అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ఒకరోజు ముందే నవంబర్-1న, వన్ ప్లస్ 6T ఫస్ట్ సేల్ మరియు నవంబర్-2న ఓపెన్ సేల్

|

వన్ ప్లస్ 6T, నిన్న అక్టోబర్ 29, 2018 న న్యూయార్క్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించబడింది. మరియు, ఢిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో భారత దేశంలో ఈరోజు, అనగా అక్టోబర్ 30న ఆవిష్కరించబడుతుంది. ఈ మొబైల్ ఇంకా విడుదల కానప్పటికీ, అందరిలో ఆసక్తిని మాత్రం రేపుతూ ఉంది. మనం ఇప్పటికే కొన్ని నివేదికల్లో ఊహించిన ధరలను, ఫీచర్ల గురించిన అనేక వివరాలను తెలుసుకుంటూ వచ్చాము. అంతేకాకుండా, ఈ కంపెనీ నుండి వచ్చిన అధికారిక టీజర్లు, ఈ స్మార్ట్‌ఫోన్‌ నుండి మనం ఎటువంటి ఫీచర్లను ఆశించవచ్చునో చెప్పకనే చెబుతున్నాయి.

 

దివాళి కానుకగా 'గిఫ్ట్ కార్డ్' లాంచ్ చేసిన జియోదివాళి కానుకగా 'గిఫ్ట్ కార్డ్' లాంచ్ చేసిన జియో

ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ ఇండియా....

ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ ఇండియా....

ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ ఇండియా, వన్ ప్లస్ కంపెనీ కోసం ప్రత్యేకంగా ఉంటుందని ఇదివరకే మనకు తెలుసు. గతంలో వచ్చిన నివేదిక ప్రకారం, నవంబర్ 2, 2018న భారత దేశంలో అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కంపెనీ సూచించింది. అయినప్పటికీ, అమెజాన్ వెబ్సైట్లో ప్రవేశపెట్టిన కొత్త బ్యానర్ ప్రకారం, నవంబరు 1 నుండి అమ్మకాన్ని కొనసాగిస్తుందని నిర్ధారించబడుతుంది. క్రమంగా అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఒకరోజు ముందుగానే నవంబరు 1న సేల్ ప్రారంభం కావొచ్చునని నమ్మకం కలిగిస్తూ ఉంది.

అధికారిక వన్ ప్లస్ వెబ్సైట్....

అధికారిక వన్ ప్లస్ వెబ్సైట్....

అమెజాన్ ఇండియాతో పాటు, అధికారిక వన్ ప్లస్ వెబ్సైట్, వన్ ప్లస్ ఎక్స్క్లూజివ్ స్టోర్స్ మరియు దేశవ్యాప్తంగా ఉన్న క్రోమా అవుట్లెట్ల ద్వారా కూడా వన్ ప్లస్ 6T అందుబాటులో ఉంటుంది. భారతదేశంలోని టైర్ 2 నగరాలలో ( 50 వేల నుండి లక్ష మద్య ప్రజలు గల నగరాలు ) ఈ మొబైల్ యొక్క ఆఫ్లైన్ అమ్మకాలను విస్తరించే క్రమంలో భాగంగా రిలయన్స్ డిజిటల్ సహాయం తీసుకున్నట్లుగా ఇప్పటికే కంపెనీ అధికారికంగా ధృవీకరించింది.

భారతదేశం లో వన్ ప్లస్ 6T అంచనా ధర :
 

భారతదేశం లో వన్ ప్లస్ 6T అంచనా ధర :

భారతదేశంలో రాబోయే ఫ్లాగ్ షిప్ కిల్లర్ వన్ ప్లస్ 6T ధర దాని స్టోరేజ్ వేరియంట్ల ప్రకారం, నిర్ధారించబడుతుందని అందరికీ తెలిసిన విషయమే. క్రమంగా ఈ వన్ ప్లస్ 6T పరికరం మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ సారి, సంస్థ విడుదల చేస్తున్న వన్ ప్లస్ 6T 64GB ని పక్కన పెట్టి, దాని బేస్ వేరియంట్లో 128GB ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారం 6GB RAM మరియు 128GB ఇంటర్నెల్ మెమరీతో బేస్ వేరియంట్ విడుదల చేయబడుతుంది మరియు దీని ధర సుమారుగా రూ. 37,999. గా ఉండనుంది. వన్ ప్లస్ 6T యొక్క మిడ్ వేరియంట్ 8GB RAM + 128GB ఇంటర్నల్ మెమరీతో రూ. 40,999 గా ఉండగా, చివరగా దీని హై-ఎండ్ మోడల్ 8GB RAM కలిగి, 256 GB ఇంటర్నల్ మెమొరీని కలిగి ఉన్నట్లుగా, మరియు దీని ధర సుమారుగా రూ. 44,999 గా ఉండనున్నట్లు తెలుస్తుంది.

 

 

స్మార్ట్‌ఫోన్‌ ఇప్పటికే ప్రీ ఆర్డర్ తో అమెజాన్ వెబ్సైట్లో కనిపిస్తూ ఉంది....

స్మార్ట్‌ఫోన్‌ ఇప్పటికే ప్రీ ఆర్డర్ తో అమెజాన్ వెబ్సైట్లో కనిపిస్తూ ఉంది....

ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇప్పటికే ప్రీ ఆర్డర్ తో అమెజాన్ వెబ్సైట్లో కనిపిస్తూ ఉంది. మరియు ముందస్తుగా స్మార్ట్ఫోన్ బుక్ చేసుకునే వారికి, కొనుగోలు మీద రూ. 1,000 వరకు డిస్కౌంట్ కూడా లభించనుంది. అంతేకాకుండా, వన్ ప్లస్ 6T కొనుగోలులో బ్యాంకు మరియు టెలికాం భాగస్వామ్యాల నుండి కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఈ సమయంలో, కంపెనీ USB టైప్ C కేబుల్ సపోర్ట్ ఉండేలా బుల్లెట్ హెడ్ఫోన్లను తీసుకుని వస్తుంది. అంతేకాకుండా, కొన్ని స్టెప్స్ అనుసరించడం ద్వారా కూపన్ కోడ్ పొంది, 1500 విలువైన ఈ హెడ్ఫోన్లను ఉచితంగా పొందేలా వినియోగదారులకు అవకాశం కల్పించింది.

 

 

క్రెడిట్ మరియు డెబిట్ కార్డులు ఉపయోగించి కొనుగోలు చేసే వారికి....

క్రెడిట్ మరియు డెబిట్ కార్డులు ఉపయోగించి కొనుగోలు చేసే వారికి....

ఇక బాంక్ ఆఫర్లను చూస్తే, ICICI క్రెడిట్ మరియు డెబిట్ కార్డులు, CITI బ్యాంక్ క్రెడిట్ కార్డులు ఉపయోగించి కొనుగోలు చేసే వారికి 2000రూపాయలు షరతులతో కూడిన ఇన్స్టంట్ కాష్ బాక్ అందిస్తుంది. అమెజాన్-పే బాలన్స్ ఉపయోగించి కొనుగోలు చేసేవారికి 1000 రూపాయల అదనపు కాష్ బాక్ సౌలభ్యం కూడా ఉంది. కానీ ఇందులో పూర్తి అమౌంట్ ఒకేసారి చెల్లించవలసి ఉంటుంది. ఇక టెలికాం ఆఫర్ల కిందకు వస్తే, జియో తన వోచర్ కోడ్ల ద్వారా 5400 రూపాయల అదనపు ప్రయోజనాన్ని అందిస్తుంది. అనగా ఒక్కొక్కటి 150 రూపాయల విలువైన 36 వోచర్లను అందివ్వనుంది. ఈ వోచర్ల సహాయంతో ప్రతినెలా 299 రీచార్జ్ చేసుకునే వారికి, 150 రూపాయల చొప్పున 36 నెలల పాటు డిస్కౌంట్ లభించనుంది. కానీ, ఈ ఆఫర్ కేవలం నవంబర్ 1, 2018 నుండి జనవరి 29, 2019 మద్య వన్ ప్లస్ 6T కొనుగోలు చేసిన వినియోగదారులకు మాత్రమే లభిస్తుంది. ఈ వోచర్లను 2022 మార్చ్ 31 లోపు వినియోగించుకోవచ్చునని జియో తెలిపింది. మరియు ఒక రీచార్జ్ కోసం ఒక వోచర్ మాత్రమే వినియోగించవలసి ఉంటుంది.

 

 

అద్భుతం అన్నట్లుగా ఉన్న వన్ ప్లస్ 6T....

అద్భుతం అన్నట్లుగా ఉన్న వన్ ప్లస్ 6T....

ఫీచర్స్ ఎంత అద్భుతమో, ఆఫర్స్ అంత అద్భుతం అన్నట్లుగా ఉన్న వన్ ప్లస్ 6T, ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉత్తమ మొబైల్స్ జాబితాలో ఒకటిగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

Best Mobiles in India

English summary
OnePlus 6T first sale on November 1 for Amazon Prime members; open sale on November 2.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X