విడుదలకు ముందే వైరల్ అవుతోన్న ‘OnePlus 6t‘

ఇండియన్ స్మార్ట్‌‌‌ఫోన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నస్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో వన్‌ప్లస్ (OnePlus) ఒకటి.

|

ఇండియన్ స్మార్ట్‌‌‌ఫోన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నస్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో వన్‌ప్లస్ (OnePlus) ఒకటి. బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లలో వన్‌ప్లస్ ఆఫర్ చేస్తోన్న హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లు, మార్కెట్లోని ఇతర గ్లోబల్ బ్రాండ్‌లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇటీవల ఈ బ్రాండ్ నుంచి మార్కెట్లో లాంచ్ అయిన OnePlus 6 పాజిటివ్ ఫీడ్‌బ్యాక్‌తో స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని శాసించే ప్రయత్నం చేస్తోంది.

oneplus-6t-get-ready-for-unmatched-performance-and-future-ready-experiences

వన్‌ప్లస్ 6 ఇచ్చిన బూస్టప్‌తో మరింత దూకుడు పెంచిన వన్‌ప్లస్ '6టీ’ వేరియంట్‌ను మరింత గ్రాండ్ లుక్‌లో మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అప్‌కమ్మింగ్ స్మార్ట్‌ఫోన్ గురించి ఇప్పటికే అనేక రూమార్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. మార్కెట్ వర్గాల విశ్లేషణ ప్రకారం ఈ అప్‌కమ్మింగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ అవుట్- ఆఫ్-ద-బాక్స్ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియన్స్‌ను యూజర్లకు చేరువచేయబోతోందట. వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అవుతోన్న పలు ఆసక్తికర రూమర్స్ గురించి ఇప్పుడు చర్చించుకుందాం..

ఫ్యూచరిస్టింగ్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానింగ్ టెక్నాలజీ..

ఫ్యూచరిస్టింగ్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానింగ్ టెక్నాలజీ..

వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్‌‌కు సంబంధించిన సెక్యూరిటీ విభాగాలను మరింత విప్లవాత్మకంగా వన్‌ప్లస్ తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఈ ఫ్లాగ్‌షిప్ డివైస్‌లో నిక్షిప్తం చేసిన ఫ్యూచరిస్టిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానింగ్ టెక్నాలజీ ఫోన్ పనితీరునే పూర్తి మార్చివేయబోతోందట. వన్‌ప్లస్ 6టీ డివైస్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను ఆ సంస్థ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయవల్సి ఉంది.

 

 

తక్కువ నాట్చ్‌తో బెటర్ క్వాలిటీ డిస్‌ప్లే ఎక్స్‌పీరియన్స్..

తక్కువ నాట్చ్‌తో బెటర్ క్వాలిటీ డిస్‌ప్లే ఎక్స్‌పీరియన్స్..

వన్‌ప్లస్ 6టీకి సంబంధించిన డిస్‌ప్లే ఎక్స్‌పీరియన్స్‌ను మరింతగా మెరుగుపరిచే క్రమంలో మినిమల్ నాట్చ్ డిజైన్‌తో ఈ ఫోన్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన క్రిస్ప్ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ స్ర్కీన్ ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్‌ప్లే సీమ్‌లెస్ మల్టీమీడియా వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను యూజర్లకు అందించబోతోందట. వన్‌ప్లస్ 6టీ స్ర్కీన్ పై వాటర్ డ్రాప్ తరహాలో కనిపించే నాట్చ్‌లో ఫోన్ ఫ్రంట్ కెమెరా బిల్ట్ అయి ఉంటుందట. ఫుల్ స్ర్కీన్ వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను తీసుకురావటం ద్వారా వన్‌ప్లస్ 6టీ యూజర్లు గేమ్స్, వెబ్ బ్రౌజింగ్ ఇంకా హైడెఫినిషన్ వీడియోలను వీక్షిస్తోన్న సమయంలో హైక్వాలిటీ విజువల్ అనుభూతులకు లోనవుతారట.

ట్రిపుల్ లెన్స్ కెమెరా సెటప్..

ట్రిపుల్ లెన్స్ కెమెరా సెటప్..

వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్‌‌కు ట్రిపుల్ లెన్స్ కెమెరా సెటప్ మరో ప్రధానమైన హైలైట్‌గా నిలవబోతోందట. ఫోన్ వెనుక భాగంలో సెటప్ చేసిన మూడు ప్రత్యేకమైన కెమెరా లెన్సులు, స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీ విభాగంలో సరికొత్త సంచలనాలకు తెరలేప బోతున్నాయట. మూడువ లెన్సును తీసుకురావటం ద్వారా లో లైట్ ఫోటోగ్రఫీ మరింతగా మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆండ్రాయిడ్ 9.0 అవుట్-ఆఫ్-ద-బాక్స్

ఆండ్రాయిడ్ 9.0 అవుట్-ఆఫ్-ద-బాక్స్

ఆపరేటింగ్ సిస్టం విషయానికి వచ్చేసరికి వన్‌ప్లస్ 6టీ మోడల్ ఆండ్రాయిడ్ 9.0 అవుట్-ఆఫ్-ద-బాక్స్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే అవకాశం ఉంది. వన్‌ప్లస్ 6 మోడల్ ఇప్పటికే ఆండ్రాయిడ్ పీ బేటా ప్రోగ్రామ్ పై రన్ అవుతోంది. దీని బట్టి చూస్తే వన్‌ప్లస్ 6టీ మోడల్‌లో ఆండ్రాయిడ్ 9.0 Pie ఆధారంగా అభివృద్థి చేసిన ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టంను పొందుపరిచే అవకాశం ఉంది.

 

 

ఫాస్టర్ డ్యాష్ ఛార్జ్ టెక్నాలజీ..

ఫాస్టర్ డ్యాష్ ఛార్జ్ టెక్నాలజీ..

వన్‌ప్లస్ బ్రాండ్ తన డ్యాష్ ఛార్జ్ టెక్నాలజీ ద్వారా ఇండస్ట్రీ బెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఆఫర్ చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో, త్వరలో లాంచ్ చేయబోతోన్నవన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్‌‌లోనూ ఇదే తరహా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని వన్‌ప్లస్ నిక్షిప్తం చేసే అవకాశం ఉంది. రూమర్స్ మిల్స్ రివీల్ చేసిన వివరాల ప్రకారం 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశముంది.

స్నాప్‌డ్రాగన్ 855 సీపీయూ, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్

స్నాప్‌డ్రాగన్ 855 సీపీయూ, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్

బెస్ట్-క్లాస్ హార్డ్‌వేర్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను అందించటంలో వన్‌ప్లస్ దిట్ట. ఇప్పటి వరకు మనం చూసినట్లయితే మార్కెట్లో లాంచ్ అయిన ప్రతీ వన్‌ప్లస్ డివైస్ కూడా టాప్-ఎండ్ ప్రాసెసర్స్‌తో పాటు లీడింగ్ ర్యామ్ కాన్ఫిగరేషన్‌లను కలిగి ఉంది. వన్‌ప్లస్ ఫోన్‌లలో గేమింగ్ దగ్గర నుంచి మల్టిటాస్కింగ్ వరకు అన్ని విభాగాలు వేగవంతంగా స్పందించగలుగుతాయి.
ఇక వన్‌ప్లస్ 6టీకి సంబంధించిన ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి ఈ డివైస్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 సీపీయూను వన్‌ప్లస్ పొందుపరచబోతున్నట్లు సమాచారం. డెడికేటెడ్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్‌తో వస్తోన్న ఈ చిప్‌సెట్ హైక్వాలిటీ పనితీరును ఆఫర్ చేయగలుగుతుందట. ఈ లెటెస్ట్ వెర్షన్ చిప్‌సెట్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎబిలిటీస్‌ను కలిగి ఉండటంతో పాటు బెటర్ క్వాలిటీ గేమింగ్ తో పాటు కెమెరా అలానే బ్యాటరీ విభాగాలను మరింతగా బలపరచగలుగుతుందట. గ్లాస్ బ్యాక్ ప్యానల్‌తో వస్తోన్న ఈ ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయగలుగుతుందట.

 

 

 

Best Mobiles in India

English summary
OnePlus 6T: Get ready for unmatched performance and future-ready experiences.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X