OnePlus 6T రిలీజ్ డేట్ ఇంకా స్పెసిఫికేషన్స్..

వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి ఏదైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లాంచ్ అవుతుందంటే చాలు, దానిక ముందుగా నెలకునే హడావిడే వేరుగా ఉంటుంది.

|

వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి ఏదైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లాంచ్ అవుతుందంటే చాలు, దానిక ముందుగా నెలకునే హడావిడే వేరుగా ఉంటుంది. సరిగ్గా అటువంటి పరిస్థితే ఇప్పుడు కూడా నెలుకుంది.వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడెడ్ మోడల్‌గా త్వరలో మార్కెట్లో లాంచ్ కావొచ్చని భావిస్తోన్న వన్‌ప్లస్ 6టీ పై ఇప్పటికే అనేక రూమార్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే వన్‌ప్లస్ 6టీ విడుదలకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎటువంటి అఫీషీయల్ న్యూస్‌ను వెల్లడించలేదు.

కొత్త టెక్నాలజీతో దూసుకొస్తున్న OPPO F9 Proకొత్త టెక్నాలజీతో దూసుకొస్తున్న OPPO F9 Pro

డిస్‌ప్లేలో ఎటువంటి నాట్చెస్ ఉండకపోవచ్చు..

డిస్‌ప్లేలో ఎటువంటి నాట్చెస్ ఉండకపోవచ్చు..

వన్‌ప్లస్ తన ‘టీ' వేరియంట్ నుంచి ఇప్పటి వరకు లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్‌లలో డిస్‌ప్లే స్పెసిఫికేషన్‌ను అంతగా అప్‌డేట్ చేయలేదు. దీంతో వన్‌ప్లస్ 6 మాదిరిగానే 6టీ మోడల్ డిస్‌ప్లేలో కూడా ఎటువంటి మార్పులు చేయకపోవచ్చని తెలుస్తోంది. పలు రిపోర్ట్స్ ప్రకారం వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్ 6. 28 అంగుళాల ఫుల్‌హెచ్‌డి లేదా ఫుల్‌హెచ్‌‌డి ప్లస్ స్ర్కీన్‌ను కలిగి ఉండే అవకాశముందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లేలో ఎటువంటి నాట్చెస్ ఉండకపోవచ్చట. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 లేదా 855 సాక్ పై వన్‌ప్లస్ 6టీ రన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఆండ్రాయిడ్ 9.0 Pie..

ఆండ్రాయిడ్ 9.0 Pie..

ఆపరేటింగ్ సిస్టం విషయానికి వచ్చేసరికి వన్‌ప్లస్ 6టీ మోడల్ ఆండ్రాయిడ్ 9.0 Pie ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు ముఖ్యమైన కారణంగా ఇప్పటికే వన్‌ప్లస్ 6 మోడల్ ఆండ్రాయిడ్ పీ బేటా ప్రోగ్రామ్ పై రన్ అవుతుంది. కాబట్టి వన్‌ప్లస్ 6టీ మోడల్‌లో ఆండ్రాయిడ్ 9.0 Pie ఆధారంగా అభివృద్థి చేసిన ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టంను ఈ ఫోన్‌లో పొందుపరిచే అవకాశం ఉంది.

256జీబి ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యంతో..

256జీబి ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యంతో..

ఇక ర్యామ్ విషయానికి వచ్చేసరికి వన్‌ప్లస్ 6 మాదిరిగానే 6టీ మోడల్ కూడా 6జీబి ఇంకా 8జీబి ర్యామ్ వేరియంట్‌లలో అందబాటులో ఉండే అవకాశం ఉంది. స్టోరేజ్ పరంగా 64జీబి, 128జీబి ఇంకా 256జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో ఈ డివైస్‌ను అందుబాటులో ఉంచొచ్చు. వీటితో పాటు స్టోరేజ్ పెంచుకునేందుకుగాను మైక్రోఎస్డీ స్లాట్ సదుపాయాన్ని కూడా ఫోన్‌లో పొందుపరిచే అవకాశం ఉంది.

పాప్-అప్ కెమెరా మెకనిజం..

పాప్-అప్ కెమెరా మెకనిజం..

కెమెరా విషయానికి వచ్చేసరికి వన్‌ప్లస్ 6టీ మోడల్‌లో ఒప్పో, వివో తరహాలోనే పాప్-అప్ కెమెరా మెకనిజంను ఏర్పాటు చేసే అవకాశముందని తెలుస్తోంది. ఇదే సమయంలో ట్రిపుల్ రేర్ కెమెరా సపోర్టుతో ఈ ఫోన్ లభించే అవకాశం ఉంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేసరికి మెరుగుపరచబడిన సోనీ సెన్సార్‌తో కూడిన 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూనిట్‌లు డివైస్‌లో నిక్షిప్తం చేసే అవకాశముందని తెలుస్తోంది.

నవంబర్ లేదా డిసెంబర్‌లో మార్కెట్లోకి..?

నవంబర్ లేదా డిసెంబర్‌లో మార్కెట్లోకి..?

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఏకంగా 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశముంది. భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటోన్న వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్‌ను నవంబర్ లేదా డిసెంబర్‌లో మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఇండియన్ మార్కెట్లో ఈ డివైస్ ధర రూ.35,000లోపు ఉండొచ్చని సమాచారం.

Best Mobiles in India

English summary
onePlus 6 generated a lot hype before its launch. So much so that few days before its unveiling we saw several headlines and news making way on the web talking about it. Some reports even started talking about the smartphone few days after the launch of OnePlus 6T itself.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X