OnePlus 6Tలో 4వ సీక్రెట్ కెమెరా, సంచలన విషయం వెలుగులోకి..
చైనా దిగ్గజం OnePlus కంపెనీ దిగ్గజాలకు సవాల్ విసురుతూ హై ఎండ్ మార్కెట్లోకి OnePlus 6Tని తీసుకువచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
చైనా దిగ్గజం OnePlus కంపెనీ దిగ్గజాలకు సవాల్ విసురుతూ హై ఎండ్ మార్కెట్లోకి OnePlus 6Tని తీసుకువచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. హై ఎండ్ ఫీచర్లతో ఆపిల్, శాంసంగ్ ఫోన్లకు పెను సవాల్ విసురుతూ మార్కెట్లో ఈ ఫోన్ దూసుకుపోతోంది.అదిరిపోయే డిస్ ప్లే, అలాగే పవర్ పుల్ బ్యాటరీ, పవర్ పుల్ ప్రాసెసర్, మంచి నాణ్యమైన కెమెరా సెన్సార్లు OnePlus 6Tలో పొందుపరిచారు. రెండు రేర్ కెమెరాలు అలాగే సింగిల్ ఫ్రంట్ కెమెరా OnePlus 6Tలో ఉన్నాయని ఇప్పటిదాకా మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఈ ఫోన్లో మరో హిడెన్ కెమెరా ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిని సాక్ష్యాలతో సహా బయటపెడుతున్నారు. మరి అవేంటో ఓ స్మార్ట్ లుక్కేయండి.

యూట్యూబ్ లో ఫోన్ల మీద ప్రయోగాలు చేసే JerryRigEverything's lab..
యూట్యూబ్ లో ఫోన్ల మీద ప్రయోగాలు చేసే ప్రముఖ యూట్యూబర్ JerryRigEverything's lab ఈ ఫోన్ పార్టులను విడదీసి ల్యాబ్ లో టెస్ట్ లు చేసింది. ఇందులో ఆసక్తికరంగా ఈ కెమెరా బటయపడింది.
ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు...
ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ దగ్గర నాలుగవ కెమెరా కనిపించింది. ఈ కెమెరాతో ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఒక్కో పార్టటు విడదీస్తూ వెళుతుండగా....
అతను ఒక్కో పార్టటు విడదీస్తూ వెళుతుండగా ఈ విషయం బయటపడింది. ముందుగా బ్యాటరీ ఆ తర్వాత మదర్ బోర్డు, ఫ్రంట్ గ్లాసులకు సంబంధించిన Screwలను రిమూవ్ చేస్తుంటే సడన్ గా ఈ నాలువ కెమెరా కనిపించింది.

in-display fingerprint scanner, speaker and the USB Type-C....
మొత్తం 7Srewలను రిమూవ్ చేససినట్లుగా వీడియోలో కనిపిస్తోంది.in-display fingerprint scanner, speaker and the USB Type-C పోర్ట్ లకు సంబంధించిన అన్ని భాగాలను ఫోన్ నుండి విడదీసినట్లుగా తెలుస్తోంది. వీటిల్లో ఇన్ డిస్ ప్లే పింగర్ ప్రింట్ దగ్గర నాలుగవ కెమెరా ఉన్నట్లు బహిర్గతమైంది.

ఈ ఫోన్ మిర్రర్ బ్లాక్, మిడ్నైట్ బ్లాక్ కలర్ మోడల్స్లో విడుదల కాగా....
ఈ ఫోన్ మిర్రర్ బ్లాక్, మిడ్నైట్ బ్లాక్ కలర్ మోడల్స్లో విడుదల కాగా, ఈ ఫోన్లో 6 జీబి ర్యామ్, 128 జీబి స్టోరేజ్ వేరియంట్ ధర 549 డాలర్లు (దాదాపు రూ .40,290). అలాగే 8 జీబి ర్యామ్, 128 జీబి స్టోరేజ్ వేరియంట్ ధర 579 డాలర్లు (సుమారు రూ .42,490) గా ఉంది. ఇక 8 జీబి ర్యామ్, 256 జీబి స్టోరేజ్ వేరియంట్ ధర 629 డాలర్లు (దాదాపు రూ .46,160) గా ఉంది.

వన్ ప్లస్ 6 టి ఫీచర్లు
6.41 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గోరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగెన్ 845 ప్రాసెసర్, 6/8 జీబి ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యూయల్ సిమ్, 16, 20 మెగాపిక్సల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాటర్ రిసిస్టెంట్, యూఎస్బీ టైప్ సి, 4 జీ వీవోల్ట్ ఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.


Click it and Unblock the Notifications








