దేశీయ మార్కెట్లో వన్‌ప్లస్ 6టి ధర ఎంతో తెలుసా..?
చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6టిని గత రెండు రోజుల కిందట విడుదల చేసిన విషయం తెలిసిందే . ఈ ఫోన్‌ను నిన్న భారత మార్కెట్‌లో లాంచ్ చేశారు.
చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6టిని గత రెండు రోజుల కిందట విడుదల చేసిన విషయం తెలిసిందే . ఈ ఫోన్‌ను నిన్న భారత మార్కెట్‌లో లాంచ్ చేశారు. ఈ క్రమంలో వన్‌ప్లస్ 6టి స్మార్ట్‌ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ భారత్‌లో రూ.37,999 ధరకు లభ్యం కానుంది. అలాగే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.41,999 ఉండగా, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.45,999 గా ఉంది. రేపటి నుంచి ఈ ఫోన్లను అమెజాన్, వన్ ప్లస్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్స్‌లో విక్రయించనున్నారు. నవంబర్ 3వ తేదీ నుంచి వన్‌ప్లస్ ఆఫ్‌లైన్ స్టోర్లు, రిలయన్స్ డిజిటల్, క్రోమా స్టోర్స్‌లోనూ వన్‌ప్లస్ 6టి ఫోన్లను విక్రయించనున్నారు.

ఫీచర్లు...
6.41 ఇంచుల డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాటర్ రెసిస్టెన్స్, యూఎస్‌బీ టైప్ సి ఆడియో, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

ఫోన్ కొన్న వారికి నో కాస్ట్ EMI....
నవంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ఈ ఫోన్‌ను కొన్న వారికి నో కాస్ట్ EMI సదుపాయం అందుబాటులో ఉంటుంది.

అమెజాన్ పే ద్వారా కొంటే....
అమెజాన్ పే ద్వారా కొంటే రూ.1వేయి క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.2వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు.

ఫోన్ కొనుగోలు చేసిన వారు కోటక్ 811 అకౌంట్ తీసుకుంటే....
ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన వారు కోటక్ 811 అకౌంట్ తీసుకుంటే రూ.2వేల విలువైన యాక్సిడెంట్ అండ్ లిక్విడ్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్‌ను ఉచితంగా పొందవచ్చు.

రిలయెన్స్ డిజిటల్ స్టోర్‌లో....
భారతదేశంలోని ఏ రిలయెన్స్ డిజిటల్ స్టోర్‌లో అయినా వన్‌ప్లస్ 6టీ ఆన్‌లైన్ ధరకే కొనుక్కోవచ్చు. రిలయెన్స్ డిజిటల్ స్టోర్లల్లో ఉండే ఆఫర్లను కూడా పొందొచ్చు. జియో నుంచి రూ.299 మొదటి ప్రీపెయిడ్ రీఛార్జ్‌పై రూ.5,400 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. రూ.150 విలువైన 36 ఓచర్లు లభిస్తాయి.


Click it and Unblock the Notifications








