫ్‌లైన్‌‍లోనూ అంతే ధర ఉంటుంది. భారతదేశంలోని ఏ రిలయెన్స్ డిజిటల్ స్టోర్‌లో అయినా వన్‌ప్లస్ 6టీ ఆన్‌లైన్ ధరకే కొనుక్కోవచ్చు. రిలయెన్స్ డిజిటల్ స్టోర్లల్లో ఉండే ఆఫర్లను కూడా పొందొచ్చు.కొనుగోలు చేయడానికి

వన్‌ప్లస్ తన అఫ్‌లైన్ మార్కెట్‌ను మేజర్ మెట్రో నగరాలకు మాత్రమే పరిమితం చేయకుండా లక్నో, మంగళూరు, విశాఖపట్నం, భువనేశ్వర్, గౌహతి, మొహాలి, కోయంబత్తూర్ వంటి సెమీ నగరాలకు కూడా విస్తరించబోతోంది. రిలయన్స్ డిజిటల్‌ స్టోర్ లతో పాటు క్రోమ్ స్టోర్స్ కూడా వన్ ప్లస్ ఫోన్ లను ఆఫ్ లైన్ లో విక్రయించబోతున్నాయి. క్రోమాకు దేశవ్యాప్తంగా 110 స్టోర్లు ఉన్నాయి. వాటిలో 20 ప్రముఖ స్టోర్ లలో వన్‌ప్లస్ డివైసస్ అందుబాటులో ఉంటాయి.

 

Best Mobiles in India

English summary
OnePlus 6T: Everything you need to know before the official Indian launch event.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X